Saturday, May 20, 2017

శరీరంలోని షట్చక్రాలు

🌹 *_శరీరంలోని షట్చక్రాలు….వాటి వివరాలు_*🌹

*మూలధారం గుదస్థానం*
*స్వాధిష్ఠానం తు మేహనం*
*నాభిస్తు మణి పూరాఖ్యం*
*హృదయాబ్జ మనాహతం*
*తాలుమూలం విశుద్ధాఖ్యం*
*ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం*
*సహస్రారం బ్రహ్మరంధ్ర*
*ఇత్యగమ విదో విదుః*

- వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.
7.  *సహస్రారం* – సత్యలోకం – ప్రమాతస్థానం
6. *ఆజ్ఞాచక్ర* – తపోలోకం – జీవాత్మస్థానం
5. *విశుద్ధ చక్రం* - జనలోకం – ఆకాశభూతస్థానం
4. *అనాహతం* – మహర్లోకం – వాయుభూతస్థానం
3. *మణిపూరకం* – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. *స్వాధిష్ఠానం* – భువర్లోకం – జలభూతస్థానం
1. *ఆధారము* – భూలోకం – పృథ్వీభూతస్థానం
1. *మూలాధారచక్రం* : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.

2. *స్వాధిష్ఠాన చక్రం* : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.

3. *మణిపూరక చక్రం* : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.

4. *అనాహత చక్రం* : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.

5. *విశుద్ధచక్రం* : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.

6. *ఆజ్ఞాచక్రం* : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.

7. *సహస్రారం* : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది.
సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

*ఇది జ్ఞానం కోసమే...ఆచరణ గురు ద్వారా జరగాలి*

●●●

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...