Saturday, January 21, 2017

బాసర దీక్ష. •••• జ్ఞానభిక్ష.

బాసర దీక్ష. ••••  జ్ఞానభిక్ష. !

      యాకుందేదు తుషార హర ధవళా యాశుభ
             వస్త్రాన్వితా
       యా వీణా వరదండా మండితకరా యాశ్వేత
              పద్మాసనా  ....

        ముగ్గురమ్మలలోనూ  చదువులమ్మ. స్థానం
  ప్రత్యేకమైనది , జ్ఞానం కరవైతే ఎంత సంపద ఉన్నా
వ్యర్థమే  , ఎన్ని శక్తియుక్తులున్నా నిరుపయోగమే
     అందుకే  ఆ అక్షర కటాక్షం  కోసమే  సరస్వతి
   క్షేత్రమైన బాసరలో మధుకర దీక్షను చేపడతారు  ,
   అష్టాదశ పురాణకర్త వ్యాసభగవానుడే  ఈ దీక్షకు
         అంకురార్పణ. చేశాడని  చెబుతారు   .....

         నంధి యుగంలో  •••
   మహాభారత యుద్ధం  ముగిసింది  , పాండవులు
గెలిచారు  , కౌరవ వంశ నిర్మూలన జరిగిపోయింది  ,
     యుద్ధంలో అపార ప్రాణనష్టం  సంభవించింది  .
      తానే నారు పెట్టి  , నీరుపోసి  పెంచి పెద్దచేసిన
కురువృక్షం  కుప్పకూలిపోవడంతో కృష్ణ. ద్వైపాయనుడు
తల్లడిల్లిపోయాడు  , అందులోనూ  , ద్వాపర ముగిసే
రోజు  దగ్గరపడింది  , కలిప్రభావం  మెల్లగా మొదలై
  పోయింది   ఆ. ఆలోచనల. మధ్య.  వన సంచారం 
     చేస్తూ  ....
    వ్యాసుడు  దండకారణ్య ప్రాంతానికొచ్చాడు  ,
ప్రయాణంలో అలసి సొలసి గోదావరి తీరాన సేద --
దీరాడు  , ఎందుకో  ఆ ప్రాంతాన్ని  వదిలి ముందుకు
వెళ్ళాలనిపించలేదు  , ఆ. ఆలోచన కూడా అమ్మవారి
  ప్రేరణే  అనుకున్నాడు   , చదవులతల్లి  స్వప్న. -
దర్శనమిచ్చి  ..   ఆ. ప్రాంతంలో  అవ్యక్తరూపిణిగా
ఉన్న తనను  వేదోక్తంగా  ప్రతిష్ఠించమని ఆదేశించింది  ,

  వాగ్దేవి ఆదేశాల ప్రకారం  వ్యాసుడు  కుమారచల
     పర్వత ప్రాంతంలోని  ఓ. గుహలో  నివాసం
ఏర్పాటుచేసుకున్నాడు  ,  నిత్యం  గోదావరిలో  స్నానం
        చేసి  సరస్వతీదేవిని  ఉపాసించేవాడు  .
     దగ్గరల్లోని  గ్రామాల్లో  భిక్ష. స్వీకరిస్తూ  ఆకలి
  తీర్చుకునేవాడు  ,  రోజూ  స్నానం  నుంచి వస్తూ  -
     వస్తూ  మూడు  పిడికిళ్ళ. ఇసుకను  తీసుకొచ్చి   .
         గుహలో  మూడు  రాశులుగా  పోసేవాడు   ,

  ఆ. రాశుల్లోంచి  సరస్వతి  , లక్ష్మి   , మహంకాళి   ,
     ముగ్గురమ్మలూ  ఉద్భవించారు  ఆ. మూర్తలను
కుమారచల. పర్వతం  కింది  ప్రాంతంలో  ప్రతిష్ఠించాడు
    అదే  వ్యాసపురిగా  మారింది   ,  కాలక్రమంలో 
           బాసర గా ప్రసిద్ధి చెందినది

(పోకూరి సాయికిరణ్ సౌజన్యంతో)

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...