Saturday, January 26, 2008

భారతీయులు వలస వచ్చారా?

మనం చరిత్ర చదివితే అందులో "భారతీయులు ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన జాతి/ మధ్యాసియాలో పుట్టిన జాతి అనీ, అక్కడి నుండి మన ఫూర్వులు వలస వచ్చార”నీ పాశ్చాత్య చారిత్రకులు రాసిన రాతలు చదువుతాం.
కానీ, "ఇదంతా తమను భారతీయులు వలసవచ్చినవారని అనకుండా,"మనమంతా వలస వచ్చినవారమే" అనేందుకు వేసిన పథకం " అని మన చారిత్రకులు చెబుతారు.అందుకు వారు పురాణాలను ఆధారంగా చూపుతారు.కాని, పురాణాలు ప్రమాణంగా అంగీకరించరు.వారికి ఆధునిక శాస్త్ర్రాలే ప్రమాణం.
మన విశ్వనాథ సత్యనారాయణ సిద్దాంతంలో- అసలు మానవ జాతి అంతా భారతదేశంలోనే పుట్టింది.వారి ప్రకారం-
ఎవరో కొందరు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తారు.అటువంటి వారిని మ్లేఛ్ఛులు అంటారు.మ్లేఛ్ఛులు అనే మాటకు భ్రష్టులు అని అర్థం.అంటే ధర్మ భ్రష్టులని భావం.అటువంటి వారిని మనం దేశబహిష్కారం చేసాం. ఇక్కడినుండి తరిమివేయగా వెళ్ళిన వారికి మనమంటే ఉక్రోశం.కడుపు మంట.అందుకే అక్కడ వాళ్ళు మన ఆచారాలకు,నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రత్యేక సంస్క్రృతిని నెలకొలిపారు.కాబట్టి మనం వలస వచ్చినవాళ్ళం కాము,వాళ్ళే ఇక్కడినుండి వేరే దేశాలకు వలస వెళ్ళారు.
ఈ సిద్ధాంతాన్నే బలపరుస్తూ- డా.రామక పాండు రంగ శర్మ(భాషాసాహిత్య పరిశోధకులు) భాషాశాస్త్ర ప్రమాణాన్ని ఉదహరించారు.అదైతే- ఆధునిక శాస్త్రం కదా.అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది.
మనమంతా - మానవులం. "మానవ" అనే పదం సంస్కృత పదం.ఆ పదానికి వ్యుత్పత్తి-
మను+అ=మానవ; మను+స్య=మనుష్య.
అంటే- మనువుకు సంబంధించినవారు అని అర్థం.
మానవులంతా ఎలా బ్రతుకాలో తెలుపుతూ మొదట నిర్దేశించినవాడు- మనువు.మనువు చేత ధర్మ నిర్దేశం చేయబడినవారిమి కాబట్టి మనకు మానవులు/మనుష్యులు/మనుషులు అని పేరు.
ఇక పాశ్చాత్యులకు ఇంగ్లీష్ లో కూడా-
మానవుడు=MAN.
మానవ స్త్రీ= woman.

మను అనేది Man అవుతుంది.
అట్లే- మను లోని పదాంత ఉకారం పదాదిన చేరి Woman ఔతుంది.
అంటే- మను-->man/Woman.
కాబట్టి వారందరూ మనువుకు సంబంధించినవారని అర్థం.

కాబట్టి- పాశ్చాత్యులూ ఈ దేశం లోనే పుట్టిన "మానవులు(మనువుకు సంబంధించినవారు)".
కాబట్టి- భారతీయులు ఎవరూ వలసవచ్చినవారు కారు,పైగా ఇక్కడినుండే అందరూ వలస వెళ్ళారు అనే సిద్ధాంతం అందరూ ఒప్పుకోవలసి వస్తుంది.

16 comments:

, said...

శర్మ గారు! చాలా మంచి విషయాలు చెప్పారు. ఇదే కోవలో ఆర్యులు, ఆర్య పదం యొక్క అసలు మర్మం, ఆర్య సంస్కృతి గురించి వివరిస్తే బావుంటుంది. మాక్స్ ముల్లర్ లాంటి విదేశీ మేధావులు పని గట్టుకుని తమ మత ప్రచారం కోసం మన దేశ చరిత్రని కొన్ని వేల యేళ్ళ సంవత్సరాల్లకు వెనక్కి జరిపి మనకెంతో అన్యాయం చేశాడు. అలా జరిపితే బైబిల్ లో చెప్పిన ఆడం ఈవ్ లకు, సృష్టి ప్రారంభమానికి ప్రామాణికత వస్తుందని. ఆర్య సంస్కృతి ఆయన కల్పించిన కట్టుకథ, ఆ విషయం ఇప్పటి నవీన మెధావులు(విదేశీ వాళ్ళతో సహా) యెవరూ ఒప్పుకోవటం లేదు. ఇలాంటి విషయాలపై నేను మొదలుపెట్టిన బ్లాగు మీరు చదివి మీ అభిప్రాయం చెప్పండి. http://theuntoldhistory.blogspot.com/

Rajendra Devarapalli said...

