Saturday, March 4, 2017

గాడ్సే వాఙ్మూలం

#గాడ్సే_గాంధీ_గారిని_ఎందుకు_హత్య_చేశాడు..?

నవంబర్ 15 నాథూరాం గాడ్సే ఉరి తీయబడిన రోజు.
గాంధీజీ ని గాడ్సే ఎందుకు హత్య చేసాడో ఆయన చివరి వాంగ్మూల అనువాదం ఇది. (ఇది కేవలం నాథూరాం గాడ్సే కోర్టుకు స్వయంగా స్వదస్తురి తో ఇచ్చిన వాంగ్మూల అనువాదం మాత్రమే)

నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి ఇప్పుడూ ఉన్నాయి. ఇది నెను 28 ఫిబ్రవరి 1935న సావర్కర్ కి రాసిన ఉత్తరంలో విధితమౌతుంది. నేడు కూడా నావి అవే అభిప్రాయాలు. గాంధీజీ తో నాకు శతృత్వం లేదు. పాకిస్తాన్ ఏర్పాటు విషయం లో ఆయన మనసు స్వచ్ఛమైనదని ప్రజలు అంటారు. నా మనసులో దేశ భక్తి తప్ప ఏమీ లేదు అని చెప్పగలను. విభజన తరువాత ఏర్పడ్డ తీవ్ర  భయానక పరిస్థితులు కేవలం గాంధీజీ వల్ల ఉత్పన్నం అయ్యాయని నేను భావిస్తాను. హత్య చేసిన తరువాత నా పై ప్రజలకి తీవ్రమైన అభిప్రాయం ఏర్పడుతుందని తెలుసు. సమాజం లో నాకు ఉన్న గౌరవం అంత తుడిచిపెట్టుకుపోతుంది. వార్తాపత్రికలు నన్ను ధారుణంగా చిత్రీకరిస్తాయని కూడా తెలుసు, ఐతే నిజాన్ని భూస్థాపితం చేసేంతగా దిగజారిపోతాయని ఊహించలేదు. వార్తాపత్రికలూ ఎపుడు నిస్పక్షపాతంగా రాయలేదు. వారు ఒక మనిషి వ్యక్తిగత ఆలోచనలకి తక్కువ ప్రధాన్యతనిచ్చి, దేశ శ్రేయస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే దేశ నాయకులు దేశ విభజన పాకిస్తాన్ ఏర్పాటు స్వీకరించే వారు కాదు. వార్తాపత్రికలూ నాయకుల పొరపాట్లను కప్పు పుచ్చేవి. దాని వలన దేశ విభజన సులువు ఐపోంది. ఇలాంటి భ్రష్టు పట్టిన వార్తాపత్రికల వలన నా మనసు చలించనివ్వలేదు. పాకిస్తాన్ ఏర్పాటు కాకపోయి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు అని కొందరు వాదిస్తారు. నేను ఆ వాదనని అంగీకరించను. లీడర్లు తమ తప్పులని కప్పి పుచ్చుకోవడానికి ఈ వాదన ముందుకి తెచ్చారు. గాంధేయ వాదులు తమ శక్తి తో స్వతంత్రం తెచ్చాము అంటారు. అదే నిజమైతే వారు బ్రిటిష్ వారి పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనని తమ శక్తితో ఎందుకు ఆపలేకపోయారు.
నా దృష్టిలో గాంధీ మరియు ఆయన అనుచరులది ఒకటే వ్యూహం. ముందు వారి చెప్పిందా దాన్ని వ్యతిరేకించాలి తరువాత కాస్త చర్చలు జరిపినట్టు ప్రజలకి చూపి ఆ పిదప ఒప్పుకున్నట్టు వ్యవహరించాలి. ఇలాగే పాకిస్తాన్ రూపురేఖలు అంగీకరించారు.
15 ఆగస్టు 1947 కపటపూర్వకముగా పాకిస్తాన్ ని అంగీకరించారు.
పంజాబ్ బంగాల్ మరియు సింధ్ ప్రాంతం లోని నివసిస్తున్న హిందువుల గురించి ఎవరు ఆలోచించలేదు. దేశాన్ని ముక్కలు చేసి ఒక మతపరమైన ముస్లిం దేశానికి తెర లేపారు. పాకిస్తాన్ ని వ్యతిరేకించిన వారందరిని మాట మౌఢ్య శక్తులుగా అభివర్ణించారు. జిన్నామాటలు విని మతం ఆధారంగా ఏర్పడ్డ దేశాన్ని మాత్రం స్వీకరించారు. ఈ పరిణామం వలన చాలా కలత చెందాను. పాకిస్తాన్ ఏర్పడిన పిదప భారత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న హిందువుల భద్రతకై తగు చర్యలు చేపట్టి ఉంటే నా మనసు శాంతించి ఉండేది.
