Thursday, July 13, 2017

ఎందుకంటే?నేను బ్రాహ్మణ్ణి

రచయత ఎవరో తెలియదు ,వేరే గ్రూప్ నుండి వచ్చింది..
*ఎందుకంటే?నేను బ్రాహ్మణ్ణి* ..

నన్ను నమ్మిన ప్రతీ వాళ్ళను దైవంలా చూసుకుంటా..

నేను రిజర్వేషన్ల గురించి రోడ్డు ఎక్కను..

కార్పొరేషన్లు కావాలని రైళ్లు తగలపెట్టను..

మనోభావాలు దెబ్బతిన్నాయని
వేరొకరి ఇళ్ళ మీద
దాడి చెయ్యను..

నన్ను ఎవడు తిట్టినా అట్రాసిటీ కేసుపెట్టను..

నన్ను ఎవరు కొట్టినా , రాజకీయ హత్యా ప్రయత్నాలు చేసిన  విచారణా కమిషన్లు అడగను..

మా "తెలివిని" వాడుకొని అన్ని పార్టీలు ఈ దేశాన్ని 70 ఏళ్లు ఏలేసాయి.

సూర్యచంద్రులు అనే దైవాలు ఉన్నంత కాలము మా భక్తి సిద్ధాంతం ,
మా వేద,శాస్త్ర సూత్రాలు ఈ ప్రపంచానికి మార్గదర్శకత్వ ఆశీర్వదాలు

అందుకే గర్వంగా చెప్పుకుంటా నేను బ్రాహ్మణ్ణి.

చదువుల్లో..ఉద్యోగాల్లో..వ్యాపారాల్లో మా అవకాశాలు లాక్కున్నా..
మేము ఎప్పుడు ఎదురుతిరగం..అన్ని అందరికీ వదిలేసి కాలాన్నే నమ్ము కుంటాం..

ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానం ఎంత వచ్చిన ఈ ప్రపంచ అభివృద్ధికి ఆర్ధిక వ్యవస్థ కి మా
జ్ఞానం,నమ్మకం,విశ్వాసం మంచితనమే వెన్నుముక అనుకుంటా

అందరికి దీవెన ఇస్తా, డబ్బులు ఉంటే తింటా లేకుంటే సర్దుకుంటా,అంతేగాని ఆత్మాభి మానం వదలను

నా కులాన్ని నేను అభిమానిస్తా..
అంతే సమానం గా మిగతా కులాల్ని గౌరవిస్తా..

అవును నేను
బ్రాహ్మణ్ణి.,
ఎవడి దగ్గరా తల వంచను..
ఎవడి ముందు మాట తప్పను
నాకున్నదే వరం అంటా..
నా అనుకునే వాళ్ళతోనే ఉంటా..

మీరు గర్వం అనుకోండి..పొగరను
కోండి..
మీ ఇష్టం ఏదైనా అనుకోండి..

తల ఎత్తుకొని బ్రతికేస్తా సొంత కాళ్ళ పై జీవిస్తా.దైవ,ధర్మ
శాస్త్ర మార్గంలో నడుస్తా
అందరికుంటే ఆనందిస్తా

ఎందుకంటే నేను
పాత తరపు బ్రాహ్మణ్ణి ...
🙏🙏🙏🙏

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...