Tuesday, April 25, 2017

బ్రాహ్మణులు సోమరులా?

బ్రాహ్మణులు పని చేతకాని వారనీ, శ్రమ చేయకుండా బతికేస్తారని... లెఫ్టిస్టులు, దొంగ అభ్యుదయవాదులు ప్రచారం చేస్తుంటారు... కాని...
బ్రాహ్మణులు అందరూ మంత్రాలు చదువుతూ పౌరోహిత్యం చేసుకుంటూ ఎప్పుడూ కూర్చోలేదు!
బ్రాహ్మణులు ఉత్తరాదిలో చాలా రాజ్యాల్ని పరిపాలించారు. అంటే రాజులుగా కూడా ఉన్నారు ...
బ్రాహ్మణులు దాదాపూ ప్రతీ రాజుకి,బాధ్యతగల మంత్రులుగా వుండేవారు! మంత్రులుగా వుండటం అంటే శ్రమ చేయకుండా బతకటం కాదు. అదే నిజమైతే ఈనాటి ఐఏఎస్ లు, ఐసీఎస్ లు కూడా పని చేయటం లేదనే అర్థం!
బ్రాహ్మణులు చాలా ఊళ్లలో లెక్కలు చూడటం, పత్రాలు రాయటం లాంటి క్లరికల్ వర్క్ చేసేవారు. వీళ్లని ఉత్తరాదిలో కాయస్థులని అంటారని విన్నాను. మన దగ్గర కర్ణీకం అంటారనుకుంటా...
బ్రాహ్మణులు వేద కాలం నుంచి గురుకులాల్లో పాఠాలు చెప్పేవారు. అంటే ఇప్పటి భాషలో *టీచర్స్* అన్నమాట!
బ్రాహ్మణులు ఆర్యభట్ట, సుశ్రుతుడు, చాణక్యుడు, వాత్స్యాయనుడు లాంటి వారు కూడా! వీళ్లంతా రకరకాల విజ్ఞానాల్లో ఆరితేరిన వారు. అంటే *సైంటిస్టులు*, *ఎక్స్ పర్ట్స్* అన్నమాట!
పోతన లాంటి బ్రాహ్మణులు *వ్యవసాయం* కూడా చేశారు. సంఖ్య తక్కువై వుండొచ్చు.
ఆయుర్వేదం, యోగా, పంచాంగ శాస్త్రం, భారతదేశ భౌగోళిక స్వరూపం తెలిపే పురాణాల్లోని విజ్ఞానం... ఇదంతా కూడా ప్రధానంగా బ్రాహ్మణులే కాపాడుతూ వచ్చారు వేల సంవత్సరాలుగా!
సంగీతం, సాహిత్యం, వివిధ గ్రంథాలు , వాటి ద్వారా ఇవాళ్ల మనం తెలుసుకుంటున్న చరిత్ర, చారిత్రక ఆధారాలు కూడా అత్యధిక శాతం బ్రాహ్మణులు పరంపరగా కాపాడినవే.
కేరళలోని కలరిపయట్టు లాంటి అద్భుతమైన వ్యాయామ, యుద్ధ కళ కూడా బ్రాహ్మణులు 'శ్రమ' చేసి మాత్రమే భద్రంగా కాపాడారు!
భారతంలో కనిపించే *ద్రోణాచార్యుడు* మొదలు సుభాష్ చంద్రబోస్, బాలా గంగధర్ తిలక్ లాంటి స్వాతంత్ర్ర్య సమరయోధుల వరకూ చాలా మంది బ్రాహ్మణులు ఈ రణరంగంలో కూడా రక్తానికి భయపడకుండా ఎదురు నిల్చారు!
చివరకు.... ఈనాటి ఆధునిక భారతదేశంలో కూడా ఇస్రో నుంచి ఆర్మీ,నేవీ, ఎయిర్ ఫోర్స్ దాకా బ్రాహ్మణులు అన్ని రంగాల్లో శ్రమ చేసే బతుకుతున్నారు! అఖరుకి, కొందరు గతిలేక పబ్లిక్ టాయిలెట్స్ వద్ద దుర్వాసన పీల్చుకుంటూ కూర్చునేది కూడా జంధ్యం ధరించిన శ్రమ చేసే బ్రాహ్మణుడే!
అగ్రకులంలో పుట్టిన కారణంగా ఎంతో ప్రావీణ్యం ,ప్రతిభా పాటవాలున్నా రిజర్వేషన్ల కారణంగా కుమిలి కుమిలి చనిపోయిన నిర్భాగ్యులెందరో కూడా ఉన్నారు.