పాకిస్తాన్ లోని కోట్లాది హిందువులని వారి భద్రతని నీళ్ళు వదిలి వారు పాకిస్తాన్ వదిలి రాకూడదు అని కాంగ్రెస్ వారు వాదించారు. అలా అక్కడి హిందువులు ముస్లింల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. నాకు ఇవి గుర్తుకు వచ్చినపుడు నా రక్తం ఉడుకుతుంది. ప్రతినిత్యం అక్కడ వేలాది హిందువుల హత్యలు జరిగేవి. 15000 సిక్కులని తూటాలతో కాల్చి ఛంపేశారు. వేలాది హిందూ మహిళలని వివస్త్రలని చేసి నగ్నంగా ఊరేగించారు. వారిని పశువులూ అమ్మినట్టు సంతలొ అమ్మెవారు. ఇది భరించలేని లక్షలాది హిందువులు ఆస్తులు  ఇళ్ళు వదిలి మతం మానం రక్షించుకోడానికి పారిపోవలసి వచ్చింది. వారి సంఖ్య ఎంత ఉందంటే వారు బారులు తీరి వస్తున్న గుంపు 40 కిలోమీటర్లు పొడవు ఉంది. దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు సరి కదా వచ్చే వారికి ఆకాశమార్గం ద్వారా ఆహారం వెదఛల్లడం మినహా ఏమీ చేయలేకపోయింది. ఈ అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కి విన్నపం చేసినా లేక మీరు అత్యాచారాలు కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ముస్లింల భద్రతకి భంగం కలగవచ్చు అని బెదిరించిన ప్రయోజనం ఉండేది. ఇవేమీ భారత ప్రభుత్వం చేయలేదు. భారత ప్రభుత్వం కేవలం గాంధీజీ కనుసైగల మీద నడిచెది. పూర్తి భిన్నమైన వైఖరి తో ఉండే వారు గాంధీజీ. పాకిస్తాన్‌లో ఉన్న హిందువుల అత్యాచారాల పై వాస్తవాలు రాసిన పత్రికలని హిందూ-ముస్లింల మధ్య భేదాలు సృష్టించే పత్రికగా ముద్రవేసేవారు. వారి పై చట్టపరమైన అపరాధలు నమోదు చేసేవారు. వాటి పై ప్రెస్ ఎమర్జెన్సీ ఆక్ట్ అనుగుణంగా చర్యలు చేపట్టేవారు. నాకు కూడా బోలెడు నోటీసులు వచ్చాయి.(ఆ రోజుల్లో) 16000 రూపాయల జామీను అడిగారు. ఇలాంటి 900 చర్యలు చేపట్టారని మొరార్జీ దేశాయి అన్నారు. ఇంతే కాదు ప్రెస్ సభ్యుల మాటలు అస్సలు ఖాతరు చేయలేదు. హిందువుల పై ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు  జరుగుతున్నా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా లేదా ముస్లింలకి వ్యతిరేకంగా గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవన్ని చూశాక ఇక శాంతియుతంగా గాంధీగారిని ఒప్పించగలనని ఆశ సన్నగిల్లింది. పాకిస్తాన్ లో ముస్లింల చేతుల్లో అక్కడ హిందూ జాతి హిందూ సంస్కృతి నాశనం అవ్వడానికి మూల కారణం గాంధీ. సరైన రాజకీయ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి హిందూ సంహారం జరిగి ఉండేది కాదు. చరిత్రలో ఎన్నడు హిందువులు ఇంతటి ఊచకోతకి గురికాలేదు. పరిశీలించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ముస్లింల సమస్యలని పరిష్కరించే సమయం లో గాంధీజీ హిందూ ప్రజల మనోభావాలని ఎన్నడు గౌరవించలేదు. అప్పటికే అహింస అనే ముసుగులో ఎంత రక్తపాతం జరిగిందంటే పాకిస్తాన్ పక్షాన ఏది వినడానికి భారత ప్రజలు సిద్ధంగా లేరు. ఎప్పటి వరకైతే