Thursday, November 8, 2018

గద్వాల సంస్థానం - శతకసాహిత్యం

🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸

             *గద్వాల సంస్థానం - శతకసాహిత్యం*
     తెలుగుశతక సాహిత్యానిక మ.న.జిల్లా సంస్థానాలుకూడ
తమవంతు సేవ అందించాయి.తమ బంధువర్గానికి సంబం ధించిన పరిగిప్రాంతపు రూప్ఖాన్ పేటరత్నమ్మగారు రచించిన
*కుర్మతిశ్రీనివాస శతకము* నుగద్వాలసంస్థానపు సాహిత్య
విద్యాముకుర ముద్రాక్షరశాలలో ముద్రింపించారు.ఈ శతకం తెలియవచ్చినంతలో గద్వాలసంస్థానంవారు ముద్రించిన మొదటి శతకం. ఆత్మకూరుసంస్థానానికి చెందిన జోస్యం
పద్మనాభయ్య రచించిన చంద్రగిరిరామలింగేశ్వరశతకం కూడ
గద్వాలవారి సాహిత్యవిద్యాముకుర ముద్రాక్షరశాల లోనే 1902లో ముద్రితమైంది.వనపర్తి సంస్థానానికి చెందిన
పెదమందడి అయ్యమాచార్యంలవారి కేశవశతకం,జటప్రోలు సంస్థానానికి చెందిన తెల్కపల్లి రామచంద్రశాస్త్రిగారి హయగ్రీవ
శతకం గద్వాలపాలకులూ ముద్రింప జేశారు.
    అజ్ఞాతపూర్వకవులూ,పూర్వకవులూ,సంస్థానాశ్రితకవులూ
రచించిన శతకాలనుకూడ గద్వాల పాలకులు ప్రచురించి తమ సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు.
*1.దేవకీనందన శతకము*  ఇది అజ్ఞాత పూర్వకవి కృతం.
గద్వాలసంస్థానంవారితాళపత్రసంచయంలోఉండినది.శార్దూల  మత్తేభ  విక్రీడితాలలో ఉన్న ఈ శతక మకుటం  " కృష్ణా!
దేవకీ నందనా! ". ఈశతకం 1929లో శ్రీలక్ష్మీముద్రాక్షర శాలలో ముద్రితం.
*2.శ్రీకృష్ణ శతకము* ఈ శతకం కూడా సంస్థానంవారి తాళ
పతహర  సంచయంలో   ఉండినది.దీని  కర్త  మథిలీకృష్ణ ప్రధానుడు.ఇతనిది కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల. సురపురం సంస్థానంలో ఉండినవాడు. గద్వాల సురపురం
సంస్థానాలలో అక్కడివారు ఇక్కడకు ఇక్కడివారు అక్కడకు
వెళుతుండడం, కప్పట్రాళ్లాకు సురపురం ప్రభువులకు బంధు
త్వం ఉండడం ఈ సందర్భాన గుర్తించవలసిన అంశం. ఈ శతకం 1929 లో గద్వాలలోని శ్రీలక్ష్మీ ముద్రాక్షర శాలలో
ముద్రితం.చింతామణి నరసింహాచార్యులవారు ఈ శతకానికి
పీఠికను సంతరించారు.శతకంలో 119 పద్యాలున్నవి.అవి
శార్దఃల మత్తేభవిక్రీడిత వృత్తాలు. "కృష్ణా! కృష్ణ! కృష్ణావనా! "
అనేది శతకంలోని మకటం.
*3.కప్పట్రాళ్ల చెన్నకేశవ శతకము*  ఈ శతకం కూడా
మథలీకృష్ణప్రథానుడు రచించినదే. శతకంలో 100 శార్దూల
విక్రీడిత వృత్తాలు కూడా - " క,ప్పట్రాళ్లాధిప!చెన్నకేశవ!హరీ!
బ్రహ్మాద్యమర్త్యాదరీ! " అనే మకుటంతో ఉన్నాయి. ఈ శతకం
ఏకప్రాస శతకం, ప్రతి పద్యంలోని మూడవ పాదం చివరి
అక్షరం నుండి నాలుగవపాదం పూర్తి అయ్యే వరకూ ఒకమాదిరిగానే ఉండి ఏక ప్రాస మకుటంగా భాసించింది.
ఈ శతకం 1930లోఆదిలక్ష్మీదేవమ్మగారు శ్రీలక్ష్మీముద్రాక్షర