అయ్యా శర్మ గారు,బ్లాగు రంగులు మార్చేందుకు ప్రయత్నించండి.కష్టంగా ఉంది చదవటం.

Rajendra Devarapalli said...

"డా.రామక పాండు రంగ శర్మ(భాషాసాహిత్య పరిశోధకులు) భాషాశాస్త్ర ప్రమాణాన్ని ఉదహరించారు.అదైతే- ఆధునిక శాస్త్రం కదా.అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది.” సదరు శర్మ గారు మీరే కదా?!ఈ భాషా శాస్త్ర ప్రమాణాన్ని మీకు ముందు ఇంకెవరూ చూపలేదా?అలాగయితే విశ్వనాధ మీరు ఇద్దరు తేలారన్న మాట.మరి ఇండో-జెర్మన్ భాషా కుటుంబమనీ,సంస్కృతభాషకూ జెర్మను భాషకూ ఏవో చుట్టరికాలు ఉన్న సంగతి వట్టిదేనా?పిత జర్మనులోని ఫిదర్ కూ ఇంగ్లీష్ లోని ఫాదర్ కూ అవినాభావ సంబంధముందని ఎక్కడో చదివాను.మళ్ళీ ఆ సంగతులు కొత్తగా తెలుగువారూ అందరూ చదవాలి కాబోలు,ఇకనుంచి.

మొత్తం మనువు లు ఎంతమంది శర్మగారు?స్త్రీ,శూద్రుల మీద ఆంక్షలు విధించినాయనా,మీరు చెప్పిన మనువు ఒకరేనా?మనువు అంటే పెళ్ళీ అని ఒక అర్ధం ఉంది మరి దాని సంగతి ఏమిటి?

Dr.R.P.Sharma said...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారూ! మీ సూచనలకు కృతజ్ఞతలు.
మీరు అడిగిన ప్రశ్నలు-
1.సంస్కృతం - ఇండో జర్మానిక్ భాషేకదా? ఇటువంటి సిద్ధాంతం ఎవరూ చెప్పలేదా?
2.మనువు అంటే ఎవరు? అర్థం ఏమిటి?మనువులెందరు?

వీటికి సమాధానాలు చెబుతాను.

సంస్కృతం ఇండో జర్మానిక్ భాష అనే విషయంలో సందేహం లేదు.మళ్ళీ కొత్తగా ఈ విషయంలో నేను ప్రతిపాదిస్తుంది ఏమీ లేదు.కాబట్టి తెలుగువాళ్ళు కొత్తగా చదువాల్సింది ఈ విషయంలో ఏమీ లేదు.
భారతీయ భాషలు రెండు విధాలు.
1.భారోపీయ భాషలు.(Indo Europian)
2.ద్రవిడ భాషలు.
దక్షిణ భారత దేశ భాషలు ద్రావిడ భాషలు కాగా ఉత్తర భారత భాషలు(సంస్కృతం తో సహా)భారోపీయభాషలు.
ఐతే- సంస్కృతానికి,ఇంగ్లీష్ మొ. భాషలకు జన్యసంబంధం ఉంది.భాషాశాస్త్ర ప్రకారంగా- సోదరభాషలతో తులన(compare) చేయడం ద్వారా వ్యుత్పత్తి చెబుతారు.అలాగైతేనే ఆ పదాల పుట్టుక,అర్థ సామ్యం మొ. సరిగా నిరూపించబడుతాయి.సంస్కృతానికి,ఇంగ్లీష్ కు తులన చేయడంలో నేను అనుసరించిన పద్ధతి కూడా అదే.
ఇక్కడ సం.మను>ఇం.Man అని అర్థ సామ్య పదసామ్యాలవల్ల నిరూపించబడింది.
ఇక సిద్ధాంత ప్రతిపాదన నేను కొత్తగా చేసిందేమీ లేదు.కేవలం పెద్దలు చెప్పిన సిద్ధాంతాన్ని భాషాశాస్త్ర పద్ధతిలో నిరూపించానంతే.

