🕉🕉🕉🕉🕉🕉
🌸 *శ్రీ_అన్నపూర్ణాదేవి_ఆలయం_హోరనాడు(కర్ణాటక)* 🌸
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, అన్ని దానాలలోకల్లా అన్నదానం గొప్పది అని పురాణాలు చెప్తున్నాయి, అలాంటి అన్నాన్ని ఈ సమస్తమైన జగత్ అంతటికీ అందించే మాతృమూర్తిగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరిస్తుంది. ఆతల్లి కొలువైన ఆలయ సందర్శనం బహుపుణ్యఫలం.
సుందర ప్రకృతి అందాలను విరపూసే సహ్యాత్రి పర్వత శ్రేణులలో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం #పుణ్యక్షేత్ర స్థలమే కాదు ఓమనోహర ఉద్యానవనంగా విరాజిల్లుతుంది. భక్తులకు కావాల్సినంత మానసిక ఆనందాన్ని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి మాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటుంది. ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో ఉంది. హోరానాడు దివ్యక్షేత్రం కొండల నడుమ లోయలో ఉంది. కొండల మీద నుంచి పారె సెలయెర్లతో జలపాతాలతో ఈ క్షేత్రం ఓ వన విహారాన్ని తలపిస్తుంది.
ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే అన్నపూర్ణాదేవి ఆశిశులు వారికి ఉంటాయని పురాణాల ద్వారా అవగతం అవుతుంది. ఇటువంటి అన్నదానాలు చేసే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని కూడా అంటారు. జగన్మాత శక్తిస్వరూపిణి ఆదిపరాశక్తిగా అవతరించి దీనులను ఉద్ధరించిన ఆ జగత్ జననికి చెందిన మరో రూపమే అన్నపూర్ణేశ్వరి. మహిమాన్మితమైన అన్నపూర్ణేశ్వరి మాత ఇక్కడ అగత్స్య మహాముని అభీష్టం మేరకు కొలువై ఉందని పురాణాల ద్వారా అవగతమవుతుంది. మహా దేవుడైన ఆపరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దగ్గరే భిక్షను స్వీకరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
గర్భాలయంలో అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకున్నాక భక్తులు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి తమ శక్తిమేర అమ్మవారికి బియ్యాన్ని సమర్పించుకుంటారు. తమ కోర్కెలు నివేదించుకుంటే ఆ తల్లి సర్వాబిష్టాలు సిద్దించేటట్లు అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
అన్నపూర్ణ మాత వెలసిన క్షేత్రాలలో చాలా గొప్పగా చెప్పుకో తగిన క్షేత్రం కాశీ, ఈ క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణ మాత ఆలయం అత్యంత మోదాన్ని కలిగిస్తుంది. సమస్తమైన జగత్తుకు అభయ కారకంగా నిలిచింది. ఈ క్షేత్రానికి సంబందించిన ఓ పురాణగాధ ప్రచారంలో ఉంది, ఒకప్పుడు వ్యాధవ్యాసుడు తన శిష్యగణంతో కాశీనగరంలో భిక్షాటనకు వెళ్ళినపుడు భిక్ష లభించలేదట దానితో వ్యాసుడు భిక్ష పాత్రను పగలకొట్టి కాశీని శపించడానికి ప్రయత్నించినపుడు పార్వతీదేవి అన్నపూర్ణగా వచ్చి వ్యాదవ్యాస మహర్షికి అతని శిష్యులకు అన్నాన్ని ప్రసాదించిందట.
హోరానాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయంలోని దీపారాధన మనకి జీవించి ఉన్నంతకాలం అన్నానికి లోటు లేకుండా ఉండేటువంటి ఒక అదృష్ట భాగ్యాన్ని కలుగచేస్తుందని, అందు వల్ల ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు తొలుత దీపారాధన చేసి అమ్మవారిని దర్శించుకుంటారు.
💐 *మార్గం* 💐
దేశంలో ఏ ప్రాంతం వారైన కర్ణాటక రాష్టం బెంగళూరు చేరుకొని అక్కడ నుండి చెన్నరాయపట్నం, హసన్, బేలూరు, ముదిగెరెల మీదుగా హోరనాడులోని శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయానికి వివిధ వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
No comments:
Post a Comment