" దక్షిణా అంటే అది ఓక దేవత" దక్షిణా దేవి సాక్ష్యం గా పుణ్య కార్యాలు చేసే మనుష్యల పుణ్య వివరాలు దేవ సభలో చెప్పి దేవత పాపాన్ని హరించి పుణ్యాన్ని శుభ ఫలితాలను ఇస్తుంది.
ప్రమాణం యజుర్వేద స్వధ్యాయం ..
దక్షిణాభిర్ దక్షిణా ణా నామ్.. అపహత పాప్మానో .. అని ఉంది,
ఋగ్వేదం లో దక్షిణా దేవి స్తోత్రం కూడా ఉంది
యజ్ఞ ఫలితం రావడం కోసం అక్కడ దక్షిణా దేవి ప్రీతి కోసం చదవాలి, దక్షిణ ఇచ్చే యజమాని ప్రతి కార్యక్రమాల్లో పాపాలను బ్రాహ్మణులు మనస్పూర్తిగా స్వీకరించి పాపాన్ని కర్మ దోషాల్ని వెంట తీసుకెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు
నవగ్రహ శాంతులు కర్మ కోసం బాధ పడుతున్న పూర్వ పాపాలు గురించి ఇంకా చెప్పాలా..
కార్యక్రమం నిర్వహించే ఆచార్య, బ్రహ్మ లు పాపాన్ని గ్రహిస్తారు యజమానికి వారి ఇష్ట సిద్ధి ని ప్రసాదిస్తారు ఇది వాస్తవం
అందుకని దక్షిణ లేని యజ్ఞo వైదిక కార్యక్రమాల ఫలితం ఉండదు (నిష్ఫలం) శాస్త్రం లో చెప్పినట్టుగా దక్షిణలు గోవు దూడ ,బంగారం వస్త్రాదులు ఇంకా చాలా ఇవ్వాలని ఉంది , అయితే ప్రస్తుత కాలంలో యజమానికి కష్టం గా ఉండ కూడదని మన పెద్దలు పండితులు ప్రస్తుత చలామణి అయ్యే ద్రవ్యం ఇవ్వడం తప్పుకాదని పండితుల అభిప్రాయం
యజమాని స్థానం లో ఉన్నవాళ్లు బ్రహ్మ ఆచార్య ఋత్విక్ దక్షిణలు వాళ్ళకు కాలానుగుణంగా సంతృప్తి చెందేలా చూసుకోవడం యజమాని స్థానంలో ఉండే ప్రతీ భక్తుడి ధర్మం
(రాజశేఖరుని విజయ్ శర్మ గారి సౌజన్యంతో)
No comments:
Post a Comment