Sunday, March 5, 2017

వారాహి దేవి

తాళపత్రనిధి:
వారాహి దేవి
ఈ అమ్మవారు శాక్తేయం లో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.

శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు . ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమతమ ఆయుధాలను యిచ్చినవి . శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించెనని శక్తి పురాణం లో ఉంది.

దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట . దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ ( మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు . వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది . ఈమెను కైవల్యరూపిణి , వైవస్వతి అని కూడా అంటారు . ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .

వారాహి దేవి వరాహ ముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది .లలితాసహశ్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది .వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా , తాంత్రిక పూజ జరగపడం సర్వసాధారణం . ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .

వారాహి దీవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...