Thursday, February 2, 2017

రథసప్తమి స్నానవిధి

రథసప్తమి స్నానవిధి

ఉదయం బ్రహ్మ స్వరూపః
మధ్యాహ్నంతు మహేశ్వరః
సాయంకాలే స్వయం విష్ణుః
త్రిమూర్తిస్తూ దివాకరః

అనగా సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూ పంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటా డు. రథసప్తమి రోజున సూర్యుని యొక్క జన్మదినంగా వేదాలు ఉపనిషత్తులు చెప్పడం ద్వారా ఈ రోజు ప్రాతః కాలమందే మేల్కొని ప్రతి ఒక్కరు తలంటు స్నానం చేయ డం స్నానం చేసే సమయంలో తమ యొక్క శిరస్సుపైన రెండు భుజములపైన జిల్లేడు పత్రాలను ఉంచుకొని.

యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.

ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః

సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి.

ఈ శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. ఎందుకు జిల్లే డు ఆకులతో స్నానం చేయాలంటే జిల్లేడు ఆకులు సూర్యు నికి ఇష్టమైన ఆకులు. వీటినే అర్కపత్రమని కూడా వ్యవ హరిస్తారు.

జిల్లేడు ఆకుతో స్నానం ఆచరించడానికి గల కారణం రథసప్తమి పర్వ దినం శిశిర ఋతువులో వస్తుంది. శిశిర ఋతువుకు ముందు హేమంతఋతువు, హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉండి శిశిర ఋతువులో రథసప్తమి రోజు నుంచి సూర్యుని తాపం పెరగడం వల్ల వాతావరణం లో అనేక మార్పులు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం అను కూలించడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయడం ద్వారా జిల్లేడు ఆకులలో ఉండే ఔషధాలు మన శరీరానికి తాకి  ఎలాంటి చర్మవ్యాధులు, అనారోగ్యమును రాకుండా కాపాడుతుందని శాస్తజ్ఞ్రులు కూడా తెలియజేశారు.......✍ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు ,
.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...