శ్రీ అష్టముఖ సోడశ బాహు ఉగ్రనరసింహ స్వామి
మరియు విశ్వనాథ ఆలయం నరసింహులపల్లె
గంగాధర మండలం
కరీంనగర్ జిల్లా
స్వామి వైభవం:
పంచముకంగా ఖ్యాతికెక్కిన నరసింహ ఆలయాల తరువాతి మహిమోపీతమైన నృసింహుళపల్లిలో కొలువైన ఈ ఆలయం దీనికి నందనగిరిగా పేరు
క్రీ. శ. 1865 లో కల్పకోట కృష్ణయ్య దేశపాండ్య రాముడిగారి స్వప్నంలో స్వామివారు కనిపించి తానున్న చోటును చూపించి దుపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయమని స్వామి చెప్పారట
అప్పుడు ఆ ప్రాంతం కింకారణ్యంగా ఉండేదట కృష్ణయ్య దేశపాండ్య గారు కొండపై గుహలో స్వామిని చేశారట తదనంతరం గుహముందు ముఖమండపం ముఖ్యద్వారం ప్రాకారం రాతిమెట్లు కూడా నిర్మించి నిత్యపూజాదికాలు జరిగేవట
ఆలయ చరిత్ర:
శాతవాహన చక్రవర్తి శ్రీముకుని కుమారుడైన శతకర్ణి తన జైత్రయాత్రలో భాగంగా ఈ నందగిరి లో విడిది చేశాడట ఇక్కడ ప్రకృతిని చూసి ముగ్దుడై ఇక్కడ కోటను నిర్మించాడట
తరువాతి కాలంలో చాలిక్యులు కాకతీయులు ఇక్కడి ఆలయాన్ని పోషించి అర్చనలు గావించారని స్థలపురాణం
ఈ ఆలయం 6వ శతాబ్ద క్రితం నిర్మితమైదని పేర్కొంటారు
శాలివాహన శకం 7-8 కాలానికి చెందినదిగా 321 సంవత్సరంలో శాతవాహన రాజులు వేములవాడ చాలిక్యుల వైభవాన్ని తలపించిన ఈ ప్రాంతం ఎంతో ఆధ్యాత్మికత చరిత్రను వైభవాన్ని సంతరించుకుంది ఇలాంటి ఆలయాన్ని రక్షించి కాపాడి పూర్వవైభవం తీసుకురావాలని తెలంగాణ తీర్థం ఆకాంక్ష
ఈ ప్రాంతం లో కొలువైన విశ్వనాథ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల పురాతన ఆలయం గా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది
కానీ ఈ ఆలయం శిథిలంగా కనిపిస్తుంది ఇదే ప్రాంతంలో వెలసిన సీతారామాలయం సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు చూస్తుంటే ఈ గ్రామానికి ప్రాంతానికి ఎంతోప్రాముఖ్యత ఉన్నట్టు తెలుస్తోంది
ఆలయం చేరుకోవటం ఎలా:
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని గంగాధరా మండల్లో ఒక చిన్న గ్రామం ఈ నరసింహుళపల్లె ఇది నరసింహపుపల్లి పంచాయత్ కింద వస్తుంది. ఇది కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ కరీంనగర్ నుండి ఉత్తర దిశగా 26 కిమీ దూరంలో ఉంది.
No comments:
Post a Comment