Monday, December 12, 2016

ఆంజనేయ వాలాగ్రపూజ

రేపు ఆంజనేయ స్వామి కి ప్రత్యెక పూజ చేసుకొండి. పూజ వివరాలు క్రిందన తెలియచేస్తున్నాను,

రుద్రాంశ సంభూతుడు అయిన హనుమంతుడిని 12/12/2016,సోమవారం రోజున పూజించటం వలన విశేష కార్యసిద్ధి కలుగును,

ఈ హనుమత్ పూజ గూర్చి వ్యాసుడు ద్రౌపదికి ఉపదేశిచినట్లుగా పురాణ వచనం,

ఎవరైతే మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమంతుని పూజిస్తారో వారికి అనారోగ్య,మానసిక రుగ్మతలు,గ్రహబాధలు,నరదృష్టి దోషాలు,సకల బాలారిష్టాలు,స్వప్న దోషాలు,భూత బాధలు తొలుగును,కావున 12,12,2016,సోమవారం,హనుమంతుని పూజించటం,దేవాలయానికి వెళ్లి దర్సించండి,కోరికలు సిద్దించాలి అనుకునేవారు(ధర్మ బద్ధమైనవి మాత్రమే)ఆంజనేయ వాలాగ్ర పూజ చెయ్యండి.

ఈ పూజ చాలా రహస్యమైనది చాలా శక్తివంతమైనది,(42 రోజులు లేదా21 రోజులు, లేదా1 రోజు చేసే విధానం )12 వతారీఖు సోమవారం సూర్యోదయానికి ముందే లేచి స్నానాదులు పూర్తి చేసి ఉతికిన తెల్లని పంచ కట్టుకొని,దీపారాధన చేసి,మీడియం సైజ్ హనుమ ఫొటోతీసుకొన, ఫోటోలో స్వామి వాలం(తోక)మొదలు చివరి వరకు ఏ అడ్డం రాకుండా గద గాని ,ఆభరణాలు గాని,అడ్డం రాని (అనగా స్వామీ ఫొటోలో వాలం చక్కగా కనిపించేది అని అర్ధం)ఫోటో తీసుకొని బొట్టు పెట్టి ఒక పీట మీద ముగ్గుపెట్టి,దాని మీద టవల్ పరిచి,దాని మీద బియ్యం పోసి1కెజి, తమలపాకు ఉంచి దాని మీద ఫోటో పెట్టవలెను,గణపతికి నమస్కారం చేసి ,ఆచమానం చేసి,మనస్సులో వున్న కోరిక చెప్పుకొని "హనుమత్ లాంగూలపూజాం కరిష్యే"అని నీళ్లు ముట్టుకోవాలి,ఒక తమలపాకు,ఒక పువ్వు అక్షతలు పట్టుకొని "ఓం హనుమతే నమః అని 108 సార్లు చెప్పుకొని తమలపాకు పువ్వు సమర్పించవలెను,హనుమతే నమః గంధం సమర్పయామి,అని,గంధం వెయ్యాలి ఫోటో మీద,హనుమతే నమః పుష్పమ్ సమర్పయామి,పువ్వు వెయ్యాలి,హనుమతే నమః దుపం సమర్పయామి,స్వామికి అగారుపుల్ల చూపాలి,హనుమతే నమః దీపం సమర్పయామ,ి దీపం చూపాలి,హనుమతే నమః నైవైద్యం సమర్పయామి,అరటి పండు పెట్టాలి,హనుమతే నమః తాంబూలం సమర్పయామి,తాంబూలం ఇవ్వాలి స్వామికి,హనుమతే నమః అంటూ కర్పూరాహారతి ఇవ్వాలి, ఇప్పుడు క్రింద సూచించే లాగూల స్తోత్రం పారాయణ చెయ్యాలి

హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧ ||

మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨ ||

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౩ ||

రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౪ ||

శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౫ ||

వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౬ ||

సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౭ ||

రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౮ ||

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౯ ||

పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౦ ||

జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౧ ||

స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౨ ||

రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౩ ||

జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౪ ||

భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౫ ||

వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౬ ||

వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౭ ||

అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౮ ||

లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౯ ||

రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౦ ||

ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౧ ||

సీతాఽశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౨ ||

ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత ్###

అని తప్పు పలకకుండ పారాయణ చేసి సింధూరంతో స్వామీ వాలం(తోక) మొదటి భాగంలో బొట్టు పెట్టాలి,(అనగా పృష్ఠ భాగం దగ్గర)2వరోజు కూడా ఫోటో కదల్చకుండా పైన చెప్పిన రీతిగా స్వామి పుజ చేసి లాగులస్త్ర స్తోత్ర పారాయణ చేసి మొదటి రోజు పెట్టిన బొట్టు పక్కనే పారాయణ బొట్టు పెట్టాలి,అలానే 3వరోజు 4వ రోజు,5వరోజూ,,,,,ఇలా 21 రోజులు పూర్తి అయ్యేసరికల్ల వాలం అంత చివరి వరకు సింధురంతో బొట్లు పెట్టి ఉంటాయి,తరువాత బొట్లన్నీ తుడిచి( ఫోటో పైకి ఎత్తకుండా)మరల రోజు పూజ పారాయణ చేస్తూ ఈ సారి తోక చివరి నుంచి మొదలు వరకు 21 దీక్ష పూర్తీ చెయ్యాలి,చివరి రోజున అనగా 42 వరోజు స్వామికి అప్పాలు,వడపప్పు,నైవేద్యం పెట్టి బ్రాహ్మాడుకి భోజనం పెట్టి ఈ వ్రతం పూర్తీ చేయవలెను,శక్తి లేని వారువుకే రోజు కూడా చేయవచ్చు 12 వ తారీకే వ్రతం చేయవచ్చు,లేదా 21 రోజులు చేసి కొంత సమయం తీసుకొని,అనగా నెల లోపల మరల మరో 21 రోజులు పూర్తి చేయవచ్చు,లేదా 42 మంగళ వారాలు చేయవచ్చు,ఈ విధంగా ఆచరిస్తే కళ్యాణప్రాప్తి,సౌభాగ్యంవిద్యాప్రాప్తి,వ్యాపార,ఉద్యోగ జయం గృహ సిద్ది,గృహ కల్లోలాలు తొలగి శాంతి కలుగునును,

,,,,ఇట్లు
మీ
భమిడిపాటి భాస్కర్ పురోహితులు,
వేలమూరి,విద్యాసాగర్ శాస్త్రి(,9949954940,) సహాయం తో 
శుభం భూయాత్

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...