వివాహ విషయములు - ప్రశ్నభాగము.
తండ్రి కుమారునికి / కుమార్తెకు వివాహము జరిపించ దలచినప్పుడు, తన ఇష్టదైవమును ప్రార్ధించి, ఏ అవాంతరాలు కలగకుండా కార్యము శుభమగుటకు నవగ్రహములను ధ్యానించి, తాంబూల, దక్షణతో జ్యోతిష్కుని సంప్రదించి, వివాహ విషయమై, తగ్గ సమయమా, కుడురునా, గ్రహస్తితి అనుకూలముగా నున్నదా అని అడిగి తెలుసుకో వలెను. ఈ విషయము చెప్పుటకు ప్రశ్న శాస్త్రము తగినది. ఆవిధముగా జ్యోతిష్కుడు, ప్రశ్న అడిగిన సమయమును లగ్నముగా భావించి చూడవలెను. ఆ లగ్నమునకు, పంచమమున పాపగ్రహములుండరాదు. అట్లున్న సంతాన నష్టము కలుగును. సప్తమమున పాపులున్న కన్య మరణించును. లగ్నమున పాపులున్న భర్తకు ప్రాణహాని. అష్టమమున పాపులున్న ఇద్దరికీ ఆయుక్షీణము. ఇట్టి విషయములు పరిసీలించి వివాహమునకు సమయ నిర్ణయము చేయవలెను. ఆ ముహూర్తమునకు ( ప్రశ్న సమయమునకు ) దోషములున్న, ఆ ఆలోచన మానుకొని మరో మారు ప్రయత్నిచ వలెను. ఈ విధానమున ప్రస్తుత కాలమున చాలా మంది విస్మరిమ్చుచున్నారు. కనీ నా అనుభవమున కొందరు నన్ను ఈ ప్రశ్న అడిగి నప్పుడు నాకు కూడా ఆశ్చర్యము కలిగినది. ఇది మంచి సంప్రదాయము. అదే ప్రశ్న అడిగిన లగ్నమునకు, పంచమమున గురు, బుధు, లున్న భార్య పుత్రవతి అగును. పూర్ణ చంద్ర శుక్రులున్న సంతానవతి అగును. లగ్నములో శుభము ఒక్కటైనా ఉన్న భర్త మంచి అనుకూల వంతుడగును. లగ్నమునకు ఏడవ ఇంట శుభగ్రహము ఉన్న, చదువు, ఐశ్వర్యము, ఆయుష్షు, ఆరోగ్యము కల భర్త లభించును. వివాహ విషయమై, వరుని తండ్రి, కన్య ఇంటికి వెళ్లి, తకుమారునికిచ్చి వివాహము జరిపించ వలెనని కోరి కన్యను ( వధువును ) తెచ్చుకొనుట సత్సంప్రదాయముగా శాస్త్రమున చెప్పబడినది.
No comments:
Post a Comment