Sunday, May 14, 2017

జపమాల ఎలా ఉపయోగించాలి ?

జపమాల ఎలా ఉపయోగించాలి ?

జపమాలలో 108 పూసలు ఉంటాయి. మాల రెండు కొసలు కలిపే పూసను
‘సుమేరుపూస’ అంటారు. జపము చేయునప్పుడు జపమాల కనిపించకుండా
వస్త్రాన్ని కప్పి చేయాలి. కానీ, ఆ వస్త్రం తడిగా ఉండకూడదు. జపమాలను
అనామిక వ్రేలు (ఉంగరపు వ్రేలు) పైనుంచి బొటనవ్రేలుతో పూసలను .
చూపుడువ్రేలును ఉనయోగించరాదు. సుమేరుపూసను దాటి ముందుకు పోరాదు. సుమేరేపూస
దాకా వచ్చిన తర్వాత మాలను వెనుకకు త్రిప్పి జపము చేయవలెను. ఒకవేళ
జపమాల చేతినుంచి జారి క్రిందపడినచో, ఆ జపసంఖ్య లెక్క లోనికి రాదు.
మరల జపమాల మెదటి నుంచి జపము చెయ్యాలి. జపమాల కాలికి
తగిలిన ఎడల, దానిని నీటితో కడిగి రెట్టింపు సంఖ్యలో జపం చెయ్యాలి.
జపము చేయునప్పుడు మాట్లాడుట కానీ, కదులుట కానీ చేయరాదు. ఒకవేళ
తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, క్షమాభావనతో
భగవంతుని స్మరించి తిరిగి జపం ప్రారంభించాలి. గృహమునందు జపము చేసిన
దానికన్న గోశాలయందు వందరెట్లు, వనములందు లేదా తీర్థస్థానములందు
వేయిరెట్లు, పర్వతములమీద పదివేలరెట్లు, నదీతీరములందు లక్షరెట్లు,
దేవాలయములందు కోటిరెట్టు, శివలింగము దగ్గర అనంతమైన పుణ్యఫలము
లభించునని శాస్త్ర ప్రమాణము
*మీ*
*శశికాంత్ శర్మ దహగం*

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...