Saturday, April 5, 2008

మనమేం రాస్తున్నాం?

మన నిత్య వ్యవహారంలో రాతకు ఎంతో ప్రాధాన్యముంది.ఈ రాతకు ప్రామాణికత విద్యున్మాధ్యమాలు(Elocronic media) / పత్రికలు/పుస్తకాల ద్వారా సమకూరుతుంది. వీటిలోనే తప్పులుగా రాస్తుంటే సాధారణ మానవునికీ అదే అలవాటు ఔతుంది. కాబట్టి వీలైనంత వరకు రచయితలు రచనల్లో జగ్రత్త వహిస్తే బాగుంటుంది.
సాధారణంగా మనం చేసే పొరపాట్లు-
1) స,శ,ష ల మధ్య తేడా గమనించక పోవడం.
ఉదా:- రమేశ్,సురేశ్,వేంకటేశ్ పదాలను -
రమేష్,సురేష్,వేంకటేష్ అని రాస్తున్నారు.

2) కైలాసం అనే పదం నుండి పుట్టిన పదాన్ని- కైలశ్/కైలాష్ అని రాస్తున్నారు.
3) క్రియల్లో "చెప్పాడు" అనే పదం ఎలా పుట్టిందో చూద్దాం.
చెప్పిన + వాడు> చెప్పినాడు> చెప్పాడు.
అట్లే చేసిన+వాడు ఏమి కావాలి?
చేసిన+వాడు>చేసినాడు>చేసాడు.
కానీ మనమేం రాస్తున్నాం? "చేశాడు".
ఇక్కడ ’స’ , శ గా ఎలా మారుతుంది?
ఇటువంటి వాటిల్లో జాగ్రత్త వహించాలి.

3 comments:

చిన్నమయ్య said...

శర్మ గారూ, నమస్కారం. మీ కృషి ప్రశంసనీయం. ఇక టపాలోని విషయానికొస్తే - నా మాట చెప్పొచ్చా?

భాష జీవనది లాంటిది. ఇరుగు పొరుగు వారి నుంచీ, వలస వచ్చిన వారి దగ్గర నుంచీ, నేటి వివిధ మాధ్యమాల ద్వారా నిరంతరమూ మార్పు చెంది, కొత్త సొగసులు పోతునే వుంటుంది. "పలికినట్టుగానే రాయడానికి", ఈరోజు చెయ్యి తిరిగిన రచయితలందరూకూడా "శ" ని నిర్భీతిగా అచ్చ తెనుగు మాటలలో ఉపయోగిస్తున్నారు.

"ఋ" కారాన్ని తెలుగులో "ఉ" కారానికి సమీపంలో పలుకుతారుకదా! పలికేటప్పుడు - గృహాన్ని : గ్రుహమనీ, ఋణాన్ని : రుణమనీ అంటుండడం కద్దేకదా! "కృష్ణ" దీనికి మినహాయింపేగా మరి. 60 ల్లో వచ్చిన చిత్రం -"శ్రీ క్రిష్ణ పాండవీయం" అని పేరు టైటిల్సులో వేసేరు మరి.

మార్పు చెందని భాష మృతమైపోతుందేమో!

Kathi Mahesh Kumar said...

నూరుపాళ్ళూ నేను చిన్నమయ్యగారితో ఏకీభవిస్తాను.

ఓ బ్రమ్మీ said...

శర్మగారూ,

మీతో నేనేకీభవిస్తాను, మరి మీరు చేస్తున్నదేమిటి? వ్రాయడాన్ని చక్కగా ’రాసే’స్తున్నారే.. అది భాషని ప్రక దోవ పట్టించడం కాదా.

మీలాగే మిగిలిన వాళ్ళు కూడా. తప్పులెన్న్జినట్లు అనిపిస్తే, క్షమించండి. ఇవ్వాళ మీరు వ్రాయడాన్ని రాయడంగా మారుస్తున్నారు, రేపు మరొకడు దాని పూయడం గా మార్చడని నమ్మకమేమిటి?

ఆలోచించగలరు!!
ఇట్లు,
భవదీయుడు
చక్రవర్తి

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...