శాల -గద్వాలలో ముద్రింపించారు.
*4.రఘువీర శతకము* ఈ శతకం కూడా గద్వాల ప్రభు వుల తాళపత్ర సంచయంలో ఉండినది. నేటి కడపజిల్లాలోని
ఒంటిమిట్టలో వెలసిన రఘురాముని స్తుతిస్తూ  త్రిపురాంతక
కవి రచించిన శతకమిది.లభించిన తాళపత్ర ప్రతిలో 95 పద్యాలు మాత్రమే ఉన్నవి. శతక మకుటం " ఒంటిమిట్ట
రఘువీరా!జానకీ నాయకా! "అనేది మకుటం. ఈ శతకానికి
గద్వాలసంస్థానంలో అధికారిగ ఉండిన గుండేరావు హర్కారే
గారు పీఠిక రచించిరి.ఈ శతకాన్ని 1930లో ఆదిలక్ష్మీ దేవమ్మగారు శ్రీ లక్ష్మీముద్రాక్షర శాలలో‌ముద్రింపించారు.
  పైన పెర్కొన్నవి గద్వాల పాలకులు ప్రచురించిన పూర్వ కవుల శతకాలు.
*5.కేశవ శతకము* దీని  కర్త గద్వాల సంస్థానాశ్రిత కవి చెమికెల చెన్నారెడ్డి. శార్దూల మత్తేభ విక్రీడిత వృత్తాలలో -     " గద్వాల శ్రీ కేశవా! "  అనే మకుటంతో 114 పద్యాలలో రాసిన శతకం ఇది.
*6.సునీతి శతకము* దీనికర్త కవిసింహ పోకూరి కాశీపతి.
నూట ఎనిమిది గీతపద్యాల ఈ శతకంలోని మకుటం-
'ఆదిలక్ష్మీమహారాణి యనఘవాణి'. 1931లోగద్వాలలోని
లక్ష్మీ ముద్రాక్షరశాలలో ముద్రితం.
  *7.సుబోధశతకము* దీని కర్త ఆదిపూడి సోమనాథరావు.
శతకంలో 101గీతపద్యాలు ఉన్నవి.  'సద్గుణశ్రేణి! యాది
లక్ష్మమ్మ రాణి' అని శతక మకుటం.1931లో గద్వాలలోని
లక్ష్మీముద్రాక్షరశాలలో ముద్రితం.
     *8.కేశవేంద్ర విలాసము*  ఈ శతక కర్త జంద్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి. ఇందలి మకుటం 'ప్రథిత గద్వాల సంస్థాన
భాసమాన, సత్కృపాసద్మ!చెన్నకేవ!మహత్మ!'100 పద్యాల ఈ శతకం 1931లో మాఘపూర్ణిమనాడు ఈ
శతకం ఆదిలక్ష్మీదేవమ్మగారికి అంకితభావంతో అందించబడింది.ఈ  కృతి 1932లో గద్వాలలోని లక్ష్మీచెన్నకేశవ ముద్రాక్షరశాలలో ముద్రితం.
   *9.శ్రీ రామ మంత్రశతకము* దీనీ కర్త శీమకుర్తి గురుమూర్తి, ఇది సీసపద్య శతకం. 'రామ నీనామమంత్రంబు
రమ్యముగను,దలచి మోక్షంబం గొనువాడు ధన్యుడతడు'.
1936లో గద్వాలలోని చెన్నకేశవ ముద్రాక్షరశాలలో ముద్రితం.
    *10.శ్రీహరి శతకము* దీని కర్త ఆదిపూడి ప్రభాకరశాస్త్రి.
58 పద్యాలు మాత్రమే లభ్యం.
       *11.జగదీశ శతకము* కర్త ఆదిపూడి‌ప్రభాకర శాస్త్రి.
కొంతభాగమే లభ్యం.
           మొదట పెర్కొన్న 4శతకాలతో కలిపి ఈ సంస్థానం నుండి 15 శతకాలు వెలువడినవి.
           మ.న.జిల్లా సంస్థానాల శతకసాసాహిత్యం ప్రత్యేకంగ
పెర్కొనదగినదిగ వఖలంవడటం విశేషం.
                         
                        🙏🙏🙏🙏🙏

                ✍వైద్యంవేంకటేశ్వరాచార్యులు

🌷🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸🌷🌸🌷

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...