Friday, March 9, 2018

మయసభ -ఒక వైజ్ఞానిక అద్భుతం

🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅

మహాభారతం - మయసభ -ఒక వైజ్ఞానిక అద్భుతం :

భారత్ భౌతిక సంపదలోనే కాక, ఆధ్యాత్మిక సంపదలో కూడా ధనవంతురాలు, శక్తివంతురాలు. ద్వాపరయుగాంతం నాటికి భారత్‌కు గొప్ప క్షత్రియబలం ఉంది, అణుబాంబులు అత్యధికంగా మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచమంతా భరతమాత కాళ్ళ ముందు మోకరిల్లింది. దక్షిణ అమెరికాలో పెరులో విలసిల్లిన మయాన్ నాగరికత మూలపురుషుడు మయుడు / మయాసురుడు. ఈయన ప్రస్తావన భారతంలో ఉంది. అమెరికాలోకి తెల్లదొరలు ప్రవేశించకముందు అక్కడున్న సంస్కృతి హిందూ సంస్కృతికి చాలా దగ్గరగా ఉండేది. ఒకప్పుడు అమెరికాలో హైందవం ఉందండానికి ఆధారం ఆ దేశంలో జరిగిన పురాతన గణపతి, సూర్య, దేవి విగ్రహాలు, శ్రీ చక్రాలు. అట్లాగే మయుడు కూడా వైదిక ధర్మాన్ని అనుసరించేవాడే. మయుడు శిల్పి, విశ్వకర్మ. సముద్రగర్భంలో కలిసిపోయినట్టుగా భావిస్తున్న అపూర్వమైన అట్లాంటిస్ నగరం ఈయందేనని, అట్లాంటిస్‌కు మయా నాగరికతకు సంబంధం ఉందని చెప్తున్నారు అక్కడి పరిశోధకులు.

ప్రపంచంలో ధర్మం లోపించినప్పుడు ధర్మప్రచారం చేసి, ప్రపంచాన్ని ఉద్ధరించేది భారతదేశమే, ఇక్కడే సమస్త విద్యలు పుట్టాయి, ఋషులు అనేకులు ఈ భూమిని ఎంతో గొప్పదిగా కీర్తించారు. ఆయా కారణాల చేత ప్రపంచం భరతఖండాన్ని ప్రపంచం గౌరవించింది. అదే గౌరవంతో ధర్మరాజుకు కానుకగా మయుడు తన దగ్గరున్న అపూర్వమైన విద్యతో, విజ్ఞానపటిమతో హస్తినాపురంలో #మయసభను నిర్మించాడు. అదీగాక, అప్పుడు భారత్ ప్రపంచశక్తి (Super power), ధర్మరాజు సామ్రాట్టు (Emperor). మహాభారతం సభాపర్వం దీన్ని వివరిస్తుంది. భౌతిక శాస్త్రంలో (physics) కాంతి పరావర్తనం (refraction), ప్రతిబింబించడం (reflection),  ద్వైధీభూతం (Di-fraction) కావడం, ఇంద్రధనస్సు (rainbow) లాగ విరిగి వికృతి పొందడం వంటి శాస్త్ర విషయాలను ఆధారంగా చేసుకుని, ఉన్న వస్తువులను లేనట్టుగాను, లేని వస్తువులను ఉన్నట్టుగాను కనిపించే అద్భుతరీతలో ఈ 'మయసభ' నిర్మాణం జరిగింది. ఇది ఇప్పటి పార్లమెంటు హాలు వంటిది అనుకోవచ్చు. ఈ మయసభ నిర్మాణం చూడటానికి వచ్చిన దుర్యోధనుడు, నీళ్ళున్న చోట లేవనుకుని భ్రాంతి చెంది జారిపడటం, అది చూసి ద్రౌపది నవ్వడం, ఆ తర్వాత జరిగిన కధ తెలిసిందే. ఎడారిలో నీరు లేకున్నా, ఉన్నట్లు కనిపించడం కాంతిరేఖలు వంగటం వల్లనే జరుగుతుందని ఈనాటి సైన్సు చెపుతోంది. ఇటువంటి వైజ్ఞానిక సత్యాలే మయసభ నిర్మాణానికి ఉపయోగించినట్టు స్పష్టం అవుతోంది.

రాజసూయ యాగంలో ధర్మరాజును సామ్రాట్టుగా చేసినప్పుడు, ఆయనకు బహుమానాలు ఇవ్వటానికి ప్రపంచ నలుమూలల నుంచి అనేకమంది రాజులు భారతదేశానికి వచ్చినట్టు వ్యాసమహర్షి సభాపర్వం 52 లో చెప్పారు. అందులో రోము సామ్రాజ్యం కూడా ఉంది. రోమన్ సామ్రాజ్యం నుంచి రాయబారి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుకు నగలు, బహుమానాలు ఇచ్చారు. భారత్ ఇంతగొప్ప శక్తి కాబట్టే, మహాభారత సంగ్రామంలో ప్రపంచం మొత్తం రెండుగా చీలి, కొందరు కౌరవుల తరుపున, మరికొందరు పాండవుల తరుపున యుద్ధంలో పాల్గొన్నారు.

🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...