Wednesday, March 8, 2017

మహాస్వామి - పరమతసహనం

మహాస్వామి - పరమతసహనం

బర్మా నుండి ఒకప్పుడు కోటీశ్వరుడైన బౌద్ధ పండితుడు ఒకాయన స్వామి వారి దర్శనానికి వచ్చారు. ఆరోజు స్వామి వారు మౌనంలో ఉన్నారు. ఆ పండితుడు సాష్టాంగ నమస్కారం చేసారు. స్వామివారు కరుణాపూరితమైన దృక్కులతో చూస్తున్నారు. బౌద్ధుడు ఆనంద నృత్యం చేస్తున్నారు. అంత కాష్టమౌనంలో స్వామివారు ఒక చిరునవ్వు నవ్వారు. మరుసటి రోజు కారణం అడుగగా నవ్వుతూ స్వామి ఇలా చెప్పారు, "ఆది శంకరులు సూత్రా భాష్యములో బౌద్ధ మతాన్ని ఖండించారు, అది చదువుతూ ఉన్నాము. భాష్యపాఠం చెప్పేటప్పుడు అంతా మరిన్ని యుక్తులతో బౌద్ధాని ఖండిస్తూనే ఉన్నాము, అలాంటి మతానికి చెందిన ఈ పండితుడు నేనే (మహాస్వామి వారిని) బుద్ధ భగవానుని అవతారం అంటున్నాడు" అని.

ఒకప్పుడు కుంభకోణంలో మతకలహాల మూలంగా మహమ్మదీయులకు హైందవులకు గొడవలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఒక మహమ్మదీయ వృద్ధుడు స్వామివారిని దర్శించాలని వచ్చారు. మఠాధికారులకు స్వామివారి దర్శనానికి అనుమతించటం ఇష్టం లేదు. అయినా స్వామివారు ఏకాంత దర్శనమిచ్చారు. ఆ వృద్దుడు శ్రీవారిని (స్వామివారిని) **అల్లా** స్వరూపంగా ఆరాధిస్తూ శ్లోకాలు వ్రాసుకొని వచ్చి చదివి వినిపించారట. అలాగే క్రైస్తవ మతమునకు చెందిన అనేక పాశ్చాత్యులు స్వామి వారిని చూచి **క్రీస్తు** ప్రత్యక్షమైనట్టుగా ఉన్నారని వారి డైరీల్లో వ్రాసుకున్నారు. డాక్టర్ ఎస్.ఐ.తులాఎవ్ అనే రష్యన్ దేశీయుడు స్వామిని దర్శించి ఒక ప్రశ్న వేసారు **" ఒక మనిషికి ఏ మతము మీద నమ్మకములేదు. ఏ కర్మ కాండలు చెయ్యడు. దేవాలయానికో చర్చికో పోడు కాని ఎల్లప్పుడూ మంచినే తలస్తూ, మంచిని చెస్తూ ఉంటాడు. వానికి జీవితాంతమునందు ముక్తి లభిస్తుందా ??""** అని అడిగారు. దానికి స్వామివారు రెండుక్షణాల ధ్యానము తరువాత స్వామి "లభిస్తుంది" అని సమాధానం చెప్పారు. సరి !!

పైవారంతా ఇతర మతస్తులు మన మతములోనే అనేక సిద్ధాంతాలకు చెందినవారు ఉన్నారు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, శుద్దాద్వైతులు, శైవులు, శాక్తేయులు, గణాపత్యులు వీరంతా స్వామిని గురువుగా స్వీకరిస్తున్నారు. కారణం ఆలోచిస్తే స్వామికి అన్నీ మతాలు సమ్మతాలే. ఏ దారిలో ఉన్నవారిని ఆ దారిలోనే సాగిపొమ్మని ఆదేశిస్తారు. అన్ని మతాలు అద్వైతానికి దారులే. ఏ మతములోను ఏ కించిత్తు మంచి గుణమున్న స్వామివారు ఆసక్తితో ఆదరిస్తారు. స్వయంగా కఠోర నియమాలను పాటించే స్వామివారి మనస్సులో ఎంతో సమన్వయ భావన కలవారు. అందుకే వారు జగద్గురువులు.

--- చల్లా విశ్వనాథశాస్త్రి, 'శతవర్షశేఖరం' నుండి

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...