Saturday, May 6, 2017

వేదంలో గోవు

*వేదంలో గోవు*

వేదంలో గోవును '' *గౌరగ్నిహోత్రః*'' అని వర్ణిస్తారు. గోవు అగ్నిహోత్రంగా భావించటం వెనక ఒక రహస్యముంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యం అబ్బుతుంది. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్ వర్యప్రాప్తికి సంబంధించిన ఆశీర్వచనం చేస్తారు. *''మేధావీ భూయాసన్‌ యశస్వీ భూయాసన్‌''* అంటూ ఆ యజ్ఞ భస్మం తీసి అవయవాలకు రక్షగా పెడతారు. అలాిం అగ్ని స్వరూపానికి ప్రతిగా గోవును భావిస్తారు. అగ్ని ఎంత ఐశ్వర్యాన్నిస్తుందో గోవు కూడా అంతే ఇస్తుంది.

ప్రతిరోజూ హోమం చేసి, పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం అనుగ్రహాన్ని పొందటం చాలా క్లిష్టమైన పని .ఈ ఫలితాన్ని సులభంగా పొందే అవకాశం గోపూజ ద్వారా లభిస్తుంది. గోవు పృష్ట భాగంలో కాస్త పసుపూకుంకుమ వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే పరమప్రసన్నురాలవుతుంది.

ఎందుకంటే, లక్ష్మీదేవి నివసించే అయిదు స్థానాలను పెద్దలు నిర్ధారించారు. వాిలో
🔹
మొదిది ఏనుగు కుంభస్థలం.
🔹
రెండవది ఆవు వెనకతట్టు.
🔹
మూడవది తామరపువ్వు.
🔹
నాలుగవది బిల్వదళం వెనుకభాగంలో ఉండే ఈనెలు.
🔹
అయిదవది సువాసినీ పాపట ప్రారంభస్థానం. అందువల్ల ఆవు పృష్టపూజతో లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది.

దీనితో పాటుగా గోవును దానం చేయటం వల్ల విశేషమైన పుణ్యం వస్తుంది. ఉదాహరణకు, మనం ఒకరికి బట్టలు దానం చేస్తే, దానికి తగ్గ ఫలితమే దక్కుతుంది.

*కానీ ఒక గోవును దానం చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. దాతకు ఆ ఫలితం లభిస్తుంది.*

మరి గ్రహీతకో? అతని తపశ్శక్తి క్షీణించకుండా ఏకాసిని సహస్రం అనే మంత్రాన్ని దేవాలయంలో కూర్చుని పారాయణం చేయాలి.

గోసేవనం కూడా చాలా గొప్పది. అందుకే చాలామంది ఆవుకు కాస్తంత పచ్చగడ్డి పరకలు పట్టుకుని తినిపించి, ప్రదక్షిణం చేసి గంగడోలు దువ్వి, వెనకత్టి, పృష్టభాగంలో పసుపు కుంకుమ వేసి వెళ్ళిపోతారు. దీనివల్ల వచ్చే ఫలితం ఆపారం. పరమాత్ముడు ఆ గోవు శరీరానికి ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్కపెడతాడు.

*ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఈయన నూరు యజ్ఞాలు చేశారని లెక్కవేస్తాడు.*

ఇదే విధంగా గోవును హింసిస్తే వచ్చే ఫలితం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది.
ఒక పరమ సాత్వికమైన వ్యక్తిని ఇల్లు దాిపోయేవరకు కొడితే ఏ పాపం వస్తుందో నిష్కారణంగా ఆవు ఒంి మీద  చెయ్యిప్టిె కొడితే ఆ పాపం వస్తుంది. మన ప్రపంచంలోని 84లక్షల జీవరాసులలో మలమూత్రాలు సుగంధభరితాలైన ప్రాణి గోవొక్కటే. దాని మూత్రపురీషాలు సువాసనతో కూడుకుని ఉంాయి. ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవుమూత్రం, ఆవుపురీషం అంటే ఆవుపేడ ఈ అయిదింని కలిపి పుచ్చుకోవాన్ని పంచగవ్యప్రాశనం అంారు. దీనిని సమంత్రకంగా లోపలికి పుచ్చుకుంటే పెద్ద పెద్ద క్రతువులు చేసేటప్పుడు శరీరంలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఆయుర్వేదం వేదానికి ఉపాంగం కాబ్టి దీనిలో గోమూత్రంతో ప్రత్యేకంగా తయారుచేసే ఔషధికి గోమూత్ర శిలాజిత్‌ అని పేరు. దీనిని సేవించివారి శరీరానికి విపరీతమైన రోగనిరోధకశక్తి వస్తుంది. గోశాలలో ఉండే దర్భల్ని తెచ్చి హోమం చేస్తే దాని వల్ల అజేయులవుతారని నమ్ముతారు. అందుకే పూర్వం రాజులు ప్రత్యేకంగా గోశాలలు పెంచి, ఆ గోవులు తిరిగే ప్రాంతంలో, వాి మలమూత్రాలు ఉండేచోట గడ్డి పెంచేవారు. అవి ఎత్తుగా పెరిగి ఉండేటట్టుగా కాపాడేవారు. యుద్ధ సమయంలో గోశాలలో పెరిగిన దర్భగడ్డితో హోమం చేసేవారు. అందుకే కార్తికమాసంలో గోపాష్టమినాడు, ద్వాదశి తిథినాడు గోపూజ తప్పనిసరిగా చేయాలి.

🙏🏻🙏🏻🙏🏻
చదవండి చదివించండి మహాదేవ

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...