Monday, February 20, 2017

శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి

🙏శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి🙏 దివ్యక్షేత్రము.... కాళేశ్వరం
కాళేశ్వరం, కరీంనగర్ జిల్లా, మహాదేవపూర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన శివాలయం ఉంది. త్రిలింగమనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన. కాళేశ్యర క్షేత్రము శివుడి ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడ సరస్వతి దేవి ఆలయం కూడ ఉన్నది. ఇక్కడి శివాళయం ప్రత్యేకత నాలుగు ద్యారల మద్య నాలుగు ముకాల శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో యమకోణం ఉన్నది, భక్తులు ఆ యమకోణం నుండి వెల్లినట్లయితే తమకున్నటువంటి యమగండాలు తొలగి పొతాయని నమ్ముతారు. ఈ ఆలయం గోదావరి నదీ ఒడ్డున ఉండటం వలన పుణ్యస్నానానికి ప్రజలు ఎక్కువ సంక్యలో వచ్చి స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకొని వెలతారు.
ఇక్కడికి వెళ్లుటకు ఆర్.టి.సి. బస్సు సౌకర్యము మంథని నుండి కలదు. రైలు సదుపాయం పెద్దపల్లి లేదా రామగుండం లొ దిగి మల్లి బస్సు ద్వారా వెల్లాలి.
ప్రస్తుతం ఈ నది మీద వంతెన నిర్మాణం జరుగుతున్నది. ఈ వంతెన పూర్తి అయినట్లయితే మహారాష్ర్ట కి రోడ్డు మార్గం చాలా దగ్గరవుతుంది. అలాగే రామగుండం, మంచిర్యాల నుండి విశాఖపట్టణం వెళ్లుటకు రోడ్డు మార్గం దాదాపు 400 కి.మీ. తగ్గుతుంది.
కాళేశ్వర మహాక్షేత్రం లో గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహిని గా సరస్వతీ నది ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశం లో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. కాశీలో మరణిస్తే కైలాసప్రాప్రి కలుగుతుందని చెపుతారు. కాని ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శిస్తేనే కైలాస ప్రాప్తి కలుగుతుందని స్థలపురాణం చెపుతోంది.
ఇది అత్యంత పురాతన మైన పుణ్య స్థలం గా ప్రసిధ్ధి కెక్కింది. దేశంలో ఎక్కడా లేని విథంగా ఈ ఆలయం లో ఒకే పానమట్టం పై రెండు శివలింగాలను మనం దర్శించవచ్చు. ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణ మైన మూడు లింగాలలో ఇది ఒకటి. మిగినవి రెండు ద్రాక్షారామ భీమేశ్వరుడు, శ్ర్రీశైల మల్లిఖార్జుడు. ఈ మూడులింగాల మథ్య నున్న ప్రదేశాన్ని త్రిలింగదేశమని, ఇందు నివసించే వారిని తెలుంగులు అని వ్యవహరించబడతున్నారని కాకతి ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసుడగు విద్యానాథుని శాసనాన్నిఉటంకిస్తూ, పండితులు వ్రాశారు.
" యద్దేశస్త్రిభిరేష యాతి మహతాం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా!
శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామ నివాసిన: ప్రతిదినం త్వచ్ఛ్రేయసే జాగ్రతు !! "
* స్థలపురాణం
ఒక పర్యాయము యమధర్మరాజు తన లోకమునకు పాపులెవ్వరు రాకపోవుట, యమభటులందరు పనిలేక కూర్చుండుటను చూచి కోపించి, కారణమేమని ప్రశ్నించాడు. “ ఓ యమధర్మరాజా ! భూలోకమందు జనులందరు కాళేశ్వరమునకు వెళ్లి, త్రివేణీ సంగమం లో స్నానమాచరించి, ముక్తీశ్వరుని దర్శించి ముక్తులగుచున్నారు. అందుచే పాపాత్ములే లేని కారణం చేత మాకు పని లేకుండా పోయినదని విన్నవించారు” యమభటులు. అదే సమయంలో అక్కడకొచ్చిన నారదునితో ఈ విషయాన్ని ప్రస్తావించాడు యమధర్మరాజు. ఆ మాటలు విన్న నారదమహర్షి” ఆ ముక్తీశ్వరుడే నీకు మార్గం చూపగలడు” అని చెప్పి వెళ్లి పోయాడు.
