Friday, September 22, 2017

కంచ తంత్రం

***కంచతంత్రం***
********************?

విష్ణుశర్మ తన శిష్యులతో నిన్నటితో "పంచతంత్రం" అయిపోయింది.

ఇప్పుడు "కంచతంత్రం" చెపుతాను శ్రద్దగావినండి అని మొదలుపెట్టారు.

"పూర్వం పచ్చగా ప్రశాంతగా ఉన్న అడవిలోకి ఎక్కడనుండో ఓ వయసు మళ్లిన "కంచరగాడిద" ప్రవేశించింది. ఆ అడవి పచ్చగా ఉండటం దానికి కడుపుమంట అయ్యింది. పైగా అన్ని జీవులు ఆ అడవిలో వాటి మానాన్న అవి ప్రశాంతం గా జీవిస్తున్నాయి.

అక్కడ పచ్చగడ్డి మేస్తున్న అరేబియన్ గుర్రాల గుంపొకటి కనిపించింది. వాటి దగ్గరకి వెళ్లి నేనూ మీలాగే ఉన్నాను మీతో కలుపుకోండి అంది.దాని ప్రవర్తన నచ్చక ఆ అరేబియన్ గుర్రాలు హేళనగా!....

మా స్త్రీలని ఏ అడ్డగాడిదో చెడగొట్టటం వలన పుట్టిన "సంకరజాతి జీవి నువ్వు". నీతో మాకుపొంతనేల? వెళ్లగొట్టేసాయి.

దానితో ఆ కంచరగాడిద అహం దెబ్బతింది. ఈ అడవిని ఎలాగైనా నాశనం చెయ్యాలనుకొంది. వివిద జీవుల మీద దాని అక్కస్సు ని వెళ్లగ్రక్కేది.

"సింహాన్ని” చూసి "నీవో నియంతవు" పైగా బద్దకిష్టివి. మేము చూడు గాడిద లా అడ్డమైనా చాకిరీ చేస్తున్నాము. నువ్వు మాత్రం ఎప్పుడు అలా పడుకొనే ఉంటావు అని సింహం మీద దాని అక్రోశం వెళ్లగక్కింది. దాని మాటలు పట్టించుకోకుండా "సింహం నవ్వింది".

అంతవాగినా సింహం తన మాటలు పట్టించుకోపోవటం దాని అహం ని మరింత దెబ్బతీసింది. తన వాగుడు అడవిలో అందరికీ చేరకపోవటం వలన తనని ఎవరూ పట్టించుకోవటం లేదని భావించింది.

ఇంతలో దానికి ఓ కూసే గాడిద దోస్తయ్యింది. దాని గార్ధబస్వరం తో కంచరగాడిద గురించి ఎలుగెత్తి అరవటం మొదలు పెట్టింది.

ఆ ఇద్దరూ కలిసి మరికొన్ని మేసే గాడిదలని పోగేసుకొని రోజూ ఉదయాన్నే ఆ అడవిలో ప్రతీ జంతువు మీద ఎలుగెత్తి చర్చలు చేసేవి.

ఆ కంచరగాడిద అటుగా వచ్చిన ఓ నక్క ని చూసి," అచ్చు నువ్వు పులిలా ఉన్నావు. దానికి చారలు ఉంటాయి నీకు లేవు. మిగతాదంతా Same to Same అని పొగిడి దానిని మచ్చిక చేసుకొంది.

నక్క మరి నాకు చారలు ఎలా వస్తాయి అని అడిగితే, పులి చారలు లా వాతలు పెట్టుకొ అప్పుడు అచ్చు నువ్వు పులిలా ఉంటావు. ఈ అడవిలో జంతువులు అప్పుడు నిన్ను చూసి భయపడతాయి అని ఓ బోడి సలహా పారేసింది. "అలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకొంది".

దాంతో దాని ఒళ్లంతా బొబ్బలెక్కాయి గాని అది పులి అంటే ఏ జంతువూ నమ్మలేదు పైగా దాని వాటం చూసి నవ్వుకొన్నాయి.

“వీడెవడే బక్కచిక్కిన పులి లా ఉన్నాడు అని”. నిన్ను నమ్మి మోసపోయాను
నన్ను చూసి అందరూ నవ్వుతున్నారని నక్క వాపోయింది.

తన తప్పుని కప్పి పుచ్చుకోటానికి ఆ కంచరగాడిద " నవ్వరూ! నువ్వు చూడు బక్కచిక్కి ఎలా ఉన్నావో. దీనికి కారణం ఆ ఏనుగే. అటు చూడి అది నీ తిండి అంతా తినేస్తూ ఎంత లావైపోయిందో అని అక్కడ ఆకులు అలమలు తింటున్న ఓ ఏనుగుని చూపించి ఏనుగు మీద దానికున్న ఆక్రోశాన్ని వెళ్లగ్రక్కింది. అదినమ్మి ఆ నక్క ఏనుగు తో తగువుకి సిద్దపడింది.