మనువు అనే పదానికి పెళ్ళి అనే అర్థం గురించి-
మనువు అనే పదం తెలుగుదేశ్యం ఒకటుంది,సంస్కృతసమం ఒకటుంది.నేను చెప్పింది సంస్కృత పదం."గురుః" అనే సంస్కృత ఉకారాంతపదం తెలుగులో "గురువు" అవుతుంది.అట్లే- మనుః అనే ఉకారాంతపదం "మనువు" అవుతుంది.
మీరు చెప్పే అర్థం తెలుగు(దేశ్య)పదం.దానికి- పెళ్ళి,బ్రతుకు,వృత్తి,నడత,కాపురం,భర్త అనే అర్థాలు కూడా ఉన్నాయి.(మనువు అనేది కృదంతం.ఇంకా వివరాలు కావాలంటే నా సిద్ధాంత వ్యాసం - శ్రీమదాంధ్ర మహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు చదువండి. http://www.freewebs.com/teluguthesis/thesislibrary.htm?forumID=413581&page=1&topicID=189013
అనే అడ్రస్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.)
ఇక మనువులెందరు అన్నారు.మనువులు 14 మంది.
మహాయుగ ప్రమాణం43,20,000
ఒక్కొక్క మన్వంతరం=మహాయుగంX71 అంటే43,20,000X71 సంవత్సరాలు.
మనువులు-
1.స్వాయంభువ మనువు 2.స్వారోచిష మనువు 3.ఉత్తమ మనువు
4.తామస మనువు 5.రైవత మనువు 6.చాక్షుష మనువు
7.వైవస్వత మనువు 8.సూర్య సావర్ణి 9.దక్ష సావర్ణి
10.బ్రహ్మ సావర్ణి 11.ధర్మ సావర్ణి 12.రుద్ర సావర్ణి
13.దేవ సావర్ణి 14.ఇంద్ర సావర్ణి.
వాటిలో-ఆరు మన్వంతరాలు గడిచాయి.ఏడవదైన వైవస్వతమన్వంతరం లో కూడా 27 మహాయుగాలు గడిచాయి.ఇప్పుడు 28 వ మహాయుగంలో,నాలుగవదైన కలియుగంలో5108వ సంవత్సరమిది.

ఇక- మీరు ఏదో ఒక మనువు గూర్చి చెప్పారు. స్త్రీ శూద్రుల మీద ఆంక్షలు విధించిన మనువని. నాకా విషయాలు అంతగా తెలియవు. ఎందుకంటే- నేను మూలం చదువందే ఎవరో రాసిన మాటలను ఆధారం చేసుకొని మన పూర్వులను మాట అనలేను.ఎందుకంటే నా దృష్టిలో మన పూర్వ మహర్షులకు ఎలాంటి స్వార్థం ఉండి ఉండదు అని నా నమ్మకం. మీరు మూలం చదివి,ప్రమాణ పూర్వకంగా చెబితే నమ్ముతాను.
ఇంత మంచి అవకాశం కలిపించినందుకు మరొక్క సారి కృతజ్ఞతలు.ఇప్పటికి సెలవు.

Unknown said...

Hi DR.Sharma

I dont know how to write a blog in telugu. But What I can say is that, you have told many things which many people like me and Rajendra kumar dont know.

I think being an Indian every body should know such things. Being a software engineer I got the oppurtunity to know things like this.

I thank you for such an excellent blog. I request you to continue your research work and post them so that the old,current and even younger generations should know, how our culture, hinduism and languages got evolved. Which one is the oldest religion and how their existence came in.

Again thank for the good work keep doing.

Dr.R.P.Sharma said...

శ్రీనివాస్ గారూ!
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
రాజేంద్రకుమార్ గారి సూచనలు కూడా ఆలోచింప జేసేవి గానే ఉన్నాయి.
అటువంటివి ఉన్నప్పుడే ఆలోచనలు కొన్ని కొత్తవి కూడా వెలువడుతాయి.

Dr.R.P.Sharma said...

Thanks OREMUNA. A good reference suggested.

Ray Lightning said...

శర్మ గారు

ఆర్య వలస సిద్ధాంతాన్ని కొంత శాస్త్రీయ పద్ధతితో విమర్శించండి. మీరిచ్చిన నిరూపణలు చాలా పలచగా ఉన్నాయి.

