=== ఐలిజంలో లోపాలు – 1 ===
ఐలిజంలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే.. అతనికీ, అతని అనుచరులకీ సైద్ధాంతికంగా సింక్ కాకపోవడమే.
అతనికి బాగా అనుకూలంగా ఉండేవాళ్ళు క్రైస్తవం పుచ్చుకున్న దళితులు. కాని విచ్చలవిడిగా క్రైస్తవానికి ప్రచారం చెయ్యడం వ్యూహాత్మక తప్పిదం అవుతుంది కనుక “హిందూ దళితులు” అనే వాళ్ళ తరఫున మాట్లాడినట్టు మ్యానేజ్ చెయ్యాలి. హిందూ దళితుల తరఫున మాట్లాడి ఇతర శూద్ర కులాలని సెపరేట్ చెయ్యాలంటే అతనే సెపరేట్ అయిపోతాడు. కాబట్టి ఇతర శూద్ర కులాలనికూడా చచ్చినట్టు కలుపుకోవాలి. ఇతర శూద్ర కులాలు అంటే కొన్నింటిని ఏరుకుని తీసుకోవడానికి కుదరదు కాబట్టి “ఉత్పత్తి” అనీ, “ద్రవిడులు” అనీ ఆ పదాలకి మ్యాచ్ అయిన అందరినీ కలుపుకోవాలి. వారిలో కమ్మ, రెడ్డి, కాపు, వెలమ కూడా వచ్చేస్తారు. కాని వీళ్ళు రావడం క్రైస్తవ దళితులకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఈ కులాలంటే కుళ్ళు.
ఉస్మానియా మీటింగ్ లో ఆయన చెప్పిన చాలా విషయాలకి గొర్రెలు కేరింతలు కొట్టాయి గాని వెంకయ్యనాయుడి కొడుక్కి పూజారి ఉద్యోగం ఇవ్వరన్న ఆయన ఆవేదనకి స్పందన లేదు. నిశ్చబ్దం. ఆధిపత్య కులాలనీ, దుష్ట కులాలనీ, దోపిడీ కులాలనీ క్రైస్తవ దళితులు కుళ్ళుకునే ప్రధాన కులాలు .. కమ్మ, రెడ్డి లాంటివే. నిజానికి బ్రాహ్మణ, వైశ్య కులాలకంటే వీరంటేనే ఎక్కువ మంట వాళ్లకి. కాని ఇలా కొన్ని శూద్ర కులాలని మాత్రమే సెపరేట్ చెయ్యడానికి అవసరమైన చారిత్రిక ప్రాతిపదిక ఐలయ్యకి దొరకడం లేదు. వీళ్ళని సెపరేట్ చెయ్యాలంటే ఐలయ్యే సెపరేట్ అయిపోవాల్సిన పరిస్థితి.. ఎందుకంటే దళితులపై వివక్ష, అంటరానితనం విషయంలో కమ్మ, రెడ్డి కులాలకి ఏ మాత్రం తీసిపోకుండా గౌడ, యాదవ, వడ్డి లాంటి కులాలు కూడా ఉంటారు. కమ్మ, రెడ్డి , కాపు, వెలమ జనాభా లేకుండా వడ్డి, గౌడ, యాదవ డామినేషన్ ఉన్న ఊర్లు బోలెడన్ని ఉన్నాయి.. వాటిలో వివక్ష తక్కువగా ఉండేదేమీ కాదు. ఎక్కడ చూసినా ఇప్పటికీ గొల్ల పల్లి, గవళ్ళ పాలెం, వడ్డిపాలెం లాంటి గ్రామాలు కనిపిస్తాయి. వీరు కూడా ఆయా ఊర్లలో భూస్వాములే.
మరొక ఇరకాటం ఏమిటంటే .. మేము ద్రవిడ అని సెపరేట్ చెయ్యాలని చూడబోతే.. ద్రవిడ వారసత్వం ఉన్న నాలుగు రాష్ట్రాల్లోనూ ద్రవిడ శూద్రులే రాజ్యమేలుతున్నారు. ఒకే ఒక్క చోట బ్రాహ్మణ స్త్రీ అయిన జయలలిత చెరగని ముద్ర వేసింది.. ఆమెని ఏమీ అనలేడు .. ఎందుకంటే అసలు సిసలైన ద్రవిడ పార్టీ, పెరియార్ వారసులం మేమే అంటారు ఆ పార్టీ వారు. జయలలిత మీద ఉన్న ఆరాధన మరొక 50 ఏళ్ళు చెక్కు చెదరదు. ఇకపోతే తమిళ నాడులో కరుణానిధి ఎలాగూ వెనకబడిన తరగతి. తెలంగాణాలో వెలమలు, రెడ్లు, ఆంధ్రాలో కమ్మలు, రెడ్లు, కాపులు, కేరళలో క్రైస్తవులూ, కమ్యూనిస్టులూ, కర్ణాటకలో గౌడలూ ..ఆధిపత్య వర్గాలు. వీరిలో ఎవరూ బ్రాహ్మణ, వైశ్య లేరు. మరి మన మొనగాడు ఎవరిమీద పోరాటం చెయ్యాలి. చేస్తే ఆర్యులు అని ఆయన అనుకునే ఉత్తరాది బ్రాహ్మణ, వైశ్య, జైనుల మీద చెయ్యాలి. అక్కడ ఈయన మాట ఎవరూ వినరు. వినే చెత్తా చెదారమంతా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో ఎంతకాలమని ఏదో ఒక సిద్దాంతం ఉందన్నట్టు నటిస్తూ ఏదో బావుకోవడానికి ప్రయత్నిస్తాడో వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment