బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?
“భావోఘ్రాణస్వయస్పంధి” అంటే నాసిక పై భాగం భ్రుకటి మధ్య భాగం కలుసుకొనే చోట బొట్టు పెట్టుకోవాలని అర్ధం.
ఇక్కడ ఇడ, పింగళ, సుఘమ్న అనే మూడు నాడులు కలుస్తాయి. దీనినే ‘త్రివేణి సంగమం’ అంటారు. ఇది షియూషా గ్రంధికి అనుభంద స్ధానము. ఇదే జ్ఞాన గ్రంధి. ఎవరైతే నమఘ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులు అవుతారు.
మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యుటరీ గ్లాండు పై ఉంటుంది. “కేనన్” అనే పాశ్చాత్య శాస్ర్తవేత్త భ్రకటి స్థానాన్ని మానవుని యొక్క ‘ధన’ (+) మెడ వెనుక భాగాన్ని ‘ఋణ’ (-) విధ్యుత్ కేంద్రాలు అని అన్నాడు. ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరం చేస్తుంది. భ్రుకటి వద్ద ఉన్న నాడులు సున్నితంగా ఉంటాయి. అందుకే జ్వరం వస్తే వైధ్యులు నుదుటి పై చల్లని గుడ్డ వేయమంటారు. పైన పేర్కోన్న కీలక, సున్నిత నాడులను తీవ్రమైన సూర్యకిరణాలనుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి.
విభూతిధారణ
సాయంత్రం రాత్రి సమయాల్లో విభూది ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూది వల్ల రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. ఓజస్సు వృద్ది చెందుకు. చర్మ రోగాలు దరి చేరవు.
బొట్టు శరీరంలో ఉన్న ఉష్ణమునంతటిని పీల్చి వేస్తుంది.జఠర, శ్వాస కోశముకు తగినంత ఉష్ణాన్ని అందజేస్తుంది.
మనం సూర్యుడిని నేరుగా చూడలేం.అదే రంగుల అద్దాలు లేదా ఒక వైపు రంగు ఉన్న గాజు ద్వారా, స్పష్టంగా సూర్యుడిని చూడగలం. ఎందుకంటే సూర్య కిరణాలు అద్దం పై పడి పరావర్తనం చెందడం వలన కళ్ళకు హని కలుగదు. అంటే ఇక్కడ సూర్య కిరణాలు కళ్ళకు పడకుండా అద్దం ఏ విధంగా పని చేస్తుందో, అదే విధంగా బొట్టు కూడా జ్ఞాన నాడికి హని కలగకుండా పని చేస్తుంది.
నేడు స్ర్తీలు రసాయనాలతో తయారు చేసిన బొట్టు ( స్టిక్కర్స్ ) వాడడం వల్ల భ్రుకుటి వద్ద చర్మ రోగాలు వస్తున్నాయి. దీని వల్ల కొందరు స్ర్తీలు బొట్టు పెట్టుకోవడం వదిలేయాల్సి వచ్చింది.
మన పూర్వీకులు అందించిన సంస్కృతి శాస్ర్తీయమైనది. స్వదేశీ సంస్కృతిని నిర్లక్ష్యం చెయ్యడం అంటే మాతృమార్తిని అమ్ముకున్నట్టే.
1 comment:
అద్భుతః __/\__
Post a Comment