1) మ్లేఛ్ఛులు అంటే "మాటకు బ్రష్టులు" అని వివరణ చెప్పారు. అంటే కేవలం, మన భాష మాట్లాడనివారు (వారి భాష మనకు అర్థంకాని వారు) అని భావం. అంతకు మించి "సంస్కృతి లేనివారు. అనాగరకిత వల్ల దేశమ్నుండి వెలివేయబడ్డవారు" లాంటి భావాలు నవ్వులపాలుగా ఉన్నాయి. పురాణాలలో ఆంధ్రులను కూడా మ్లేఛ్ఛులు కిందే జమకట్టేవారు చాలా చోట్ల (కిరాతులు, కాంభోజులు, చీనులు, ఆంధ్రులు వగైరాలు అంటూ). దీనికి కారణం ఆంధ్రభాష సంస్కృతం మాట్లాడేవాళ్ళకు అర్థంకాకపోవడంవల్లనే కానీ, ఆంధ్రులు అనాగరీకులు అవ్వడం వల్ల ఏమాత్రము కాదు.

2) మానవ - man అన్న పదాలు ఒకే మూలం నుండీ పుట్టాయి. కానీ, ఆ మూల భాష సంస్కృతమే అని చెప్పడానికి రుజువు ఏమిటి ? ఈ ప్రోటో-ఇండో-యూరోపియన్ భాష ఏమిటో/ఎక్కడిదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మల్లాగుల్లాలు పడుతున్నారు, ఇంకా ఏమీ తేలలేదు.

Dr.R.P.Sharma said...

అయ్యా ray lightning గారూ!
మ్లేచ్చ శబ్దానికి నేను ఇచ్చిన అర్థాలు నా సొంతవి కావు.ఊహా జనితాలూ కావు.దానికి శ్రీసూర్య రాయాంధ్ర నిఘంటువులో ఇచ్చిన అర్థాలు (కింద ఇచ్చాను)చూడండి.ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి.వాటిని చూద్దాం.

1.మ్లేఛ్ఛము(సం.)=అప శబ్దము
2.మ్లేఛ్ఛనము(సం)= అప శబ్దములతో మాటలాడుట
3.మ్లేఛ్ఛుడు(సం)=అనాగరికుడు,నీచ జాతివాడు,గో మాంస భక్షకుడై విరుద్ధ సంభాషణం చేయుచూ సర్వాచారములను వదిలిన వాడు, పాపి,దుష్టుడు.

పై అర్థాల్లో మొదటి రెండు మీరు ఒప్పుకొన్నవే.ఇక మూడవ అర్థం నేను చెప్పిన అర్థానికి దగ్గరగా ఉంది.నేను చెప్పిన "ధర్మ భ్రష్టత" అనే అర్థం,పైన చెప్పిన "గో మాంసభక్షణం,విరుద్ధ సంభాషణం,సర్వాచార త్యాగం" అనే మాటల సంగ్రహమే. ఇక దేశబహిష్కారమంటారా? చెప్పానుగా-విశ్వనాథ వారి పురాణవైరగ్రంథమాల నవలలు చదవండి. మీకు ఆ విషయం ఆయన అభిప్రాయంగా తెలుస్తుంది.పెద్దల మాట కదా! ఆర్య వ్యవహారంబు గ్రాహ్యంబు.

ఇక పురాణాల్లో ఆంధ్రులను కూడా మ్లేఛ్ఛులనే పేర్కొన్నారు అన్నారు.మీరు ఆ వాక్యాలను ఉటంకించగలరా? లేదా ఎవరొ ఇంగ్లీష్ లో రాసిన రాతలు చదివి చెబుతున్నారా? ఇంగ్లీష్ వాడి రాతలన్నీ మనకు మనకు పోట్లాటలు పెట్టేవి.మన చరిత్రను తప్పుదారి పట్టించేవి.

ఇక మూలభాష సంస్కృతమే అని చెప్పడనికి ఋజువేమిటి? అన్నారు. అది నా ప్రస్తుత వాదానికి సంబంధించింది కాదు. ఐతే మూలభాష కాకున్నా- వ్యుత్పత్తి లభిస్తున్నది కేవలం సంస్కృతానికి మాత్రమే.మనకు నిరుక్తం,గురుబాల ప్రబోధిక వంటి పుస్తకాలు ఉన్నయి. ఆంగ్లేయులకు అలాటివి లేవు. వారికి Etimology అంటే కేవలం సోదర భాషా పదాలను list చేయడంమాత్రమే. వారికి పదం పుట్టుకను విచారించే బలమైన శాస్త్రాలు లేవు.కాబట్టి వ్యుత్పత్తి లభించే భాష నుండే వ్యుత్పత్తి చెబుతాం.అదే మూలభాషలో కూడా వ్యుత్పత్తి కావచ్చు గాక.

