తథాస్తు దేవతలంటే ఎవరు? అసలు తథాస్తు దేవతలున్నారా..?
తథాస్తు లేక తధాస్థు అంటే అటులనే జరుగుగాక అని అర్ధం. మనం ఏదైనా కోరుకున్నప్పుడు లేక కావాలనుకున్నప్పుడు లేక ఇతరులు దీవించినప్పుడు మనం అన్న మాటలు విన్నవారు అలాగే జరుగుగాక లేక ఇది తధ్యం అని అంటే ఖచ్చితంగా జరుగుతుందని భావించిన మన పెద్దలు తధాస్తు అని దీవెనలందిస్తారు
నిజంగానే తథాస్తు దేవతలున్నారా...?
తధాస్తు దేవతలు సాయం సంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తధాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తధాస్తు అంటూ ఉంటారు. వీరినే తధాస్తు దేవతలు అంటారు.
ఆలాంటి సమయాలలో స్వసంబంధమైన విషయాలను పలుమార్లు అనిన యెడల అట్టి దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటుంటారు. ధనం వుండి కూడా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు నటిస్తూ వుంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో వున్నామని తరచూ అంటూ వుంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు,చెడుమాటలు పలుకుట మంచిది కాదు.
ముఖ్యంగా ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో మనం వైద్యుల దగ్గరికి వెళుతుంటాం. ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అందరు వైద్యులూ చదువుకున్నది ఒకే శాస్త్రం. మరి ఒక వైద్యుడి హస్తవాసే బాగోవడమేమిటి? అంటే... ఈ హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే అనుకుంటూ ఉండటం, తధాస్తు దేవతలు ఆశీర్వదించడం జరుగుతుంటూంది. దాని ప్రకారమే అతని వద్దకు వచ్చే రోగులకు రోగాలు నయం కావడం, తద్వారా మంచి పేరు రావడం వంటివి చోటు చేసుకుంటుంటాయి.
ఇదే విషయం చెడుకూ వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తధాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలించడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతుంటాయి. అందుకే మంచినే తల్చుకుంటే మనందరికీ మంచివే జరుగుతాయి.
అయితే దీనికి భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పరంగా దీనికి అర్ధం. తథా అంటే ఆ ప్రకారంగా; అస్తు అంటే కావలసినదే. అనేవాళ్ళు ఉంటారు. ఎలా అంటారు ఈ మాట మీరు అంటే ముహూర్తం అనేదాన్ని విశ్వసిద్దాం ముందు. ముహూర్తబలం అంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసినవేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఉప్పు - నిప్పు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్లు ప్రేమ ఆప్యాయతలు తవ్వి పోసుకుంటారుఅది ఆధునిక పరమైన వివాహసంబంధాలవైపు దారితీయవచ్చును. లేదా మిత్రత్వానికి దారితీయవచ్చును. ఇదంతా ఎలా వచ్చింది? ఆ చూసుకున్న నిమిషం వేళా విశేషం. అలాగే నిత్యమూ జపం చేసేటటువంటి వాళ్ళు పూజా విధానాలలో ఏదో ఒక లక్ష్యంతో నియమశుద్ధితో, సత్ప్రవర్తనతో మెలిగేటటువంటి వాళ్ళు నోరారా ఏదైనా ఒక మాట అంటే తథాస్తు. వాళ్ళు అన్నమాట నిజం అయి తీరుతుంది.
No comments:
Post a Comment