*"బ్రహ్మా ముహూర్తం" అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?*
*బ్రహ్మా ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.*
*అసలు 'బ్రహ్మా ముహూర్తం' అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ?*
👉 *బ్రాహ్మా ముహూర్తం*
*సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా ముహూర్తం అంటారు.*
👉 *ఆఖరి నిమిషాలు*
*రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా ముహూర్తం అంటారు.*
👉 *పూజలు*
*బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.*
👉 *విద్యార్థులకు*
*విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.*
👉 *జీవక్రియలు*
*మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మా ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.*
👉 *ఒత్తిడి*
*అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.*
👉 *పెద్దవాళ్లు ఎందుకు లేవాలి...?*
*ఆయుర్వేదం ప్రకారం రాత్రి తోందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.*
👉 *ఫ్రెష్ ఆక్సిజన్*
*రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.*
👉 *గృహిణులు ఎందుకు లేవాలి...?*
*గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు, ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక , శారీరక ఆరోగ్యం చాలా అవసరం.*
👉 *ఆందోళన*
*బ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఉదయాన్నే నిద్రలేస్తే...ఇంటిపనులన్ని... ఆందోళన లేకుండా అయిపోతాయి....*
👉 *సూర్యోదయము*
*ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు, ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి....*
👉 *ఆరోగ్యము*
*బ్రహ్మా ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది.....*
*మీ... ✍... ... ...!!!!*
👆 *దయచేసి షేర్ చేయండి అందరికి*
1 comment:
Similar to the logic expressed regarding treating cow as God, this post also have only conjectures and here say.
As per psychology, there are night persons and day persons. Some persons like to stay long in the night and get up late and others vice versa. There is no big difference between the two, as far as memory etc are concerned.
I had a practical experience in this regard. I was thinking that early to get up is good and for some years tried to force my son to get up early, though gently. However, he being a night person, used to stay till 1 or 2 am and get up @9 or 10 am. After he crossed 11th, I stopped my effort. He got through IIT and happily placed in a good IIT. He changed my outlook on this aspect, which I developed from my child hood(without any basis).
I do not mind others not agreeing with this. However, I request all, not to force children with this out dated concept and let them flourish in their own way.
Hinduism, I fel is much more than rituals. It is a philosophy.
Post a Comment