Saturday, February 4, 2017

పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు

మన భారతదేశంలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు

ప్రపంచంలోనే భారతదేశంలో అనేక మిస్టీరియస్ సన్నివేశాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. భారతదేశంలో ప్రతీది ఒక మిస్టరీనే తలపిస్తుంది.
సంపన్నమైన పురాణగాధలు, అపార పరిమాణం, మరిచిపోలేని ఇతిహాసాలకు పుట్టినిల్లు భారతావని. కొన్ని చూసి తరించేవి అయితే.. మరికొన్ని ఆశ్చర్యం, భయం కలిగించేవి. మరికొన్ని సందేహాలతో సతమతపెట్టేవి చాలా ఉన్నాయి.

: హిందూ ఆలయాల వెనకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యం ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఇండియా చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా, ఎటు వెళ్లినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ.. మిస్టరీతో మిలితమై ఉన్నాయి. ఎవరికీ అంతుచిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాలు, కట్టడాల్లో దాగున్నాయి. ఏ పురావస్తు శాఖ ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. ఇండియాలో అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం కలిగించే దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మీలో అంతులేని ఆలోచనలు, ఆశ్చర్యాలు తీసుకొచ్చే కొన్ని పుణ్యక్షేత్రాల విశేషాలు, మిస్టరీలు మీకోసం..

పంజాబ్ లోని మోహాలి జిల్లాలో ఉంది .
...గురుద్వార. ....
1659లో సిక్కుల ఏడో గురువు గురు హర్ రాయ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గురుద్వారలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇక్కడున్న మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు ఏడాది పొడవునా.. మామిడి పండ్లు ఉంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా పండ్లు కాస్తూనే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న .......యాగంటి ఉమామహేశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్న పెద్ద నందీశ్వరుడి విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వస్తోందని భక్తులు నమ్ముతారు. మొదట్లో చాలా చిన్నగా ఉన్న విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు ఆలయం ప్రాంగణం అంతా వ్యాపించిందని స్థానికులు చెబుతారు. అయితే ఆ రాయి స్వభావం పెరిగే తత్వం కలిగి ఉందని.. ఆ రాయి 20 ఏళ్లకు 1 ఇంచు పరిమాణం పెరుగుతుందని పురావస్తు శాఖ సర్వే తెలియజేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించారు. విజయానగర్ స్టైల్లో ఈ రాతి కట్టడ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్తంభం కింద క్లాత్ ని ఈజీగా పట్టించవచ్చు. అంటే.. స్తంభానికి, కింద ఫ్లోర్ కి గ్యాప్ ఉంటుంది. అంటే స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండానే ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ కి తాకకుండా.. ఆలయాన్ని అంతా ఎలా సపోర్ట్ చేస్తుందో.. ఎవరికీ అర్థంకాని రహస్యం.

తంజావూర్ లోని శివాలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయమంతా గ్రానైట్ స్టోన్స్ తోనే కట్టారు. అది కూడా అక్కడ దగ్గరి ప్రాంతాల్లో ఎక్కడా స్టోన్ లభించేది కాదు. 216 అడుగుల అతి పెద్ద నిర్మాణం ఈ తంజావూర్ ఆలయం. ఆలయ సమీపంలో ఎలాంటి సదుపాయాలు లేవు. పెద్ద గాలి, వర్షాలతో ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అయినా కూడా వెయ్యి ఏళ్ల క్రితం ఈ ఆలయం ఇంత పెద్దగా.. ఎలాంటి మెటీరియల్ లేకుండా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ.

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివారాధన చేయడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం గమనించారు. తర్వాత ఆ పాము ఆలయంలో ఉన్న బిల్వ చెట్టు ఎక్కి బిల్వ పత్రాలు సేకరించి.. తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించింది.

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి అయిన ప్రాంతాలలో. .... పూరి .......నాలుగోది. ఛార్ ధామ్ క్షేత్రాలలో ఇదొకటి. విష్ణువునే ఇక్కడ జగన్నాథ స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయ విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రతిమ రాయి కాదు... వేప బెరడుతో తయారు చేస్తారు. ఈ విగ్రహాన్ని బ్రహ్మ అంటారు. ఈ విగ్రహాలను 12 ఏళ్లకొకసారి అంటే నబ కళేబర ఉత్సవ సమయంలో మారుస్తారు. అదే ఇక్కడున్న స్పెషాలిటీ.

మహారాష్ర్టలో ఉన్న శని షింగాపూర్ చాలా ఫేమస్.
ఎందుకంటే ఈ ఊళ్లో ఏ ఒక్క ఇంటికి తలుపులు ఉండవు. తలుపులు లేకపోయినా.. ఇంతవరకు ఎప్పుడూ దొంగతనాలు కూడా జరగలేదు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్లకు శని దేవుడే శిక్ష విధిస్తాడని గ్రామస్తుల నమ్మకం. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే.. 2011లో ఇక్కడ ఒక బ్యాంక్ కూడా ప్రారంభించారు. అది కూడా ఎలాంటి తాళం లేకుండా. దేశంలో మొదటిసారి ఇలాంటి విశేషం జరిగింది.

కైలాస ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది.
దీని నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎలాంటి కట్టడమైనా.. పునాది నుంచి మొదలవుతుంది. కానీ.. కొండలనే శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.
మహారాష్ర్టలోని షోలాపూర్ జిల్లా షేప్టాల్ గ్రామంలో పాముల పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేకంగా కొంత ప్రదేశం కల్పిస్తారు. ప్రతి ఇంట్లో మనుషులు మాదిరిగా... పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎవరినైనా పాము కరిచినట్లు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు

. ఉత్తరప్రదేశ్ లోని సితాపూర్ జిల్లాలోని.
.... ఖబీస్ బాబా ఆలయం ... చాలా విచిత్రం కలిగిస్తుంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.. పూజారీ ఉండరు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతారు. ప్రచండమైన శివ భక్తుడు ఖబీస్ బాబా ఇక్కడ ఉంటారు. ఇతను సాయంత్రం భక్తులు సమర్పించే మద్యం సేవించి.. భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం.

శ్రావణబెళగలలోని గోమతేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. దీన్నే బాహుబలి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకే రాతితో ఈ విగ్రహాన్ని చెక్కడం విశేషం. 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూడవచ్చు. గోమతేశ్వర జైనుల గురువు.

అమ్రోహా ఉత్తరప్రదేశ్ లోని ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం షార్ర్ఫుద్దీన్ షా విలాయత్ గా ప్రసిద్ది చెందింది. ఈ పుణ్యక్షేత్రం మతాధికారి ఆలయ రక్షణగా తేళ్లను పెట్టారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు వీటిని పట్టుకోవచ్చు. కానీ అవి వాళ్లకు ఎలాంటి హాని చేయవు. అదే ఇక్కడి స్పెషాలిటీ.

మమ్మీస్ ....
అంటే అందరికీ ఈజిఫ్టే గుర్తొస్తుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని గ్యూ అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాకిస్తోంది. సంఘా టెంజింగ్ అనే టిబిట్ కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ కూర్చొని ఉంది. అది కూడా చెక్కుచెదరని చర్మం, జుట్టుతో ఈ మమ్మీ కనిపిస్తుంది.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...