Sunday, May 27, 2012

మన పిల్లల చదువులు - కొంచెం ఆలోచించండి!



మా మిత్రుని అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం వాడు నా దగ్గరకు రెండు రోజులు సంస్కృతం చెప్పించుకునేందుకు వచ్చాడు. ఫలితాలు వచ్చాక, ఫోన్ చేసి "థాంక్స్ అంకుల్, నాకు 96 మార్కులు వచ్చాయి సంస్కృతంలో" అన్నాడు.
నేను నవ్వుతూ, "అది సరే! నీకు ఇన్ని మార్కులు వచ్చాయి కదా? మరి, పుస్తకం చూస్తూ అయినా ఓ నాలుగు వాక్యాలు చదువగలవా? " అని అడిగాను.
అందుకు వాడు చెప్పిన సమాధానం నన్ను దిగ్భ్రాంత పరిచింది. వాడేమన్నాడంటే..." పోండి అంకుల్, మీరు భలేగా అడిగారు. అలాగంటే మా సంస్కృతం మాష్టారు కూడా చదవ లేరు, తెలుసా?" అని. తలమీద ఎవ్వరో రోకలితో మోదినట్టయింది.

ఆ తర్వాత, మనమందరం చూడనే చూసాము. ఫలితాలు వచ్చిన మరునాడు కార్పోరేట్ కాలేజీలవారు ఇంటర్ బోర్డ్ ముందు చేసిన హంగామా, ‘ఫిజిక్స్ పేపర్
నియమ విరుద్ధంగా వచ్చింద’ని. నియమ విరుద్ధత అంతా, కేవలం, పేరుమోసిన రెండు కార్పోరేట్ కాలేజీలవారు తయారు చేసిన "ఇంపార్టెంట్ క్వష్చన్స్" నుండి ప్రశ్నలు ఇవ్వక పోవడమే.

అంతే కాదు, ఇంటర్ లో 93% మార్కులు వచ్చిన మేధావి అయిన విద్యార్థి, ఎమ్‌సెట్‌లో 93000 పై మాట రాంక్ తెచ్చుకుంటాడు. అటువంటివారు నేను చూసిన వారిలో 90% ఉన్నారు.

దీనివల్ల ఏమి తెలుస్తుంది? మన పిల్లలకు సంస్కృతమే కాదు, గణిత, భౌతిక,రసాయన శాస్త్రాలు కూడా అంతంతే వస్తున్నాయని. మరి, లోపమెక్కడుందో ఆలోచించుకునే తీరిక మనకు ఉందా?

భగవంతుడా! నా జాతికి సరియైన బౌద్ధికజవసత్వాలు ప్రసాదించు తండ్రీ!

Saturday, July 5, 2008

మధుమేహానికి మందు

మధుమేహానికి బాగా పని చేస్తుందంటూ శాస్త్రుల భార్గవ రామ శర్మ గారు చెప్పిన మందును ఇక్కడ అందరికీ తెలియాలని రాస్తున్నాను.

పొడపత్రి ఆకు (మేకమేయని ఆకు) 100 గ్రా.
నేరేడు పండ్ల చూర్ణం 100 గ్రా.
మెంతులు 200 గ్రా.
దాల్చిన చెక్క 10 గ్రా.
లవంగాలు 10 గ్రా.
ఇలాయిచీ 10 గ్రా.
జీలకర్ర 3 చెంచాలు
సోపు 50 గ్రా.
చేదు జీలకర్ర
నువ్వులు

వీటిని ఎండనిచ్చి,దోరగా వేయించి,చూర్ణం చేసి ప్రతిరోజూ 25 గ్రాములు సేవించాలి. ఇది చక్కగా పని చేస్తుందని వారు చెప్పారు.అవసరమైన వారు ప్రయత్నించి చూడవచ్చు.

