Monday, October 2, 2017

అగ్రవర్ణం

నన్ను బాగా కదిలించిన పోస్ట్...
మీకోసం...Watsapp నుండి...
రచయిత పేరు తెలియదు...
****************************
అగ్రవర్ణం రంగు పులిమి అధఃపాతాళానికి తొక్కేశారు. ఏ జాతివాని ఇంటికైనా వచ్చి మలినంలేని మనసుతో మంత్రం చదివి, ఆశీర్వదించేవాడు బ్రాహ్మడు. తింటానికే తిండిిలేక, వుండటానికి నీడలేక అల్లాడుతున్న బ్రాహ్మడు అగ్రవర్ణమా?  రేపటికి దాచుకోవడం  ఆనాటి  బ్రహ్మణునకు తెలియదు. మీరంతా ఇచ్చే ఇంతైనా కూడా ఆనందంగా తీసుకువెళ్ళేవాడు బ్రాహ్మణుడు. మీరనుకునే అగ్రవర్ణ బ్రాహ్మడు, వాడు బ్రతకడం కోసం నాలుగు లోగిళ్ళలో వంట చేసుకుని బ్రతుకుతున్నారు. అగ్రవర్ణం అనే బిరుదును వాడి వంటికి బురదలా రాసి , వీడు పంది అని గెలిచేసే కుహనావాదులకు తక్కువేంలేదు.  బ్రాహ్మణుడంటే చులకన, వాడి వేషం చులకన, వాడి ఆడది చులకన, వాడి బ్రతుకు చులకన.  శాసించడం అంటే ఇప్పటికీ తెలియనివాడు, బ్రాహ్మడే.  అగ్రవర్ణం పేరుతో ఈ నాటికీ బ్రహ్మణుణ్ణి దెప్పిపొడవని జాతి ఏది???అన్ని కులాలవారికన్నా పనికిమాలినవాడిగా మార్చబడినవాడు బ్రాహ్మణుడు. ఆనాడు వారిని కమ్మ, కాపు, రెడ్డి ఇలా అనేక జాతులు కలసి పోషించాయి.... ఇప్పుడు బ్రాహ్మణునకు విలువలేదు...అవసరానికి తప్ప.   ఒకప్పుడు మంత్రాలకు మాన్యాలు ఇచ్చారు...తరువాత ప్రశ్నించే కాలం వచ్చింది...వెంపలిచెట్లకు నిచ్చెనలు వేసే     మేధావులు పుట్టారు. వారికెందుకు అంత గౌరవం అన్నారు? వాళ్ళకిచ్చేదేమిటి అన్నారు...ఇచ్చేది ఆపేశారు. అన్నం పెట్టాల్సిన అమ్మలు మారిపోయారు. దాచుకోవడం చేతకాని బ్రాహ్మణులు దరిద్రులైనారు. అన్నీ వ్యాపారంతో కూడుకున్నప్పుడు బ్రాహ్మణుడు కూడా మంత్రాన్ని వ్యాపారం చేసాడు. తప్పేముంది? మీరంతా అవీ ఇవీ అమ్ముకు బ్రతుకుతున్నప్పుడు బ్రాహ్మణుడు మాత్రం మంత్రం అమ్ముకుంటే తప్పేంటి? ఏం, బ్రాహ్మడు బైకు ఎక్కకూడడా, కారు కొనకూడడా, ఏసీ లు పెట్టుకోకూడడా, ప్రతి దానికీ బ్రాహ్మణుడు చులకనే. బ్రాహ్మణునకు రక్షణలేని పరిస్థితి.    చివరకు బ్రాహ్మణుడు సహాయంకోసం కార్పొరేషనల చుట్టు కుక్కలాగా తిరగాల్సిన పరిస్థితి.  అసలు మనుషుల్లోనే ఏకత్వం లేనప్పుడు, బ్రాహ్మణునకు మాత్రం అదెలా అబ్బుతుంది? ఇది ఏమైనా 80%  బ్రాహ్మణులు అతి నికృష్ట జీవితం గడుపుతున్నారనేది నా పరిశీలనలో తేెలిననిజం. అగ్రవర్ణం అనే పదం బ్రాహ్మణులకు తగిలించి వారిని సర్వనాశనం చేస్తున్నది ఈ వ్యవస్థ అంటే అతిశయోక్తి కాదు.వారి కులాన్ని చూసి ఏడవకండి...వారు జీవన విధానాన్ని చూసి ఆలోచించండి.....👏👏👏👏👏

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...