Wednesday, May 3, 2017

ఎవరు ముందు చెప్పినట్లు

🍃 _*ఎవరు ముందు చెప్పినట్లు..❓🤔*_

```స్ర్తీయొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా!
          మరి ఈదేశంలో ఎప్పటినుంచో గర్భవతులు భక్తిగాథలూ వీరగాథలూ వినాలనీ చదవాలనీ ఎల్లపుడూ అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలనీ స్మరించుకోవాలనీ..భయంకర వార్తలూ విషాదసంఘటనలకూ దూరంగా ఉండలనీ ఈ ఫ్రాయిడ్ చెప్పకముందునుండే ఎలా చెప్పేవారబ్బా?

బిగ్ బ్యాంగ్ థీరి ఒక అగ్నిగోళం బ్రద్ధలయి స్రుష్ఠి ఏర్పడిందని తేల్చింది కదా!
మరి మన దేశంలో అనామకుడు సైతం" బ్రహ్మాండం బద్దలయ్యిందనే "వేదజనిత స్రుష్ఠి మూలం పలుకుతున్నాడెలా??

భూమి మీద ప్రక్రుతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్ఠులు చెబుతున్నారు కదా!
       మరి మన పురాణాలు చెప్పే కాలమాణం ప్రకారం యుగాలు మహాయుగాలూ మన్వంతరాలూ సంధికాలం లను లెక్కేస్తే...మనం శ్వేతవరాహ కల్పంలో 28 వ మహాయుగంలో కలియుగంలో ఉన్నామని ప్రస్తుత సంవత్సరం ...అంటే 2017 నాటికి 197,29,49,119 సంవత్సరాలు అవుతోంది...మరి సైంటిస్టుల కాలగణనతో సరిపోతోందెలా??

బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది తిరిగి మల్లీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముఖులిత సూత్రం కదా!
       మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పకం అంతమందు సకల ప్రాణులూ తనయందు లీనమవుతాయని మళ్ళీ కల్పకం ఆరంభంలో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు ఉందెలా??

ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా!
    మరి వేల సంవత్సరాలనుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతం చెప్పేది ఏంటి?? ఎవరు ముందు చెప్పినట్లు?

తొలివిమాన నిర్మాణం చేసిన మేధావులు రైట్ సోదరులు కదా!
      అంతకుముందునండే భారతీయులకు ఉన్న విమానశాస్ర్తాన్ని కూడా కాస్త పక్కనపెడదాం..రైట్ సోదరుల కంటే ముందు శివరాం బాపూజీ తళ్పాడే అనే పండితుడు మన పురాతన గ్రంధాల ఆధారంగా తయారుచేసిన "మరుత్సబి"గాలిలో ఎగిరింది కదా..మధ్యలో ఆగిపోయిన ఆవిమాన ప్లాన్ ని ఈయన వారసులు ఓ ఆంగ్లేయ కంపెనికీ అమ్మినట్లు తెలుస్తోంది...మరి అది ఏమైనట్లో...ఆ ప్రస్తావనే తేదెందుకు ఈ ప్రపంచం...

మొక్కలకు ఫీలింగ్స్ ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా!
   మరి ముందు ఈ విషయం మనవారికి తెలియదా?మన గ్రంధాలలో వృక్షాల భావాల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే...మన ఋషులు మొక్కలను ప్రార్థించే దర్బలను సేకరించేవారు(భాధ పెడుతున్నందుకు క్షమించమని)..మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా...

పెద్దపెద్ద వృక్షాలయే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీలలో చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞానశాస్ర్తం కదా!
     మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్నే తెలిపాడెలా??

సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటాం కదా!
      మరి మన పురాణాలకాలం వారికి ఈ "బడభాగ్ని"గురించి ఎలా తెలిసిందబ్బా...

లోహవిజ్ఞానంలో నేటిమనం చాలా అడ్వాన్స్ గా ఉన్నమని చెబుతాం కదా!
      మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనుప స్తభం ఇప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంటే దానికి పోటిగా ఆధునికులు నిర్మించిన ఇనుప స్తభం తుప్పపట్టి కనిపిస్తుందెలా??

నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నాం అని చెప్పుకుంటాం కదా!
       మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే గత 500సం లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ.....వీటన్నిటికీ ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానమేంటి??

అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!
      మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం"అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని రాశిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరువచ్చినట్లు తెలుస్తోంది....ఎవరు ముందు చెప్పినట్లు??

మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా!
        మరి వీటి గురించి తెలీకుండానే మన పూర్వీకులు ఈపని ఎలా చేశారు...ఈ పని చేసేవారిని "రసవాదులు"అనికూడా పేరెట్టి పిలిచారే.....

సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞానం కదా!
     మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః"అని చెప్పారనుకుందామా??

భూమినుండి విడివడిన కొంతభాగమే చంద్రుడనీ ఆ భాగం విడివడిన చోటు పసిఫిక్ మహా సముద్రం ఏర్పడిందనీ శాస్ర్తవేత్తల పరిశీలన కదా!
       విజ్ఞానాన్ని కథలుగా చెప్పే సంస్కృతి గల మన దేశ పూర్వులు చెప్పిన సాగరమధనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి?పాల సముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్లు చెప్పారే...

ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు పూర్వం వాడైన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయ్యాడు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే(ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం)
ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా.....

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది...రాతి యగంలో వేదాలు రాశిన వారికి అంత జ్ఞానం ఉండదని విదేశీయులు నేర్పిన చిలకపలుకులు నేటికీ వల్లే వేసే బానిస మనస్కులు తెలుసుకోవలసిందీ ఒకటుంది...రాతియుగం పరాయి పాలన...అంతకుముందంతా రత్నయుగమేనని...

ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం చిరునవ్వు నవ్వాం,
ఆటలాడి పాటలు పాడాం..```

*ఇప్పుడు చెప్పండి.. ఎవరు చెప్పినట్లు ముందు ఈలోకానికి లౌక్యం..?*
  
    తల్లీ భారతి నీకు శతకోటి వందనాలమ్మ నీకడుపున పుట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు...👏👏👏

       🍃✌🌺🦅

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...