కథ వింటున్న ఓ శిష్యుడు "గురూజీ! ఏనుగు శాకాహారి, నక్క మాంసాహారి కదా. మరి ఏనుగు నక్క ఆహారాన్ని తినటం ఏంటి? తర్కం కుదరటం లేదు". అన్నారు. దానికి విష్నుశర్మ. శభాష్! శిష్యా! మంచి ప్రశ్న వేశావు.

"విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు విచక్షణా జ్ఞానన్ని కోల్పోతారు ఎవరైనా".
ఈ నక్క అంతే.

తనకి తాను తెలివైన దానిని అనుకొనే నక్క కూడా ఆ కంచరగాడిద గాండ్రింపుకి విచక్షణ కోల్పోయి ఆ ఏనుగు తన ఆహారాన్ని తినేస్తోంది అందుకే తాను ఇలా బక్క చిక్కిపోయాను తలచి ఆ ఏనుగు మీద గైయ్ మంది.

అదేమీ పట్టించుకోని ఆ ఏనుగు ఆ నక్కని తొండతో చూటి అవతలకి విసిరిపారేసింది. కంచరగాడిద పరుగు లంగిచుకొంది.

కంచరగాడిద కల్లబొల్లి కబుర్లు నమ్మి ఆ అడవిలో కొన్ని గాడిదలు, ఓ గొర్రెల గుంపు ఆ కంచరగాడిద ని అనుసరించటం మొదలు పెట్టాయి.

కంచరగాడిద వలన మోసపోయిన గుంట నక్క కూడా ఆ గుంపులోనే తిరిగేది. ఆకలేసినప్పుడు ఒక్కో గొర్రెని తినేసేది. అది గమనించిన కంచరగాడిద నువ్వు గొర్రెని తింటే ఏం కడుపునిండుతుంది.

ఆవులని తిను అని ఓ బోడి సలహా పారేసింది. ఆ నక్క కి తన సమర్ధ్యం (capacity) తెలీక అక్కడ ఉన్న ఓ ఆవుల గుంపు మీద పడింది. అంతే అక్కడున్న ఆవులన్ని తమ కొమ్ములతో ఆ నక్కని క్రుళ్లబొడిచేసాయి.

ఇంత లొల్లి చేసినా తనని ఎవరూ పట్టించుకోవటం తో ఆ కంచరగాడిద అహం మరింత దెబ్బతింది. తన దగ్గర ఉన్న కూసేగాడిదలతో " ఇక్కడ ఉన్న జంతువులు నన్ను చంపుతామని బయపిస్తున్నాయి అని మరో క్రొత్త భయాన్ని ప్రకటించింది.

అది విన్న జంతువులు " నికా భయం లేదు. బుద్ది ఉన్న జీవులెవరూ నీలంటి నీతి జాతి లేని నీలాటి వయసు మళ్లిన కంచరగాడిదలని చంపవు" అని
నవ్వుతూ భరొసా ఇచ్చేసాయి.

ఆ కంచరగాడిద వచ్చాక ప్రశాంతం గా ఉన్న అడవి లో ఉన్న ప్రతీ జీవి మీద దాని అక్కసు గోల పడలేక అన్ని జంతువులు ఏకమైనాయి.

తమ ఐకమత్యాన్ని భంగపరుస్తున్న ఆ కంచరగాడిద మీద ఏమైనా చర్య తీసుకోవాలి అనుకొన్నాయి. సింహం మరలా నవ్వింది. "ఎవరూ ఆ కంచరగాడిదని పట్టించుకోకండి.

అలా.వాగి వాగి దాని నోరేపడిపోతుంది. అలా ఏజంతువూ దాని గోల పట్టించుకోపోవటం తో కొన్ని రోజులకి ఆ కంచరగాడిద పిచ్చిదైపోయి అరచుకొంటూ తిరుతా ఉంది ఆ అడవిలో.

దానిని పట్టించుకొనే నాధుడే లేకపోయాదు చివరికి. ఆ విధం గా ఆ అడవిలో జంతువుల్లన్నీ ఓ కుటుంబం లా ఉండటం వలన ఆ కంచరగాడిద "కంచతంత్రం" పారలేదు.

గమనిక: ఇది ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. మీకెవరైనా ఎవరోఅనిపిస్తే నానేటి చేస్తాను. మీ ఉహాశక్తికి జోహార్లు అని చెప్పటం తప్ప.

1 comment:

అన్యగామి said...

మీ క్రొత్త కంచతంత్రం కాస్త బావుంది. జార్జ్ ఆర్వెల్ వ్రాసిన అనిమల్ ఫార్మ్ని గుర్తుకు తెచ్చింది.

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...