తన ఆధిపత్యానికి భంగమేర్పడుతోందని భయపడిన యముడు, బ్రహ్మ లోకానికి వెళ్లి,విషయాన్నివివరించి, ఆయనతో కలసి కైలాసానికి వెళ్లి శంకరుని తో తన గోడు వెళ్ల బోసుకున్నాడు. మందస్మిత వదనుడైన మహాదేవుడు” ఓ యమధర్మరాజా. నీవు దేవతలతో కూడి వెళ్లి, కాళేశ్వరములోని నే నున్న పానమట్టము నందే నీ స్వహస్తాలతో కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చెయ్యి. నీ చే ప్రతిష్ఠించబడిన కాళేశ్వర లింగము సర్వజనులను మోహపరవశులను చేయును. అంతే కాకుండా –
" కాళేశ్వరం తిరస్కృత్య మమపూజాం కరోతి య: !
తే సర్వే నరకం యాంతి సందేహోనాస్తి నిశ్చయం !! "
శివలింగాలన్నీ ఒకటే కదా యని మాయామోహగ్రస్తులైన ప్రజలు ముందుగా కాళేశ్వరుని పూజింపక, ముక్తీశ్వరుని పూజింతురో వారందరు నీ లోకమునకు వచ్చెదరని” వరమిచ్చెను. అందువలన ఈ క్షేత్రములో ఒకే పానమట్టము మీద రెండు లింగములు దర్శవమిచ్చు చున్నవి.ముందుగా కాళేశ్వరుని పూజించి, ఆ తరువాత ముక్తీశ్వరుని పూజించవలయును. లింగము పైభాగములో రెండు రంధ్రములతో నున్నలింగము ముక్తీశ్వరుడు గా మనము ఎఱుక కలిగి ఉండాలి.
ఒకపర్యాయము యమధర్మరాజు కార్యార్ధియై స్వర్గలోకానికి వెళ్లాడు.ఇంద్రలోకములోని వైభవాలను చూచి, జనమంతా ఇక్కడి భోగాలను అనుభవిం చడానికే యమలోకానికి రావడానికి ఇష్టపడక స్వర్గం కోసం ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. నా యమలోకము, మరియు స్వర్గలోకమును మించిన మరొకలోకాన్ని నిర్మించాలనే సంకల్పం తో యమధర్మరాజు విశ్వకర్మ ను కలసి,” స్వామీ ! స్వర్గలోకాన్ని మించి సర్వసౌఖ్యములు కలిగిన ఒక సుందర నగరాన్ని నిర్మించమని” ప్రార్థించాడు.
అంతట విశ్వకర్మయమధర్మరాజు కోరిక మేరకు కల్పవృక్షములతోడను, శోభాయమాన మైన మణిమయప్రాకారములు కలిగిన రత్నమయ సౌథములతోడను, గోదావరిప్రాణహిత సంగమ ప్రదేశమున దక్షిణముగా ఒక సుందర పట్టణమును నిర్మించి, ఇచ్చెను. కాలుని కొరకు నిర్మాణము చేయబడిన,ఈశ్వరుడు వెలసిన క్షేత్రము గనుక దీనికి కాళేశ్వరమను పేరు వచ్చినది. ఈ క్షేత్రమునకు నైరుతి యందు దిశ యందు యమగుండ మను తీర్థరాజమును కూడ విశ్వకర్మ నిర్మించి ఇచ్చెను.
