Sunday, February 4, 2018

బ్రాహ్మణుని బతుకు

దయచేసి చదవండి........... సాధారణ లెక్క చూద్దాం..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ :
వారానికి ఆరురోజులు,40గంటల పని.
సాధారణంగా 9-5 లేదా 10-6 ఇలా ఉండొచ్చు పనివేళలు.
రోజుకు ఎనిమిదిగంటల పని.
డిగ్రీపీజీ కలిపి పదితరువాత ఆరేళ్ళుదాదాపు
జీతం కనీసం 25వేలనుంచీ లక్షలదాకా
ఉచిత వసతి, మెడికల్ కార్డ్స్,ఇతరత్రా ఫెసిలిటీస్.
సంఘంలో గౌరవమైన వైట్ కాలర్ జాబ్ గా గుర్తింపు.
ఇష్టమొచ్చినప్పుడు శెలవుపెట్టుకొనే వెసలుబాటు.
ఇవన్నీ అక్కసుతో చెబుతున్నవి కావు.
నిజంగానే డిమాండున్న ఈ రంగానికి ఇంకా ఎక్కువగానే
పే చేయాలి, ఇంకా అత్యధికులు గవర్నమెంట్ జాబులమీద
ఆధారపడకుండా యువతరంలోనే ధనవంతులవ్వాలి.
ధనిక భారతదేశం మనం కళ్ళారా చూడాలి.

మరిప్పుడు ఒక పురోహితుడి జీవితాన్ని చూద్దాం.
ఉదయం మూడుగంటలకు చన్నీటిస్నానంతో ఉద్యోగం ప్రారంభం.
నైవేద్యం శుచిగా మడిగా సిద్ధం చేయడం.
సంధ్యావందనాలు, జపాలు, పూజలు. అల్పాహారానికి అవకాశం తక్కువ.
ఆలయంలో విగ్రహాల ప్రక్షాళణ, అలంకరణ, పూజాదికార్యక్రమాలు.
నిరంతరంగా కంఠోపాటంగా స్వరపేటిక అలసిపోయేలా మంత్రపఠన. 
వచ్చినవారందరికీ విసుగన్నదిలేకుండా అర్చనలు,ప్రసాదవితరణ.
రోజుకు 12 గంటలకు పైగా కఠిన నియమాలతో పూజలు.ఓవర్ టైం పే ఉండదు.
365రోజులూ ఉద్యోగమే. వారాంతపు శెలవన్నది మిధ్య.
సాధారణ శెలవుకాదుకదా, అనారోగ్యపు శెలవలుకూడా ఉండవు.
నియమబద్ధంగా అంతేవాసిగా ఒకవేదం చదవడానికి పట్టేకాలం కనీసం 10యేళ్ళు.
అలాపూర్తిగా నేర్చుకోడానికి నిరంతరాయంగా సమయం కేటాయింపు, కఠిన నియమాలు.
ఇన్నినియమాలతోపాటు, వ్యసనాలకు దురలవాట్లకీ దూరం.ప్రత్యేక వస్త్రధారణ.
పర్వదినాల్లో ప్రత్యేకపూజల్లో ముఖ్యమైన వ్యక్తులు వస్తే ఎక్కువసమయం పని,
ఇక ఒక ఆలయానికి పూజారిగా జీవితం మొదలయ్యాక ఆదాయం?

నామమాత్రపు జీతం.
పళ్ళెంలో వేసే చిల్లర నాణేలు,
భిక్షగా పెట్టే స్వయంపాకాలు,
మిగిలితే ప్రసాదం. లెకుంటే మళ్ళీ ఇంట్లో వంట.
ఆస్తులమాట దేవుడెరుగు.ఊరిపెద్దలు దయదలిస్తే ఒక ఇల్లు.
రెజర్వేషన్సుండవు. పిల్లల స్కూల్ ఫీజులకు కూడా అగచాట్లు.
పెరిగిపెద్దయ్యాక వారి దీనస్థితివల్ల పెళ్ళిళ్ళుకాకపోవడం..

