Tuesday, November 20, 2018

వ్యాఘ్రేశ్వరం

శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామీ.దేవాలయము
వ్యాఘ్రేశ్వరం గ్రామము .అంబాజీపేట మండలం. తూ.గో.జిల్లా
ఈ ప్రాంతము  అంతా పూర్వకాలములో ఒక అటవీ  ప్రాంతం .
ఒక బ్రాహ్మణుడు మహా శివరాత్రి పర్వదినాన మారేడు పత్రీ ,మరియు సమిధలకై అడవిలోనికి వెళ్ళగా అతనిని ఒక పెద్దపులి వెంబడిస్తూ,  తరుముతూ ఉండగా ఆ బ్రాహ్మణుడు  పారిపోతూ ఒక జమ్మి వృక్షము పైకి  ఎక్కి కుర్చుని  తన ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఆ వ్యాఘ్రం ఆకలిదై యండి , ఆ వృక్షం కింద బ్రహ్మణుడికై  వేచి చూస్తూ ఉన్నది.
ఎంతకు ఆ పులి చేట్టుక్రిండనుండి కదలిక అట్లే ఉండుట గ్రహించి,ఏమిచేయలో పాలు పోలేక
ఆ ఉన్న వ్యాఘ్రము ను పరమ శివుడు గా తలంచి , ఒక్కొక్క జమ్మి పత్రము కోసి క్రింద నున్న పులి పై ఓం నమః శివయః అని భక్తి తో ,  పరమ శివుడు గా తలంచి,జమ్మి పత్రము లతో పూజిస్తూ ఉండెను.   రాత్రి అంతా ఆ విధంగా బ్రాహ్మణుడు గడిపి ఉదయాన క్రింద చూడగా  క్రింద పులి ఉన్న ప్రాంతం కదలిక కనిపించక పోవుటచే మెల్లగా చేట్టుదిగి రాజుగారి  భటుల వద్దకు పోయి  జరిగిన విషయం    చెప్పినారు.
ఈ ప్రాంతం అంత పీఠికపురం ప్రస్తుతం పిఠాపురం మహారాజు గారు ఆస్థానం లో ఉన్న ప్రాంతం.
ఈ విషయం తెలిసిన రాజభటులు  బరిసలతో పులిని చంపుటకు పొడుస్తుండగా టంగు మని మ్రోగ గా   భటులు పత్రిని తొలిగించి చూడగా శివలింగము కనిపించినదట.
అదే రోజు రాత్రి పిఠాపురం మహారాజు గారికి స్వప్నం లో శివుడు కనిపించి ఈ వృత్తాంతం తెలిపెను.
అంతట ఆ మహారాజు తన పరివారంతో బయలుదేరి వెళ్లి చూడగా  శివలింగము సాక్షాత్కరిoచెను
వ్యాఘ్రరూపమున వెలసిన శివలింగం స్వయం భూ గాను, ఈ పరమ శివుడికి    వ్యాఘ్రేశ్వర స్వామి గాను  ఈ   ఊరికి vyagreswaram గాను ప్రసిద్ధి పొందినది.
ఈ క్షేత్రం కంచి జయేంద్ర స్వాములు వారు తమ పర్యటనలో విచ్చేసి స్వామి వారికి పూజలు చేసి ఉన్నారు.
అలాగే పుష్పగిరి, శృంగేరి పీఠ అధిపతులు విచ్చేసి యున్నారు.
ఎల్లప్పుడూ వేదం ఘోష లతో , నిత్యా ధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతున్న శైవ క్షేత్రం.

ఈ క్షేత్రంలో  మదన గోపాల స్వామి వారు క్షేత్ర పాలకుని గాను, వల్లి దేవాసాని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి , ఆంజనేయ స్వామి, వన దుర్గ భక్తుల పూజలు అందుకుంటున్నారు
.
ఈ క్షేత్రం లో ఎన్నో యజ్ఞ  యగాదులు చేసిన పండితులు వున్నారు. 

అందులో ఆకెళ్ల రామ కృష్ణ గారు (దత్తుడు) ముఖ్యులు.
వారి విగ్రహం కూడా ఆ క్షేత్రం లో ఉన్నది.
ఈ పరమ శివుని కి  జల అభిషేకము ,లక్ష బిల్వార్చన చేయుట ఈ కార్తీక మాసములో  బహు పుణ్య ఫలమని భావించి  భక్తులు వేల సంఖ్యలో పూజలు చేసి  తరిస్తారు.

ఈ స్వామికి  పెళ్లి కానీ వారు వివాహo కావాలని , అదేవిధంగా పిల్లలు లేని వారికి స్వామి వారికి వేడుకుని కొబ్బరి మొక్కలను  సమర్పించుకుంటారు

వారి కోరుకున్న కోరికలు తీరుతున్నట్లు ఎన్నో సజీవ సాక్షాలు ఉన్నాయి.

ఈ ప్రాంతం  బహుళ ప్రాచుర్యము పొందిన పురాతన శివాలయము.

రాజఃమండ్రీ - అమలాపురం బస్సు రూటులో పుల్లేటికుర్రు లో బస్సు దిగి ఆటో లో వ్యాఘ్రేశ్వరము లోని శివాలయమునకు వెళ్ళవచ్చును
అమలాపురమునకు 15 కి.మీ.దూరములోను ,రాజమండ్రీ కి 65 కి.మీ. దూరములోను ఈ క్షేత్రము కలదు.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...