Saturday, February 4, 2017

తొలితెలుగు....

🏌🏌🏌🏌తెలుగు ప్రథమాలు

తెలుగు తొలిప్రొద్దు వెలుగులు లేక తెలుగు ప్రపంచంలో ప్రథమాలు

శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు

తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది

తొలి తెలుగు కవి - నన్నయ

తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం

తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము

తొలి తెలుగు ప్రబంధము - మనుచరిత్రము

తొలి తెలుగు నవల - రాజశేఖర చరిత్రము

తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క

తొలి తెలుగు వ్యాకరణము -
ఆంధ్రభాషాభూషణము

తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము

తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము

తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము

తొలి తెలుగు నాటకము - మంజరీ మధుకీయము

తొలి తెలుగు శృంగారకవయిత్రి -
ముద్దుపళని

తొలి తెలుగు కథానిక - దిద్దుబాటు

తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము

తొలి తెలుగు రామాయణము - రంగనాథ రామాయణము

తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము

తొలి తెలుగు జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన

తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము

తొలి తెలుగు ఉదాహరణకావ్యము -
బసవోదాహరణము

తొలి తెలుగు పత్రిక - సత్యదూత

తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము

తొలి తెలుగు సాంఘిక నాటకము -
నందకరాజ్యం

తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య

తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన

తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ

తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము

తొలి తెలుగు ధర్మశాస్త్రము -
విజ్ఙానేశ్వరీయము

తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంథము -
సకల నీతి సమ్మతము

తొలి తెలుగు వ్యావహారిక నాటకము -
కన్యాశుల్కం

తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి -
ఆంధ్రుల సాంఘిక చరిత్ర

తొలి తెలుగు ఖురాన్ చిలుకూరి నారాయణరావు

తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం
హితసూచని (1853) - స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856).

తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు -
ఐ.కొండలరావు 1938

తెలుగు ప్రముఖులు

ఢిల్లీ దర్బారు (ఫిరొజ్ షా తుగ్లక్) లో తొలి వజీరు (ప్రధానమంత్రి)-- మాలిక్ మక్బూల్ / యుగంధర్ లేక దాది (సాగి) గన్నమ నాయకుడు.

ప్రధాన మంత్రి అయిన తొలి తెలుగు వ్యక్తి--
పి.వి.నరసింహారావు

రాష్ట్రపతి అయిన తొలి తెలుగు వ్యక్తి--
వి.వి.గిరి

అంటార్కిటికా కు వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి--
దాట్ల రామదాసు

ఒలంపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి తెలుగు వ్యక్తి-- కరణం మల్లేశ్వరి.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...