విశ్వకర్మ చే నిర్మించి ఇవ్వబడిన కాళేశ్వర క్షేత్రమును,యమగుండమును చూచి మిక్కిలి ఆనందించిన యమధర్మరాజు. ఈ గుండమునందు స్నానమాడిన వారికి మణికర్ణికా ఘట్టము నందు స్నానమాడిన ఫలము కలుగుటకు గాను శివుని గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడు “ఈ గుండము రెండవ మణి కర్ణిక గా పిలువబడి, ఇందులో స్నానము చేసిన వారి పాపములు నశించి పుత్రపౌత్రులు కల్గి వర్థిల్లుదురని” వరమిచ్చెను.
* క్షేత్ర ప్రాశస్త్యము
కాళేశ్వరము నందు నివసించినను, స్మరించినను, దర్శించినను, జ్ఞానాజ్ఞాన జనితములు , మనోవాక్కాయజములైన సర్వపాపములు నశించి, దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రాభివృద్ధి కల్గి దేహాంతమున ముక్తీశ్వరస్వామి కృపవలన ముక్తి కలుగునని కాళేశ్వర యాత్రాఫలమున చెప్పబడినది.
తస్య దర్శన మాత్రేణ భవేన్ముక్తిర్న సంశయ:!
ముక్తీశ: పరమోదేవ: పార్వత్యా సహితో విభు : !!
కాళేశ్వరేపి వసతాం ముక్తి దద్యాన్మహేశ్వర:!
దర్శనమాత్రం చేతనే శుభానందాసహిత ముక్తీశ్వరుడు సర్వజీవులకు మోక్షమునిచ్చును. కాశీనగరము నందు మరణించిననే కాశీవిశ్వేశ్వరుడు ముక్తినిచ్చును కాని కాళేశ్వరమున నివసించు సర్వ ప్రాణులకు ముక్తి లభించును. కావున కాశీక్షేత్రము కన్న కాళేశ్వరము వరిముల్లు వాసి ఎక్కువని ప్రతీతి.
* దివ్యదర్శనం
ఈ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ఒకే పానమట్టం మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామి కి రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రములలో అభిషేక జలము ఎన్ని పోసినను ఒక్కచుక్క కూడ బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపం లో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలియుచున్నది.
ఈ విషయమును నమ్మని భోంస్లే మహారాజు(నాగపూర్ ) ఈ వింతను పరీక్షించడానికి తన పరివారముతో పరిసరగ్రామాలనుండి వేలకొలది బిందెల పాలను తెప్పించి శ్రీ స్వామివారి నాసికా రంధ్రములలో పోయించెనట. ఆ విధంగా పోసిన పాలన్నియు కానరాకుండా పోయి నందుకు ఆశ్చర్య పోయిన మహారాజు గ్రామస్తులతో కలిసి గోదావరికి వెళ్లి చూడగా ఆ పాలు ప్రణీత, గోదావరి సంగమములో కలియుటను గమనించి, తప్పును అంగీకరించి,శ్రీ స్వామిని క్షమాపణ వేడుకున్నాడట.
* ఉపాలయాలు
ఇచ్చట శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారల ప్రధాన ఆలయముతో పాటు శుభానందాదేవి (పార్వతీ దేవి ), మహాసరస్వతి,కోదండరామాలయము, ఆది ముక్తీశ్వర స్వామి, సంగమేశ్వర, దత్తాత్రేయ , సూర్యదేవాలయాలు కలవు.
త్రిలింగ క్షేత్రాల మధ్య ప్రదేశం కావడం వల్లనే తెలంగాణకు ఆ పేరు వచ్చింది. త్రిలింగ క్షేత్రాలు మూడు. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. శ్రీశైలం, ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, కాళేశ్వరం తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలంలో ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాషా్ట్రల సరిహద్దులో గోదావరి, ప్రాణహిత, సరస్వతీ (అంతర్వాహిని) మూడు నదుల కలయికతో కూడింది ఈ క్షేత్రం. ఎంతో ప్రాచీనమైన ఇక్కడి దేవాలయంలో ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉన్నాయి. అవి కాలుడు (యమధర్మరాజు), ఈశ్వరుడు (శివుడు). ప్రపంచంలో మరెక్కడా ఈ విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు కనిపించవు. అందుకే ఈ క్షేత్రము కాళేశ్వర క్షేత్రంగా పిలువబడుతోంది.
