Monday, April 24, 2017

నవగ్రహముల దేవాలయాలు

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
నవగ్రహములు తొమ్మిది , ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది.
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
1) సూర్యనార్ కోయిల్ - తిరుమంగళంకుడి.

తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లలో కుంభకోణం నుండి 15 km దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ పిలువబడే సూర్యదేవలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుదు ఆయన సతిమనులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .

ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలం లో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది .
ఈ ఆలయ ప్రగాణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్షి ని , నవగ్రహాల చే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచు.

ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.

ఈ ఆలయ పూజలు చాల నిష్ఠ గా జరుగుతాయి , పూజంనతరము ( పూజ తరువాత ) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్య వలసి వుంటుంది , మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో వున్నతరి అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది ..

2) చంద్రగ్రహ దేవాలయము - తిరువైయార్ .

తిరువైయారుకు 5 k.m దూరములొ చంద్రగ్రహ దేవాలయము వుంది . త

తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే చంద్ర దేవాలయము లోని చంద్రభగావానుని దర్శనము సుఖాన్ని , దిర్ఘాయుస్సున్ని , ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము .

సెప్టెంబర్ - అక్టోబర్ మాసాలలో వొచ్చే ఫల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగము పై సరాసరిగా ప్రసరించడము విసేషమయినది...

3) అంగారక (కుజ) గ్రహ దేవాలయము - తిరువైయర్ .

తిరువైయర్కు 6 k.m దూరములొ అంగారక ( కుజ) గ్రహ దేవాలయము వున్నది .

ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము , నమ్మఖము ,

ధైర్యము , విజయము , శక్తికి అంగారకుడే కారణము ,.

వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .

4) బుధగ్రహ దేవాలయము - తిరువెన్నాడు .

అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది ,

ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వ రుడు . అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి .

వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు .కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది .

ఇక్కడ వ్యాపారానికి మరియు బుది ని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము .

5) బృహస్పతి ( గురు) గ్రహ దేవాలయము - ఆలంగుడి.

కుంభకోణానికి 18 k.m దూరములొ ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది . ఈ ఆలయాని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు . ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము .
దీనిని క్రి.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు .

శివుడే దేవ గురువు బృహస్పతి నామదెయము తో గురుదక్షిణామూర్తి గా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది .
భోలాశంఖరుడు ఇకదె హాలాహలని సేవించి గోతులో దాచిన స్థలము ఇదె. ఆ విధము గా ఆపద నుంచి గట్టేకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయే శ్వ రర్ ( ఆపద్భాందవుడు ) గా కొలిచారు దేవతలు .

గురుడికి ఇష్టమైన గురువారము నాడు , నానా బెట్టిన శనగలను పసుపుతాడుతో మాల గ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు , వెనుకబడిన వారు చదువులో మరియు ఎ పని అయిన అయిపోవలిసిన వారికి , విద్యలో ఆటకములు , పనిలోనూ అన్ని తొలగి పోతాయని నమ్మకము ..

గురు గ్రహ దోషాలు వున్నవారు ఆలం గుడి దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధములొ నేతితో 24 దీపాలు భక్తి తో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి , గ్ర్హహ శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడా విశ్వాసము .

6) శుక్ర గ్రహ దేవాలయము - కామ్చనూరు .

3 k.m దూరములొ శుక్ర గ్రహ దేవాలయము వుంది .
దీనెకి పాలాశవనం , బ్రహ్మపరి , అగ్నిస్థలము అని పేర్లు కోడా వున్నాయి .

ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు .

7) శని గ్రహ దేవాలయము - తిరునల్లార్ .

ఇది కుభాకోణానికి 53 k.m ధూరములొ వున్నది .
ఇక్కడి నది తిర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరిన్చిపోతాయి అయిని భక్తుల నమ్మకము .
ఈ ఆలయములో వెలిసిన శ్వమివారి పేరు దర్భారన్యేశ్వరుడు , ఈ దేవుడికి గారిక అంటే చాల ప్రీతి . అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రము గా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కోడా అంటారు .
ఈ దేవాలయములో దర్శించినపుడు భక్తులు దర్భల కోసలు ముడివేస్తారు . ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము .

ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది ., ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్నా గుడి ఇదే .
శనిశ్వరుని తో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు .
ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కొద వున్నది .

ఇక్కడ శనిశ్వరుని కి నిత్యము అభిషేకము జరుగుతుంది .

8) రాహు గ్రహ దేవాలయము - తిరునగేశ్వరాము

కుభాకోణానికి 5 k.m దూరములో వుంది .
ఇక్కడ రాహు గ్ర్హమునకు గల దేవాలయము ఇది ఓక్కటే .

ఇక్కడ నిత్యము వోచే రాహు కాల సమయములో పాలా భిషేకము చేస్తారు . ఆ పాలా భిషేఖము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము ( మెడ ) దగరకు వోచేసరికి పాలు అన్ని నేలము రంగులోకి మారతాయి . మిగిలిన సమయాలలో ఇలా జరగదు .

ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి ..

9) కేతు గ్రహ దేవాలయము - కిల్ పేరుంపళ్లమ్ .

తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది .

ఈ ఆలయములో కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .. ఈ ఆలయము వద్ద ఒక ప్లేటులో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు ...ఇక్కద కేతు గ్రహానికి సంభందిచిన ఎ నివారణ పూజలు అయిన చేస్తారు .

ఈ ఆలయాలలో వధ గల 9 పుష్కరిణి లో స్నానములు చేసి 12 వారాలు ఆరాదిస్తే నవగ్రహాలను , ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...