పంచారామాలు
ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.
పంచారామాల పుట్టుక
శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్ఠించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్ధికెక్కినవి.
స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.
హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ, పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.
శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః
-స్కాందము
తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు.
శ్రీభీమలింగేశ్వరస్వామి ద్రాక్షారామము
తూర్పుగోదావరిజిల్లా ఆంధ్రప్రదేశ్
శ్రీకూమారభీమేశ్వరస్వామి సామర్లకోట
తూర్పుగోదావరిజిల్లా ఆంద్రప్రదేశ్
శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి పాలకొల్లు
పచ్చిమగోదావరిజిల్లా ఆంద్రప్రదేశ్
శ్రీసోమేశ్వరస్వామి భీమవరం
పచ్చిమగోదావరిజిల్లా ఆంధ్రప్రదేశ్
శ్రీఅమరేశ్వరస్వామి అమరావతి
గుంటూరుజిల్లా ఆంధ్రప్రదేశ్
ఇవన్నీ దేవతలు ప్రతిష్ఠించినవేనని స్థలపురాణం చెపుతొంది.
No comments:
Post a Comment