Thursday, May 8, 2008

Ramayana,Mahaa Bharatha

తెలుగు పరిశోధన సైట్ లో వాల్మీకీయ రామాయణం, వ్యాస భారతం పుస్తకాలు చేరినాయి. మీరూ చూసి,మీ అభిప్రాయం రాయండి.
keep visiting:-
www.teluguthesis.invisioni.com for Telugubooks

www.teluguthesis.blogspot.com for feedings

Sunday, May 4, 2008

Books related to Bharatham

భారతానికి సంబంధించిన పుస్తకాలు తెలుగు పరిశోధన
www.teluguthesis.invisioni.com
సైట్ లో కొన్ని లభిస్తున్నాయి.అవి-

1) భారతం ధర్మాద్వైతం
2) మహాభారతం ఉపదేశం
3) ఆంధ్ర భారత కవితా విమర్శనము
4) మహా భారత నిఘంటువు
ఈ పుస్తకాలు చదువరులకు ఉపయోగ పడుతాయనే నా ఆలోచన.చూడండి.

Wednesday, April 16, 2008

మద్య మాంస భక్షణ గురించి.....

మద్య మాంస భక్షణ గురించి.....

గతంలో నేను రాసిన వలసవాదం లో మ్లేచ్చ పద సందర్భంలో మాంస భక్షణ ప్రస్తావన వచ్చింది.మిత్రులు బ్రాహ్మణులు కూడా గోమాంసం తిన్నవారేగా?అని కూడా అన్నారు.కొన్ని ప్రమాణాలు కూడా సూచించారు.వాటిని నేను కనుగొనలేక పోయాను.

ఈ విషయం నా మిత్రులవద్ద చర్చకు వచ్చింది. అందులో ఒక మిత్రుడు అన్నాడు...

"గతంలో బ్రాహ్మణులు మద్యమాంసాలు తిన్నారనడానికి నిదర్శనాలు ఉన్నాయి.
1. శుక్రాచార్యుడు మద్యం తాగిన తర్వాతనే కదా మద్యాన్ని నిషేధించింది? 2. పితృ దైవత కార్యములం దతి భక్తిని మాంసమిడుట ధర్మమనియు...శేషాన్ని ప్రీతిగా తినాలని శాస్త్రాల్లో ఉందనీ.. ధర్మవ్యాధోపాఖ్యానం. (భారతం-ఆధారం)

కాబట్టి మద్యమాంసాలను బ్రాహ్మణులూ తినాల్సిందే".
దానికి నేనన్నాను మిత్రునిగా నన్ను తినేట్టుగా చెయ్యాలనుకుంటే అది వేరు కాని... సిద్ధాంతాన్ని అందరికీ అంతగట్టడం ఎందుకు? అని...

Monday, April 7, 2008

తెలుగుకు మనమేం సేవ చేస్తున్నాం?

ఇదే ప్రశ్న వేసుకొని,నేను చేయగలిగిన సేవ కనుగొన్నాను.

మన తెలుగు భాషా సాహిత్యాల్లో ఎన్నో పరిశోధనా గ్రంథాలు వెలువడ్డాయి.ఇంకెన్నో గ్రంథాలు వెలువడుతున్నాయి కూడా.కానీ ఎన్నో గ్రంథాలు ఎంతో మందికి అందుబాటులో లేవు.అందుకే అందరికీ తెలుగు పుస్తకాలు అందుబాటులోకి తేవాలని సంకల్పించా.ఇంటర్ నెట్ లో పెడితే అందుబాటులోకి వస్తాయని ఆ ప్రయత్నం ప్రారంభించా.

ఇందుకు నేనేం చేసాను?

ఒక సైట్ ప్రారంభించా.ఒకటి,రెండు పుస్తకాలు పెట్టా.జాతికి అంకితం చేసా.ఇక ఆ సైట్ భవిష్యత్తు మీ చేతిలో ఉంది.పదిమంది చేయి వేస్తే భావికాలంలో ఈ సైట్ అందరికీ అక్కరకు వస్తుంది.ఒక గొప్ప తెలుగు గ్రంథాలయం పదికాలాల పాటు పదిమందికి అందుబాటులో ఉంటుంది.