వీళ్లంతా పోనూ... వేదంపై ఆధారపడి మంత్రాలు చదవుతూ శ్రమ లేకుండా ( అని సో కాల్డ్ లెఫ్ట్ మేధావులు, దొంగ అభ్యుదయవాదులు చెప్పుకుని తిరిగే.. ) పురోహితం చేసే బ్రాహ్మణులు ఎప్పుడైనా ఒక్క శాతానికి మించరేమో! వాళ్లని కూడా ప్రభుత్వాలు ఆదుకున్న పాపాన పోలేదు! తమకు పూజలు అవసరం అయినప్పుడు పరుగెత్తుకుని వాళ్ల వద్దకు పోయే సామాన్య హిందువులు కూడా ( డబ్బున్న బ్రాహ్మణులతో కలిపి ) మిగతా సమయాల్లో వాళ్ల గతని పట్టించుకోలేదు!
కాని... నానా తంటాలు పడి బతుకుతోన్న పేద బ్రాహ్మణుల్ని శ్రమ తెలియని వారు అని ఓ కామెంట్! దీన్నేమనాలి?
ఈ మధ్య కొందరు మనుధర్మ వ్యతిరేకులు ,మూర్ఖపు హేతువాదభావజాలమున్న కొన్ని సంఘాలవాళ్ళు పనిగట్టుకొని అంతా బ్రాహ్మణ వాదాన్ని తిడుతున్నారు అంటేనే అర్ధం చేస్కొండి వాళ్ళ మీద ఈ కమ్మిగాల్లకి ఇతర మతాలవారికి ఎంత కక్ష వాళ్ళ మీద ఉందొ ....వీళ్ళే కదా హైందవ జాతిని,సంస్కృతీ సాంప్రదాయాలను ముందు ఉండి నడిపించింది ...కచ్చితంగా వాళ్ళే అని చెప్పవచ్చు ...తిండి లేక అడుక్కుoటూ కూడా తమకి బిక్ష వేసిన వారిని మనసారా దీవించి పంపుతారు ....ఒకరి పాప కర్మలని దానం రూపం గా వాళ్ళు మోస్తారు/భరిస్తారు ....బ్రాహ్మణులను తిట్టేవాడి చేత, ఆ దానాలు తీస్కోమనండి చూద్దాం! దాని ఫలితం ఎలా ఉంటుందో? .....దేవుని దగ్గర ఉండి తన కోసం కాకుండా భక్తుల కోర్కెలు తీర్చమని దేవుణ్ణి వేడుకునే వాడు అలా చెయ్యడంవల్ల తనకి లభించే ఫలితాన్ని కూడా సమాజ శ్రేయస్సు కోసం వదులుకున్నవాడు బ్రాహ్మణుడు ...వాళ్ళు చేసే యజ్ఞాలు యాగాలు , క్రతువులు కేవలం తమ కడుపునింపు కొవడం మాత్రమె కాదు, ఆ ద్రవ్యాల మీద ఆదారపడి బ్రతికే మనుషులకి/వ్యాపారులకు చివరకి దేవతలకి కూడా ఆదారం అయిన వాడు బ్రాహ్మణుడు ...హైందవ జాతి ఇంకా దృడంగా నిలబడాలి అని ఆశిస్తే సద్ బ్రహ్మనులని కాపాడండి. వాళ్ళ సంతతి వృద్ది చెందే విదంగా చుడండి,వేద పాటసాలలకి సహాయం చెయ్యండి ... సనాతన హైదవ జాతి పునాదులు ఎవ్వరూ కదపలేరు ...ఇది వేదం చెప్పిన మాట , మన చెరిత్ర ఆదారాలతో సహా నిరూపించిన సత్యం...అందుకే బ్రాహ్మణ వాదం అంతరించిపోవాలి అని సనాతన జాతి రాక్షసాంస వెతిరేకులు జీవితాంతం పోరాడుతూ ఉంటారు.
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత వంటి వేద మరియు పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.

1 comment:

అన్యగామి said...

తమకు పూజలు అవసరం అయినప్పుడు పరుగెత్తుకుని వాళ్ల వద్దకు పోయే సామాన్య హిందువులు కూడా (డబ్బున్న బ్రాహ్మణులతో కలిపి) మిగతా సమయాల్లో వాళ్ల గతని పట్టించుకోలేదు!

కటువుగా ఉన్నా నిజం చెప్పారు.

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...