Wednesday, April 26, 2017

శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం* *(వేములవాడ)*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
దక్షిణ కాశీగా పిలువబడుతున్న  వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం  కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్నది.   భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. ఈ దేవాలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.

భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.  పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉన్నది. ;వేముల వాడ పూర్వ నామం లేంబుల వాటిక. కాలక్రమంలో లేంబుల వాడగా ఆ తర్వాత వేముల వాడగా రూపాంతరం చెందినది. ఈ ఆలయాన్ని చోళ రాజులలో ప్రముఖుడైన రాజ రాజ నరేంద్రుడు నిర్మించినట్లు చరిత్రకాదారులున్నాయి.
క్రీ.శ.750నుండి175సంవత్సరాలపాటు చాళుఖ్యులు, ఇస్వాకులు పాలించి నట్లు ఇక్కడ లభించిన చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది .ఆ రోజుల్లో ఈ ప్రాంతం శైవ, వైష్ణవ, జైన మతాలకు కేంద్రంగా వుండేదని తెలుస్తున్నది. అలాగే సంస్క్రుతం, కన్నడ భాషలు కూడా ఆదరణ పొందినవని శాసనాల వలన తెలుస్తున్నది. ప్రసిద్ధుడైన భీమ కవి ఇక్కడి భీమేశ్వరుని వర ప్రసాధమని నమ్మకం. విక్రమార్క విజయం అనే కన్నడ మహా కావ్యాన్ని రాసిన ప్రముఖ కన్నడ కవి పంప కవి ఆ మహా కావ్యాన్ని ఇక్క డే వ్రాశాడని చెబుతారు. తదుపరి కాలంలో ఈ ప్రాతం కాకతీయుల ఆదీనంలో, డిల్లీ సుల్తానుల ఆధీనంలో వున్నట్లు చరిత్రను బట్టి తెలుస్తున్నది. వేముల వాడలో వున్న మరో ప్రసిద్ధ ఆలయం భీమేశ్వరాలయం. ఆలయ ముఖ ద్వారం పై గజలక్ష్మి, సింహ ద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఆలయం చుట్టూ బాల రాజేశ్వర, విఠలేశ్వర, ఉమామహేశ్వర, త్రిపుర సుందరీ దేవి ఆలయాలున్నాయి. దగ్గర్లోనె నగరేశ్వర, వేణుగోపాలస్వామి, మొదలగు ఆలయాలున్నాయి. అలేగే జగన్మాత స్వరూపిణి అయిన బద్ది పోచమ్మ వారి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో మహమ్మదీయుల ధర్గా కూడా వుండడం విశేషం. దేవాలయం ప్రక్కనే వున్న ధర్మకుండం (పుష్కరిణి) చాల పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ధక్షయజ్ఞ సమయంలో వీరభద్రుని చేతిలో చేతులు కోల్పోయిన సూర్యుభగవానుడు, ఈ పుష్కరిణిలో స్నానం చేయగా చేతులు వచ్చాయని పురాణ గాథ. . ఆలయ ప్రత్యేకత: ఏ ఆలయంలోలేని ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామి వారికి మొక్కుకొని, పిల్లలు కలిగాక ఆ బాలునితో, ఒక కోడె దూడను తెచ్చి, ఆలయం చుట్టు తిప్పి ముందున్న స్థంబానికి కట్టి వెళతారు. దీన్నే కోడే మొక్కు అంటారు. కోడే దూడను తెచ్చుకోలేని దూర ప్రాంతం వారి సౌకర్యార్థం ప్రస్తుతం ఇక్కడ ఆ సమయానికి కోడే దూడలను అద్దెలకు ఇస్తారు. మహా శివ రాత్రి వంటి పర్వ దినాలల్లో కోడే మొక్కు చెల్లించుకొనే వారి సంఖ్య వేలలో వుండడాన్ని బట్టి చూస్తే ఈ ఆలయ ప్రాశస్త్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. అదే విధంగా స్వామివారికి బెల్లం సమర్పించడం కూడా ఇక్కడున్న మరో ఆచారం. మరెక్కడాలేని మరో ఆచారం కూడా ఇక్కడ మరొకటి ఉంది. అదేమంటే రోగాల బారిన పడిన లేక ఇతర కష్టాల బారిన పడిన స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక ఆది బిక్షువు అడుగు జాడల్లోనే జీవితాంతం బిక్షాటనె వృత్తిగా చేసుకొని, పార్వతిగా మహా శివునికే అంకితమై పోతారు. అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో వుంటారు.

🙏🏻🙏🏻🙏🏻

Post a Comment

అత్యంత మహిమాన్వితమైనది... బాసర క్షేత్రం

*వేదవ్యాస మహర్షి ప్రతిష్టించిన ఏకైక సరస్వతీ ఆలయం* 💫🌞🌎🌙🌟🚩 🕉ఓంశ్రీమాత్రేనమః 🕉 అద్వైత చైతన్య జాగృతి 💫🌞🌎🌙🌟🚩 అత్యంత మహిమాన్వి...