* కాళేశ్వరంలోని చూడవలసిన ప్రదేశాలు..
* ప్రపంచంలో మరెక్కడా లేని ఒకే పానవట్టంపై శివుడు, కాలుడి విగ్రహాలు :
* త్రివేణి సంగమం : గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహినిగా)ల సంగమ క్షేత్రం
* యమకోణం : ఆలయ ఆవరణలోని యమ కోణంలో నుంచి దూరితే బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం.
* అష్ట తీర్థాలు: కాళేశ్వరంలో అష్ట(8) తీర్థాలు ఉన్నా యి. బ్రహ్మతీర్థం, చిత్సుక తీర్థం, జ్ఞానతీర్థం, పక్షి(వాయుస) తీర్థం, సంగమ తీర్థం, నృసింహ తీర్థం, హనుమ తీర్థం, వ్యాస తీర్థం.
* స్వామి వారి నాసికా రంధ్రాలు: ప్రధాన ఆల యంలోని ముక్తీశ్వరునికి రెండు నాసికా రంధ్రాలు న్నాయి. ఈ నాసికా రంధ్రాల్లో అభిషేకానికి ఎన్ని పాలు లేదా నీళ్లు పోసినా లోనికి పోతూనే ఉంటాయి.
* హైదరాబాద్‌ టు కాళేశ్వరం
* హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం సుమారు 260 కి.మీ దూరంలో ఉంది.
* వరంగల్‌ నుంచి 120 కి.మీ దూరంలో ఉంది.
* జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ నుంచి 140 కి.మీ దూరంలో ఉంది.
* బస్సు సౌకర్యం :
వరంగల్‌ నుంచి పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా కాళేశ్వరంనకు చేరుకోవచ్చు.
హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, పెద్దపల్లి, మంథని, మహదేపూర్‌ నుంచి కాళేశ్వరం వెళ్లొచ్చు.
కాళేశ్వరంనకు హన్మకొండ నుంచి ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు గంటకో బస్సు ఉంది.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి రోజూ ఉద యం, రాత్రి 8.30 ని.లకు కాళేశ్వరంనకు బస్సు సౌకర్యం ఉంది.
కరీంనగర్‌, గుంటూరు, మెట్‌పల్లి, సిరిసిల్ల వేము లవాడ, పెద్దపల్లి తదితర పట్టణాల నుంచి ప్రతీరోజు బస్సు సౌకర్యం ఉంది.
రైలు మార్గం :
కాళేశ్వర క్షేత్రానికి నేరుగా రైలు సౌకర్యం లేదు.
కాజిపేట, వరంగల్‌ స్టేషన్‌ల వరకు రైలులో వచ్చి అక్కడి నుంచి బస్సులో 120కి.మీ ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు.
హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ మీదుగా పెద్దపల్లి, రామగుండం స్టేషన్‌ల వరకు రైలులో అక్కడి నుంచి 100 కి.మీ బస్సులో ప్రయాణిస్తే కాళేశ్వరం వస్తుంది ఈ దేవాలయంలో ఒకే పానపట్టం పై..శివుడు, యముడు వెలిశారు.
కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ ..గోదావరి,ప్రాణహిత నదులతో పాటు, అంతర్వాహినిగా సరస్వతీనది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమై
దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందినది.భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద..ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై ..రెండు లింగాలు ఉండటం విశేషం.
ఒకటి కాళేశ్వరలింగం..రెండవది ముక్తీశ్వర లింగం.ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుంది.ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి..అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం.
ఆలయం లో .. లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది.. ఇందులో నుండి బయటకి వెళ్ళినట్లయితేయమ దోషం పోతుంది ..అని భక్తులు
విశ్వసిస్తారు..
ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Satyavarapu Varalakshmi.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...