Sunday, December 18, 2016

గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి

🙏 గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి🙏

చారిత్రక ప్రాశస్త్యం: వైష్ణవ సంప్రదాయానికి ప్రతీక అయిన రామానుజాచార్యులు 1130 లో ఇక్కడి విగ్రహాలకు సంప్రోక్షణ జరిపారు. దక్షిణ భారతంలో సుల్తానుల పాలనలో ముస్లింల దాడుల కారణంగా ఆలయం ఇబ్బందుల పాలైనట్లు చరిత్ర చెబుతున్నది. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో ఎన్నో శాసనాలు లభించాయి. వాటిద్వారా పెక్కు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగర సాళువ వంశస్థ పాలకుల కాలంలో (క్రీ.శ. 1506) ఈ ఆలయం ఆధిక్యత సంతరించుకొన్నదని ప్రతీతి. తర్వాతి పాలకులు కూడా ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు చరిత్ర పేర్కొంటున్నది.

అడ్రసు: గోవిందరాజ స్వామి ఆలయం, జి. ఎస్. మాడా వీధి, వరదరాజ నగర్, తిరుపతి – 517 501, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

పూజల వేళలు: ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30, మ. 1.00 నుండి సా. 6 వరకు, సా. 7 నుండి రా. 8.30 వరకు

ప్రత్యేక పూజలు: స్వామికి పుష్కరణిలో తెప్పోత్సవం ఇక్కడ విశేష పూజ. ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది.
🙏ఓం నమో వేంకటేశయ🙏
Source:My temple.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...