పాకిస్తాన్ లో మత అహంకార పాలన కొనసాగుతుందో అప్పటివరకు భారత్ లో అశాంతి నెలకొని ఉంటుందన్నది స్పష్టం ఐపోంది. అయినా గాంధీ ముస్లిం లీగ్ నేతలకంటే పక్షపాత ధోరణి తో పాకిస్తాన్ ని వెనకేసుకుని వచ్చేవారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన పూర్తిగా ముస్లిం అనుకూల హిందూ వ్యతిరేక శరతులతో ఆమరణ నిరాహార దీక్షకి దిగారు. ఆ షరతులు ఏమిటంటే పాకిస్తాన్ నుండి తరిమివేయబడి ఢిల్లీ లో మసీదులలో ఆశ్రయం పొందిన  హిందువులను తక్షణం ఖాళీ చేయించడం. ఈ షరతులు నిరాహారదీక్ష పేరిట బెదిరించి ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈ సంఘటన జరిగిన రోజున ఢిల్లీ లో ఉన్నాను. అవి చలికాలం రోజులు భారీ వర్షం పడుతుంది. పాకిస్తాన్ నుండి తరిమివేయబడ్డ వారు కట్టు బట్టలతో వచ్చారు నిలువ నీడ లేదు ఐనా ఆ వర్షం లో తీవ్రమైన చలిలో పసిపిల్లల తో సహా మసీదులు ఖాళీ చేయించారు. గాంధీ తన నిరాహారదీక్ష ద్వారా మంకుపట్టు పట్టి పంతం నెగ్గించుకున్నాడు. వారికి మరో ఆశ్రయం చూపే ప్రయత్నా చేయలేదు. వారిలో కొందరు గాంధీ నివాసం ఉన్న విలాసవంతమైన బిర్లా హౌస్ చేరి తమకి ఆశ్రయం కల్పించామని కొరినా గాంధీ మనసు చలించలేదు. ఎంతటి కఠొరమైన వ్యక్తి మనసు ఐన ఇది చూస్తే మనసు కరిగిపోతుంది. ఇది కళ్ళారా చూసిన నేను తట్టుకోలేకపోయాను. నా మనసు కకావికలం అయిపోయింది. ఈ శరణార్ధులు విల్లశాల కోసం మసీదులలో ఉంటున్నారా. నాయకులు చేసిన తప్పిదాలకి తమ ఇల్లు వాకిలి చెట్టు పుట్ట వదిలేసి ప్రాణమానాలు దక్కించుకోవడానికి వచ్చిన వారికి ఈ దుస్థితా అనిపించింది. విభజన కారణంగా సంభవించిన ఈ వాస్తవాల పై గాంధికి పూర్తి అవగాహన ఉంది. ఆదేసమయం లో అటు పాకిస్తాన్ లో ఒక్క గుడి గానీ ఒక్క గురుద్వారా గానీ సురక్షితంగా లేదు. తమతమ ప్రార్ధన స్థలాలని ఎలా అపవిత్రం చేశారు వచ్చిన శరణార్ధులు కళ్ళారా చూశారు. ఢిల్లీ కి వచ్చిన శరణార్ధూలకి నిలువ నీడ లేనపుడు వ్యర్ధంగా ఉన్న మసీదులలో ఉంటే తప్పు ఏమిటి. ఈ పరిస్థితులని కల్పించినది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు. మానవతా దృక్పధం తో కూడా నిరుపయోగం గా ఉన్న మసీదులు వాడుకోకూడదు అని నిబంధనలు పెడితే ఎలా? మంకు పట్టుపట్టి మసీదులు ఖాళీ చేయించిన గాంధీ మరో ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదు. గద్దగట్టె చలిలో చెట్ల కింద జీవనం సాగించాల్సిన అవసరం వారికేందుకు. పాకిస్తాన్ లో ఉన్న దేవాలయాలు హిందువులకి అప్పగించాలని ఎందుకు గాంధీ కోరలేదు? దీనిని బట్టి గాంధీ అహింసావాదం ఒట్టి బూటకం అని తెలిపోయింది. తన నిరాహార దీక్ష విరమించడానికి పాకిస్తాన్ లో ఉన్న హిందువుల సంరక్షణకి ఎటువంటి షరతు విధించలేదు. ఒక వేళ షరతు విధించినా అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు ఖాతరు చేయరని ఆయన చనిపొయినా వెంట్రూకంత బాధ కూడా వారికి ఉండదని ప్రపంచానికి తెలిసిపోయేది.