ఇదీ సంస్కృతిని సంస్కృతాన్ని తరతరాలుగా గొడ్డుచాకిరీ చేస్తున్నట్టుగా
మోసుకొస్తున్న బ్రాహ్మడు జీతభత్యాలు. దారిద్ర్యంలో వెళ్ళదీస్తున్న బ్రతుకులు.
ఏదో కొంతమంది పేరుమోసినవాళ్ళు కొద్దిగా సంపాదించేవాళ్ళు మీకళ్ళముందు కనిపించొచ్చు.
కానీ వాళ్ళున్నశాతం అతితక్కువ. సాఫ్ట్వేర్ జాబుల్లో కూడా కొంతమంది కోట్లరూపాయల జీతమున్నట్టు.
కోట్లలో సంపాదించే పూజారులుండరు, పౌరోహిత్యం మీద వందల ఎకరాలు కొన్నవాళ్ళుండరు.
ఎందుకంటే పౌరోహిత్యమన్నది ఒక వ్యాపారంగా కాక జీవనోపాధిగా చేస్తున్నవాళ్ళే చాలావరకూ.
గర్భగుడిలో ఉన్న పూజారికన్నా గుడిబయట భిక్షమెత్తుకుంటున్నవాళ్ళ ఆదాయమే ఎక్కువుంటోంది.

ఆగండాగండి. బోనస్సులెక్కువే ఈవృత్తిలో..
పబ్లిక్ లో పంచె కట్టుకోవడమనేదే ఆటవికంగా పరిగణించేవాళ్ళకి
సాంప్రదాయాలని నియమానుసారం పాటించేవాళ్ళని అవమానించేవాళ్ళకి
హేతువాదులకి,ఇతరమతాలవాళ్ళకీ,సినిమావాళ్ళకీ,టీవీవాళ్ళకి,
సంఘంలో ప్రతీఒక్కళ్ళకీ..
బ్రాహ్మణుడంటే చులకన. ప్రతీఒక్కడూ తిట్టగలిగిన ఒక కులం.
ఎప్పుడో ఎవరో ఏదో చేశారని ఇప్పటి చిన్న చిన్న పిల్లల్ని కూడా పీక్కుతింటున్నారు.
బడిలో చదివే చిన్నపిల్లలైన బ్రాహ్మణుల్ని కూడా బొట్టేట్టుకొంటే గేలిచేస్తున్నారు.
యువకులకి పట్టుపట్టి దురలవాట్లు మాంసాహారం తినిపించడానికి ప్రయత్నిస్తున్నారు.
బ్రాహ్మణస్త్రీలని సినిమాల్లో నాటికల్లో అత్యంత జుగుప్సాకరంగా చూపిస్తున్నారు.
అడుగడుగునా అవమానాలూ, అగచాట్లు, అపహాస్యాలూ...ఇలా బోలెడన్ని బోనస్సులు..

మానవహక్కులసంఘాలకి, సెక్యులర్లకి, సోషల్ వర్కర్స్ కి ఇవన్నీపట్టవు.
ఒకకులాన్ని రాబందుల్లా జనాలు పీక్కుతింటుంటే అడిగేవాడెవడూ లేడు.
శాంతియుతంగా నిరసన చేసి తమ ఆవేదనవ్యక్తంచేస్తే లాఠీలకి పనిచెప్తున్నారు.
సాధుజీవి గోవుపై దాడుల్లా శాంతికాముకులైన బ్రాహ్మణులమీద కూడా దాడులుజరుగుతున్నాయి.
ఆపేవారేరీ? అసలు దీనిపై మాట్లాడేవారేరి? సాటిమనుషులుగా చూసేవారేరి?
తిరగబడటమెందుకూ అని శాంతిమంత్రాలు వల్లించే బ్రాహ్మణుణ్ణి పిరికివాడనుకుంటున్నారు.

ఒక్కసారి బ్రాహ్మణత్వంలో ఉన్న శాంతికాముకత్వం పక్కనపెట్టి ఇతరుల్లా తిరగబడితే..
వారి మేధాశక్తికియుక్తులకి కండబలం కూడా తోడై సమైక్యంగా రౌడీమూకల్ల రోడ్డెక్కితే..

ఆపడం అతికష్టం సోదరా. వద్దు. ఇక ఆపండి. ఎవరిపనివాళ్ళు చూసుకొందాం. గౌరవించుకుందాం.
సహనానికీ హద్దుంటుంది. తెగేదాకాలాగొద్దు. శాంతికాముకుల్ని తక్కువ అంచనా అసలేవేయొద్దు. తస్మాత్ జాగ్రత్త....ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం....లలితా భవాణి జ్యోతిష పీఠం.కామారెడ్డి.....

Post a Comment

అత్యంత మహిమాన్వితమైనది... బాసర క్షేత్రం

*వేదవ్యాస మహర్షి ప్రతిష్టించిన ఏకైక సరస్వతీ ఆలయం* 💫🌞🌎🌙🌟🚩 🕉ఓంశ్రీమాత్రేనమః 🕉 అద్వైత చైతన్య జాగృతి 💫🌞🌎🌙🌟🚩 అత్యంత మహిమాన్వి...