ఇక వాదం పేలవంగా ఉంది. శాస్త్రీయ పద్ధతి అవలంబించమన్నారు. నేను భాషా శాస్త్ర పద్ధతిలో నిరూపించాను.అది శాస్త్రమేగా?

ఏది ఏమైనా చక్కని అవకాశం కలిపించారు.కృతజ్ఞ్తలు.

, said...

గో మాంస భక్షకుడైనవాడు నీచజాతివాడు, అనాగరికుడు అయితే మన వేద పండితులు, క్రతువులు నిర్వహించేవారందరూ, క్షత్రియులు వీళ్లు నీచజాతివాళ్లునూ, అనాగరికులూ, పాపులు, దుష్టులూ కావాలి , అంతేకదా !!
(వైదిక బ్రాహ్మణులు , క్షత్రియులు గోమాంస భక్షకులు కాదనే సాహసం ఎవరుచేయగలరు???)

Unknown said...

Hi Sridhar,

I dont know whom you are referring to when you say Brahmins, If some body who born as brahmin and do not follow Brahma Karma's is not brahmin.

I really dont understand on what basis you say comments like Brahmins are the Cow eaters.

If some body in that caste does that, you can not say that all Brahmins are are like that.

There might be some non-sense people in india, but that does not mean that all indian's are senseless.

I hope all others agree with me.

, said...

Mr. srinivas, I dont know where u stand regarding the info. u have about vedic culture,
What I mean is IT WAS A VERY COMMON PRACTICE IN THE VEDIC TIME THAT BRAHMINS AND KSHATRIYAS USED TO EAT COWS AFTER THEY PERFORME THE YAGNAS OR KRATUVU (especially brahmins), only after many years that this practice was abondoned.
Plz. come with info. , dont simply put ur arguments

, said...

I would like to tell you that 'cow' slaughter was common in Vedic periods..........

Paraskar grahasutra says......" samanso madhupark ityaminyaya bahumanya mana shrotriyabhyagtaya vatsari mahokshan mahajan da

nirvapanti grehmeghin , tahin dharmasutrakara samamnanti ."
.....meaning thereby that 'Madhupark' should be served with meat.

As per 'Apastamb'..." Samwatsaran GAVYEN preeti, bhuyansmato mahishen, eten gramyaranyana PASHUNA MANS medhyavyakhyatam.

khadgopastarane khadagmansenanantya kalam tatha shatbalemartsayasya mansen vadhrinasasya cha.."[ AA.DHA. sutra 2/7, 16/25 &

2/7/17/3]

Meaning thereby that by serving 'COW MEAT' during 'SHRADH' the 'pitras' get satisfied for one year.

'Manu' has stated........." Niyuktastu yathanyaya yo mans nati manava sa pretya pashunta yaati. sambhavanekvishantim.."

i.e. one who doesnt eat the meat served during madhupark and shradh, remains an animal for 21 births.

There are plenty of evidences which suggest that animal meat was very popular during vedic period.

Plz read Vishnudharmotterpuran, Kurmapuran, Mhabharata, Meghdoot of Kalidasa ,branardiya etc etc. for reference.

Plz note that this should in no way be construed as disgracing the Vedas or brahmins or kshatriyas. I just qouted them to show you
that meat eating was very much prevelent in ancient times.

Dr.R.P.Sharma said...

అయ్య శ్రీధర్ గారు!
మీరు గోమాంసభక్షణం అనే మాటకు ఆవు మాంసం అనే అర్థాన్ని స్పష్టంగా చెప్పారు.యజ్ఞ యాగాది క్రతువుల్లో బ్రాహ్మణులు దాన్ని తినే వారని-
పారస్కర గృహ్య సూత్రం, ఆపస్తమ్బ ధర్మసూత్రాలను ఉటంకించారు.కానీ నాకేమో మీరు రాసినవి దొరకలేదు.అవి ఇంగ్లీశ్ లో ఉండడం వల్ల చదవడనికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆ రెండుపుస్తకాల లింక్ లు ఇచ్చాను.వాటిని download చేసుకొని,ఆ పేజీ నెంబర్ లు చెప్పండి.అవి కాస్త చదివి అర్థం చెసుకొనే ప్రయత్నం చెస్తా.

, said...

Sir,
Plz. download this ebook
and read PATIENTLY, You will get many
REFERENCES.
http://www.sharelor.com/v/1584399/riddles_in_hinduism.pdf.html

Dr.R.P.Sharma said...

I am unable to download it.Will you post it in an other site please?
I am unable to understand that when the reference books(i.e. Apastamba Dharma sutram & paraskara grihya sutram)are available here,why to search them in another book?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...