మీరేం చేయాలి?

1. ఆ సైట్ దర్శించండి. దాని చిరునామా:- http://teluguthesis.invisioni.com/

2. ఉచితంగానే పేరు నమోదు చేసుకోండి.Log in

3. మీరేవైనా పుస్తకాలు పెట్టదలుచుకుంటే పెట్టండి.లేదా ఉన్నపుస్తకాల్లోనుంచి ఎవైనా ఉచితంగానే Download చేసుకోండి.

4. మీ అభిప్రాయాన్ని అక్కడ తప్పని సరిగా రాయండి.

5. మీ బంధుమిత్రులకు ఈ సైట్ గురించి చెప్పండి.వారినీ తమవంతు సహకారం అందిచమని చెప్పండి.

ఇవి చేస్తే చాలు తెలుగు జాతికి ఒకవిధంగా మీ వంతు సహకారం అందించిన వారవుతారు.ఒక ముఖ్య గమనిక. ఈ సైట్ ఏ విధమైన వ్యాపార దృక్పథంతో ప్రారంభించింది కాదు. డబ్బుల ప్రసక్తి ఎక్కడా లేదు. ఏ మహత్ కార్యమైనా ఏ ఒక్కరితోనో మాత్రం కాదు.అందరి సహకారం అవసరం. చేసుకొంటే అందరికీ మంచిదే కదా?

మీరు తప్పక చేయవలసింది-

ప్రస్తుతం ఆ సైట్ sub domaine గా ఉంది.ఉచితంగా వచ్చింది కదా?అందుకే.

అయితే దాన్ని teluguthesis.com పేరుతో స్వతంత్రంగా చెయ్యాలని కోరిక.దానికి మీ సహకారం చాలా అవసరం.

50 మంది సభ్యులు,2000 posts చేస్తే own domain ఉచితంగానే చేస్తారు.

కాబట్టి సభ్యులుగా చేరండి. (థాంక్స్,బాగుంది...ఇలా) ఏదో ఒకటి అక్కడ పొస్ట్ చేయండి. మొత్తానికి లక్ష్యాన్ని అధిగమింపజేయండి.

మీరేం చేయాలో చెప్పా.నేనేం చెసానో చెప్పా. ఇక మీ ఇష్టం.

Saturday, April 5, 2008

మనమేం రాస్తున్నాం?

మన నిత్య వ్యవహారంలో రాతకు ఎంతో ప్రాధాన్యముంది.ఈ రాతకు ప్రామాణికత విద్యున్మాధ్యమాలు(Elocronic media) / పత్రికలు/పుస్తకాల ద్వారా సమకూరుతుంది. వీటిలోనే తప్పులుగా రాస్తుంటే సాధారణ మానవునికీ అదే అలవాటు ఔతుంది. కాబట్టి వీలైనంత వరకు రచయితలు రచనల్లో జగ్రత్త వహిస్తే బాగుంటుంది.
సాధారణంగా మనం చేసే పొరపాట్లు-
1) స,శ,ష ల మధ్య తేడా గమనించక పోవడం.
ఉదా:- రమేశ్,సురేశ్,వేంకటేశ్ పదాలను -
రమేష్,సురేష్,వేంకటేష్ అని రాస్తున్నారు.

2) కైలాసం అనే పదం నుండి పుట్టిన పదాన్ని- కైలశ్/కైలాష్ అని రాస్తున్నారు.
3) క్రియల్లో "చెప్పాడు" అనే పదం ఎలా పుట్టిందో చూద్దాం.
చెప్పిన + వాడు> చెప్పినాడు> చెప్పాడు.
అట్లే చేసిన+వాడు ఏమి కావాలి?
చేసిన+వాడు>చేసినాడు>చేసాడు.
కానీ మనమేం రాస్తున్నాం? "చేశాడు".
ఇక్కడ ’స’ , శ గా ఎలా మారుతుంది?
ఇటువంటి వాటిల్లో జాగ్రత్త వహించాలి.