గాంధీ దీక్ష జిన్నా పై ఎటువంటి ప్రభావం చూపదని ఇదివరకే అనుభవాపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు. ముస్లిం లీగ్ వారు ఆయన్ని లెక్క చేయరని కూడా తెలుసు. ఆఖరికి గాంధీ హస్తికలు భారత్ సహా పలు దేశాల్లోని వివిధ నదులలో కలిపినా వారి కోసం పలుమార్లు నిరాహార దీక్ష చేసి హిందువుల మెడలు వంఛినా పాకిస్తాన్ మాత్రం సింధునది లో కలపడానికి ఎంత ప్రాధేయపడినా అంగీకరించలేదు.
ఇక పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం విషయానికి వద్దాం. సర్దార్ పటేల్ మాటల్లోనే ఆయన ఏమన్నారో విందాం. ఏ ప్రభుత్వాన్ని ఐన వారి నిర్ణయం మార్చుకోమనడం చాలా కష్టం కానీ భారత ప్రభుత్వం మాత్రం కాశ్మీర్ ని కుట్రపూరితంగా ఆక్రమించినందుకు వారికి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం నిలిపివేసిన నిర్ణయాన్ని నిరాహార దీక్ష వలన మార్చుకోవలసి వచ్చింది. పాకిస్తాన్ కాశ్మీర్ పై దురాక్రమణ చేసి చాలా భూభాగాన్ని ఆక్రమించినందున 55 కోట్ల పరిహారం ఆపివేయాలని ప్రభుత్వం భారత ప్రజల ప్రతినిధిగా తీసుకున్న నిర్ణయం. ఆ భూభాగం భారత ప్రజలది ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఐతే కేవలం ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి దీక్ష చేస్తాను అని మంకు పట్టు పట్టి బ్లాక్ మైల్ చేసినందువలన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అపుడు నాకు అనిపించింది గాంధీ పాకిస్తాన్ పక్షపాతం ముందు దేశ ప్రజల మనోభావాలకి విలువలేదు. జడ్జీ గారు తీర్పులో ఇలా రాశారు.  బొంబాయికి చెందిన న్యాషనల్ గార్డియన్  పత్రిక 17 జనవరి 1947 న  ఇలా రాసింది. "భారత దేశాన్ని ఘోరంగా వంచించిన నెహ్రూ ప్రభుత్వం. పాకిస్తాన్ విధ్వంసం ద్వారా సహించలేనిది గాంధీజీ నిరాహారదీక్ష వల్ల సాధించింది".  దేశ ప్రజలని కిరాతకంగా హతమార్చిన దేశానికి ఎదురు డబ్బులు ఇచ్చే కిరాతక చేర్య మేము సమర్ధించలేము అని జడ్జి పేర్కొన్నారు. ముస్లింలు స్వాతంత్రానికి విరుద్ధంగా ఉన్నారు. ఐనా గాంధీ పాకిస్తాన్ పక్షాన మాట్లాడేవారు. ఆయన్ని ఆపే శక్తి దేశం లో లేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో హిందువులని ముస్లింల అత్యాచారాల నుండి కాపాడటానికి ఒకే ఉపాయం మిగిలిపోయింది.  గాంధీని అంతమొందించడం మినహా మార్గం లెదు. గాంధీ ని రాష్ట్ర పిత అంటారు కానీ ఆయన తండ్రి పాత్ర పోషించడం లో దారుణంగా విఫలం అయ్యారు. దయా దాక్షిణ్యం లేకుండా దేశాన్ని రెండు ముక్కలు చేసేసారు. ఆయన మనస్పూర్తిగా విభజన కి వ్యతిరేకంగా నిలబడినట్లైతే ముస్లిం లీగ్ గానీ బ్రిటిష్ వారు గానీ తలొగ్గక మరో మార్గం ఉండేది కాదు. దేశం లో చాలా శాతం విభజనకి వ్యతిరేకం ఐనా గాంధీ దేశాన్ని మోసం చేశారు. అలా ఆయన పాకిస్తాన్ కి జన్మనిచ్చిన  రాష్ట్రపిత అవుతారు గానీ యుగాలుగా ఉన్న భారత్కి కాదు. ఆ విధంగా రాష్ట్రపిత అని పిలిపించుకుంటూ నా భారత్ ని ముక్కలు చేసిన వ్యక్తిని హత్య చేయడం ఆ దేశ పుత్రుడిగా నా కర్తవ్యం గా భావించి గాంధీ హత్యకి పూనుకున్నాను.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...