Sunday, September 9, 2018

*🚩ఏది "మన హక్కు"............?*

*🚩ఏది "మన హక్కు"............?*

*✳👉ఆదాయం లేకుండా బతకొచ్చేమో...?*
*ఆప్తులు లేకుండా బతకొచ్చేమో...?*
*ఆక్సిజన్‌ లేకుండా బతకొచ్చేమో...?*
*👆ఆ మాటకొస్తే చివరాఖరికి ఆయువు లేకున్నా కూడా వెంటిలేటర్‌తో కోరుకున్నంత కాలం బతకొచ్చేమో.!*
*కానీ హక్కుల్లేకుండా మాత్రం బతకలేం.!*

*👉భారతంలో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు..*
*నవ భారతంలో పౌరుడు జన్మతః హక్కులతో పుడుతున్నాడు.*
*పక్కాగా చెప్పాలంటే..*
*హక్కు ముందు పుట్టి*
*ఆ తర్వాత మనిషి పుడతాడు.*
*"స్వాతంత్య్రం నా జన్మ హక్కు" అని నాటి భారతీయుడు నినదిస్తే..* *"హక్కు.. నా జన్మ హక్కు" అని నేటి భారతీయుడు* *నిలదీస్తున్నాడు.*
*అది వారి హక్కు.!*
        
*👉ప్రార్థన పేరుతో పొద్దున్నే గుడిలో, చర్చిలో, మసీదులో పెద్దపెద్దగా మైకులు..*
*రక్తాలు కారేలా మన చెవుల్లో భక్తిని బలవంతంగా బోధిస్తుంటాయి.*
*అది వారి భయంకర దైవ విశ్వాస ప్రదర్శన హక్కు.* *అదేమని అడిగితే బుర్ర రామ కీర్తన పాడిస్తారు.*
*మరి నైట్‌ డ్యూటీ చేసుకుని రాత్రెప్పుడో ఇంటికి చేరుకునే దౌర్భాగ్యుడి నిద్రా హక్కు సంగతేంటి.?*

*👉పండగ రాగానే రోడ్డుకో పందిరి మండపం వేసి,*
*"భయ– భక్తు"లతో చందాలు వసూలు చేసి చెవులు దద్దరిల్లేలా,*
*గుండెలదిరేలా జాతర జరుపుతారు.*
*అది ఉత్సవ హక్కు.*
*మరి ప్రశాంతంగా ఉంటుందని పాతిక లక్షలు పోసి ఆ కాలనీలో ఇల్లు కట్టుకున్న గుండె రోగి హక్కు సంగతేంటి.?*

*👉నడి రోడ్డు మీద, కస్టమర్‌తో ఫోన్లో మాట్లాడుతూ అడ్డదిడ్డంగా కారు నడపడం క్యాబ్‌డ్రైవర్‌ ఉపాధి హక్కు.*
*అదేమంటే నలుగురు క్యాబ్‌ డ్రైవర్లు కలిసి*
*మర్యాదగా మీదబడి కలియబడి కొట్టడం కూడా హక్కే.*
*మరి కష్టపడి కొనుక్కున్న కొత్త కారుకు, దాంతో పాటే తన చిన్ని మనసుకు, చిట్టి జేబుకు..*
*సొట్ట పడిన మధ్య తరగతి నిర్భాగ్యుడి దరిద్రపు హక్కు సంగతేమిటి.?*

*👉రాత్రినంతా ఎల్‌ఈడీ లైట్ల వెలుగుతో పట్టపగలుగా మార్చే హక్కు మనిషికి ఉంది.*
*మరి చీకట్లో తప్ప నిద్ర పోలేని పురుగులు, జీవాల హక్కు సంగతేమిటి.?*

*👉భారతదేశంలో పౌరులందరికీ సమాన హక్కులుంటాయి.*
*అయితే అందులో కొందరికి ఎక్కువ సమాన హక్కులుంటాయి.*
*ఏ మతం వాడైనా హిందువులను తిట్టొచ్చు.* *అది వాడి "వాక్‌ స్వాతంత్య్రపు మత స్వేచ్ఛా ప్రచార హక్కు".*
*కానీ హిందువు ఏదైనా తిడితే మాత్రం మైనారిటీలను నిందించినట్టవుతుంది...!*

*👉అణగారిన కులాల వారు ఎన్నేళ్లైనా అగ్రకులాలను తిట్టొచ్చు.*
*అది వారి ప్రతికారాగ్రహ హక్కు.*
*కానీ సోకాల్డ్‌ అగ్ర కులాల వారు ఏదైనా అంటే మాత్రం బడుగులను అణచి వేసినట్టవుతుంది...!*

*👉భార్య భర్తను తిట్టి తప్పుడు కేసులు పెట్టొచ్చు.* *అది స్త్రీ స్వాతంత్య్రపు హక్కు.*
*కానీ మగవాడు ఏదైనా అంటే మాత్రం అసహాయ అబలను ‘నిర్భయ’ంగా వేధించినట్టవుతుంది...!*

*👉ఇతర మతాల విషయంలో వేలుపెట్టని సుప్రీంకోర్టుకు,*
*హిందువుల గుళ్లోకి ఎవరెవరు రావాలో మాత్రం చెప్పొచ్చు..*
*అది అత్యున్నత న్యాయాధికార హక్కు....* *కానీ తన గుళ్లోకి ఎవరిని అనుమతించాలో చెప్పే హక్కు మాత్రం దేవుడికి సైతం ఉండదు....!*
       
*👉మన రాజ్యాంగం హక్కులు తప్పనిసరని చెప్పింది.*
*బాధ్యతలు ఐచ్ఛికమంది.* *అందువల్ల హక్కును వాడుకోగలిగినవాడు అదృష్టవంతుడు.*
*బాధ్యతగా మెదిలేవాడు బాధితుడు.*
*ఈ దేశంలో ఏ హక్కులూ లేనిది ఎవరికంటే..*
*నీతిగా కష్టపడి సంపాదించి..*
*నిజాయితీగా పన్ను కట్టి..* *తిన్నంతలో గుట్టుగా కతికి..*
*ఉన్నంతలో పద్ధతిగా బతికి..*
*ఎవడు ఏమనుకుంటాడో..* *ఏమని తిడతాడో..*
*ఎలాంటి కేసులు కడతారో..*
*పరువెక్కడ పోతుందో..*
*అని భయపడే సామాన్యుడికి...!*

*👆👉అదో "అసమర్థుడి జీవయాత్ర"...!*

*🚩👉అయినా గర్భంలో పిండానికి కూడా బతికి బట్టకట్టే హక్కు ఇచ్చారు కదా.!*
*మరి బతకలేక చస్తున్న వాడికి చచ్చే హక్కు ఎందుకివ్వరో...?*

*👆Courtesy By::*

*✳✍SK Saleha*
*(జర్నలిస్ట్)*

*🚩హన్మకొండ శ్రీకాంత్ శర్మ🚩*

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...